ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే.. | Vijay Himanta Suvendu Pinarayi Among Key Winners | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..

May 4 2026 8:00 PM | Updated on May 4 2026 9:20 PM

Vijay Himanta Suvendu Pinarayi Among Key Winners

ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్‌. ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయనున్నాయో తెలిసిపోయింది. తమిళనాడులో ఈ ఎన్నికలు పాత పార్టీలపై వ్యతిరేకత, కొత్త నాయకత్వం పుంజుకోవడాన్ని చూపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ప్రభావం, బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల, కేరళలో పాలనా మార్పు కనపడింది. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచింది.

ఈ ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..

విజయ్ (తమిళనాడు, టీవీకే అధినేత)
తమిళనాడులో రాజకీయాల్లో మొదటి అడుగులోనే భారీ విజయం సాధించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. పెరంబూర్‌, తిరుచ్చిలో గెలిచారు. ఆయన పార్టీ టీవీకే సంచలనం సృష్టించింది.

హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం, బీజేపీ నేత)
అస్సాంలో తన నాయకత్వాన్ని మరోసారి బలంగా నిలబెట్టుకున్నాడు. జలుక్‌బరిలో గెలుపొందారు.

సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్‌, బీజేపీ నేత)
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలం పెరగడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నందిగ్రామ్‌లో గెలుపొందారు.

పినరయి విజయన్ (కేరళ సీఎం, సీపీఎం)
ధర్మడం నియోజక వర్గం నుంచి పినరయి విజయన్ విజయం సాధించారు. అయితే, కేరళలో ఆయన అధికారాన్ని కోల్పోయారు.

మమతా బెనర్జీ  (పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి)
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయారు. ఎమ్మెల్యేగానూ గెలవలేదు. భవానీపూర్‌లో మమతా బెనర్జీపై సువేందు అధికారి గెలిచారు.

ఉదయనిధి స్టాలిన్‌ (తమిళనాడు, డీఎంకే నేత)
తమిళనాడులోని చెపాక్‌ నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్‌ గెలుపొందారు. 

వీడీ సతీశన్ (కాంగ్రెస్‌-కేరళ)
వీడీ సతీశన్ పరవూర్‌ నియోజక వర్గం నుంచి గెలిచారు. కేరళలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు తీసుకురావడంతో కృషి చేశారు.  

పళనిస్వామి (తమిళనాడు మాజీ సీఎం) 
పళనిస్వామి విజయం సాధించారు. ఎడప్పడి నియోజక వర్గం నుంచి ఆయన గెలుపొందారు.

స్టాలిన్‌, గోగోయ్ ఓటమి 
ఎంకే స్టాలిన్ (తమిళనాడు సీఎం)
తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ ఎదురుదెబ్బ తిన్నారు. కొళత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కూడా వెనుకబడింది.

గౌరవ్ గోగోయ్ (అస్సాం, కాంగ్రెస్‌)
జోర్హాత్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గౌరవ్ గోగోయ్ ఓటమి పాలయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement