ఎవరి జెండా మోయకుండా.. ఏ పొత్తు లేకుండా! | Tamil Nadu Results 2026, Vijay’s TVK Storm Shakes Tamil Nadu Politics, Dethrones DMK-AIADMK Dominance | Sakshi
Sakshi News home page

ఎవరి జెండా మోయకుండా.. ఏ పొత్తు లేకుండా!

May 4 2026 10:55 AM | Updated on May 4 2026 12:07 PM

TN Results: Vijay Party Vigil Sound Resound Around India

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ‘విజిల్‌’ మోత దేశం మొత్తం మారుమోగుతోంది. విజయ్‌ మేనియా ధాటికి అధికార ప్రతిపక్ష పార్టీల కూటములు విలవిలలాడిపోయాయి. గత ఐదు దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను.. వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసి రెండేళ్ల పసికూన పార్టీ టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.

తమిళనాట టీవీకే ప్రభంజనం కొనసాగుతోంది. ప్రధానంగా ఆ పార్టీ దెబ్బకు అధికార డీఎంకేకు మాస్టర్‌ స్ట్రోక్‌ తగిలింది. డీఎంకే ప్రధాన అభ్యర్థులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. సంబురాల కోసం వేసిన టెంట్లు కూడా తీసేసి వెళ్లిపోయారంటే ఏ రేంజ్‌లో నైరాశ్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే రెండో స్థానానికి పరిమితమయ్యే చాన్స్‌ కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమిళ ఓటర్లు విజయ్‌ పార్టీ టీవీకే ఇచ్చిన ‘మార్పు’ అనే నినాదానికి పట్టం కట్టారు.

#Trending : TVK Vijay Running Tamilnadu Election Results 2026 2

తమిళనాట అగ్రనటుడిగా విజయ్‌ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. 2009లో ఏర్పడిన తన విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం అనే ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ను.. 2014లో ఫిబ్రవరి 2వ తేదీన తమిళగ వెట్రి కగళం అనే పార్టీగా ఏర్పాటు చేశారు విజయ్‌. 2026 ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యమని ఆనాడే ఆయన ప్రకటించారు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారాయన. ఈ ప్రకటనలు యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. రెండేళ్లలో ఈ పవర్‌ మ్యాజిక్‌ సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. 

#Trending : TVK Vijay Running Tamilnadu Election Results 2026 6

దానికి తగ్గట్లే తాను ఏ పార్టీ జెండా మోయబోమని.. సింహం సింగిల్‌గానే పోటీ చేస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూ వచ్చారాయన. ఈ ప్రకటన రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఒంటరి పోరుతో విజయ్‌ ఏం సాధించలేడని తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్‌ మీద ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ కూడా పెరిగింది. 

#Trending : TVK Vijay Running Tamilnadu Election Results 2026 12

ఈలోపు విజయ్‌ ఎన్నికల ర్యాలీలో భాగంగా కరూర్‌లో జరిగిన తొక్కిసలాట.. ఆపై సీబీఐ దర్యాప్తు.. దీనిని ఆసరగా చేసుకుని తమ కూటముల్లో చేరాలని జాతీయపార్టీల నుంచి ఒత్తిళ్లు.. చివరి సినిమా జన నాయగన్‌ రిలీజ్‌ ఆగిపోవడం(సెన్సార్‌ ఇబ్బందులు).. వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం.. ఇవన్నీ దళపతిని కుంగదీయడం ఖాయమని అంతా భావించారు. అయితే.. విజయ్‌ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటానని.. మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని కేడర్‌కు బలం అందించారు. 

యువత, మహిళలను ఎక్కువగా ఆకట్టకునేలా ఎన్నికల హామీలిచ్చారు. ఫలితంగా.. ఏ కూటమితో జట్టు కట్టకుండా.. ఒంటరిగా అన్నీ స్థానాల్లోనూ పోటీ చేసిన విజయ్‌కు అత్యధిక స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు తమిళనాడు ఓటర్లు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement