తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుపై మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు.
‘‘తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఇప్పటికీ టీవీకే నాయకుడు విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు గవర్నర్ వెంటనే టీవీకే నాయకుడిని రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆయనను ముఖ్యమంత్రిగా నియమించి, సభలో మెజారిటీ నిరూపించుకునేలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని అన్నారు.
కాగా, గురువారం (ఏప్రిల్ 7న) ప్రమాణ స్వీకారం చేద్దామని టీవీకే విజయ్ భావించి అందుకు ప్లాన్ వేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందుగా మెజారిటీ మద్దతుకు ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. దీంతో టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.
తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్ కోసం ఇంకా సీట్లు అవసరం.
It is shocking that despite TVK being the single largest party in the Tamil Nadu State Assembly Elections, the TN State Governor has not yet invited the TVK leader, Mr Vijay, to form the Government.
I demand that in the interest of Democracy, the Governor of Tamil Nadu…— Subramanian Swamy (@Swamy39) May 6, 2026


