తమిళనాట అగ్రనటుడు విజయ్‌ది ఒక ప్రత్యేక శైలి. నటుడిగానే కాదు.. యువతకు ఆయనో రోల్ మోడల్. ముసుగులేసుకుని ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు మద్దతు ప్రకటించడం, అభిమానులను పరామర్శించేందుకు మారువేషంలో వెళ్లడం.. ఇలా చాలాసార్లు జరిగిందే. అలాగే ఓటు వేసే టైంలోనూ ఆయన ఓ ప్రత్యేకతను ప్రదర్శించేవారు.
పోలింగ్ కేంద్రానికి కాన్వాయ్ లాంటి హడావిడి లేకుండా.. సింపుల్‌గా సైకిల్ మీద వచ్చి ఓటేయడం ఆయనకు అలవాటుగా ఉండేది. ఎందుకని అడిగితే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణహితం, ప్రజాస్వామ్యానికి అంకితభావం అంటూ యువతకు మంచి మేసేజ్ ఇచ్చేవారు. అంతేకాదు.. ఎంత ఆలస్యమైనా సరే క్యూ లైన్‌లో నిల్చుని ఓటేసి వెళ్లిపోయేవారు. 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కాదు.. అంతకు ముందు కూడా ఆయన సింప్లిసిటీ గురించి నెట్టింట జోరుగా చర్చ నడిచేది. అయితే..

మొదటిసారి రాజకీయ నాయకుడిగా ఆ సంప్రదాయానికి ఆయన బ్రేకులు వేశారు. ఈసారి భారీగా టీవీకే శ్రేణులు, అభిమానుల కోలాహలం నడుమ కాన్వాయ్‌లో చెన్నైలోని నీలంకరైలో ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. ఆ సమయంలో క్రౌడ్‌కంట్రోల్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో క్యూ లైన్‌లో కాకుండా ఆయన్ని పక్క నుంచి లోపలికి పంపి ఓటేసేందుకు అనుమతించారు పోలింగ్ సిబ్బంది.
విజయ్ ఈసారి తన టీవీకే పార్టీతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. మొత్తం 234 స్థానాల్లోనూ ఆయన అభ్యర్థులను నిలిపారు. ఆయన కూడా పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్.. రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. టీవీకే పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా విజయ్ పేరునే ఖరారు చేశారు.
#WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, at a polling station in Chennai after casting his vote. pic.twitter.com/yCXPjQyJEh
— ANI (@ANI) April 23, 2026
#WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, leaves after casting his vote at a polling station in Chennai. pic.twitter.com/lvVizuciek
— ANI (@ANI) April 23, 2026


