ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్‌ నామినేషన్ దాఖలు | Tamil Nadu Elections 2026 Udhayanidhi Stalin Vijay file nomination | Sakshi
Sakshi News home page

ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్‌ నామినేషన్ దాఖలు

Apr 2 2026 12:24 PM | Updated on Apr 2 2026 3:37 PM

Tamil Nadu Elections 2026 Udhayanidhi Stalin Vijay file nomination

చెన్నై: తమిళనాడు ఎన్నికల‍్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ (ఏప్రిల్‌ 2న) నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉధయనిధి స్టాలిన్‌ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడే ఉదయనిధి స్టాలిన్‌ అన్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్‌ 2024 సెప్టెంబరు 28న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2022 డిసెంబరు 14 నుంచి క్యాబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు.

మళ్లీ ర్యాలీ నిర్వహించిన టీవీకే విజయ్‌
టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ తిరుచిరాపల్లిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 30న పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై కేసు నమోదైంది.

మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. 

ఇవాళ  రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ మళ్లీ విజయ్‌ రోడ్‌ షో నిర్వహించడం గమనార్హం. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా, విజయ్ తనకు రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో ప్రకటించారు.

TVK విజయ్ నామినేషన్ దాఖలు
 

Advertisement
 
Advertisement
Advertisement