జస్ట్‌ మిస్‌ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ | TVK Wave Sweeps Tamil Nadu But Just Miss in 12 Seats Costs Clear Majority | Sakshi
Sakshi News home page

జస్ట్‌ మిస్‌ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ

May 7 2026 8:01 AM | Updated on May 7 2026 11:41 AM

TVK Wave Sweeps Tamil Nadu But Just Miss in 12 Seats Costs Clear Majority

తమిళనాడు: తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్‌ మిస్‌ కావడం  ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్‌ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం.

 ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్‌ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని  తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి  అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్‌ మిస్‌ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని  జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement