బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధం | West Bengal Elections Phase 1 and tamil nadu polls | Sakshi
Sakshi News home page

బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధం

Apr 22 2026 7:28 PM | Updated on Apr 22 2026 8:51 PM

West Bengal Elections Phase 1 and tamil nadu polls

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల (152 స్థానాలకు)తో పాటు తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గురువారం (ఏప్రిల్‌ 23) ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే4న వెల్లడవుతాయి.  

పశ్చిమ బెంగాల్‌లో.. 
పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌లో 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 8,000కి పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. 

  • ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 

  • భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో క్యూలు భారీగా ఉండకుండా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

  • అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 3,60,77,171 ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 

  • వీరిలో మంది 1,84,99,496 పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, 465 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

  • మొదటి దశలో పోలింగ్‌ జరిగే ప్రాంతాలు: మొదటి దశలో ఉత్తర బెంగాల్ జిల్లాలు డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బేహార్ ప్రాంతాలు, అలాగే జంగల్ మహల్, పురులియా, బాంకురా, పశ్చిమ మేదినిపూర్, బీర్బూమ్, ముర్షిదాబాద్ భాగాలు ఉన్నాయి.

  • వోటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లి వేయాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. 

తమిళనాడులో

  • తమిళనాడులో 5.73 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.

  • ఇందులో 2.93 కోట్ల మహిళా ఓటర్లు, 7,728 ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 

  • మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

  • వాటిలో 249 మోడల్ బూత్‌లు, 325 మహిళలు నిర్వహించే బూత్‌లు, 71 దివ్యాంగులు నిర్వహించే బూత్‌లు ఉన్నాయి.

  • ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) రాష్ట్రవ్యాప్తంగా వినియోగానికి సిద్ధం చేశారు. 

  • మొత్తం 1,06,418 బ్యాలట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, 75,064 వివిప్యాట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 

  • మొత్తం 3,60,068 పోలింగ్ సిబ్బంది ఈ కేంద్రాల్లో విధుల్లో ఉంటారు.

  • అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. 

  • మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.

  • తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 

  • సాయంత్రం 6 గంటలకు ముందు వచ్చి క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకు ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. 

  • ఏప్రిల్ 23న తమిళనాడులో పబ్లిక్ హాలిడే.

  • బస్సులు, మెట్రో, స్థానిక రవాణా సేవలు సాధారణంగా నడుస్తాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు సౌకర్యంగా ఉంటుంది.

  • పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి.  
     

Advertisement
 
Advertisement
Advertisement