అతని టార్గెట్‌ బంజారాహిల్స్‌ అమ్మాయిలే..! | Jubilee Hills Police Bust Instagram Cheater | Sakshi
Sakshi News home page

అతని టార్గెట్‌ బంజారాహిల్స్‌ అమ్మాయిలే..!

Apr 20 2026 7:57 AM | Updated on Apr 20 2026 7:57 AM

 Jubilee Hills Police Bust Instagram Cheater

హైదరాబాద్: సంపన్న వర్గాల బాలికలే లక్ష్యంగా వల విసురుతాడు. వారిని ప్రేమలోకి దింపుతాడు. ఆపై వ్యాపారం పేరుతో రూ.లక్షలు వసూలు చేసి పలాయనం చిత్తగిస్తున్నాడు. ఇలా బాలికలు, యువతులను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆదివారం జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని గుంటూరుకు చెందిన కోడూరి చంద్రశేఖర్‌ ఆజాద్‌ (29) కూకట్‌పల్లిలో ఉంటూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. 

జూబ్లీహిల్స్‌కు ఓ బాలికను చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఎలియాస్‌ అర్జున్‌ ఇన్‌స్టా్రగామ్‌లో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నాంటూ వెంటబడ్డాడు. తరచూ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ విషయం గత ఏడాది ఏప్రిల్‌లో బాలిక తల్లికి తెలియడంతో చంద్రశేఖర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత మళ్లీ బాలికను కలుసుకున్నాడు. స్టార్టప్‌ పెడుతున్నానంటూ ఆమె నుంచి రూ.13.11 లక్షలు వసూలు చేశాడు.  

రూ.9 లక్షలు గుంజిన కారు డ్రైవర్‌ భార్య.. 
బాలికకు తల్లిదండ్రులు ఫోన్‌ ఇవ్వకుండా కట్టడి చేయడంతో.. కారు డ్రైవర్‌తో పాటు ఆయన భార్య ఫోన్ల నుంచి చంద్రశేఖర్‌కు ఫోన్లు చేసేది. ఈ విషయంలో డ్రైవర్‌ భార్య.. చంద్రశేఖర్‌తో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులతో చెబుతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.9 లక్షలు వసూలు చేసింది. ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ బాలికతో ప్రేమలో ఉండగానే నార్సింగికి చెందిన మరో యువతితో చంద్రశేఖర్‌ తిరగసాగాడు. ఇలా ఇద్దరి నుంచి ముగ్గురు యువతులను ప్రేమలోకి దింపి వారిని మోసగించి రూ.లక్షల్లో డబ్బులు లాగేవాడు. ఈ క్రమంలో ఓ కారు కూడా కొనేసి అమ్మాయిలతో తిరుగుతూ తాను ధనవంతుడినంటూ నమ్మబలికేవాడు. బాధిత బాలిక ఇచి్చన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు రెండోసారి చంద్రశేఖర్‌ను రిమాండ్‌కు తరలించారు.  

మరో యువతి ఫిర్యాదు.. 
ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ చంద్రశేఖర్‌పై మరో యువతి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి బంగారు గొలుసు కూడా తీసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 69, 318 (2) కింద కేసు నమోదు చేసి జీరో ఎఫ్‌ఐఆర్‌ను నార్సింగ్‌ ఠాణాకు బదిలీ చేశారు. ప్రేమ పేరుతో చంద్రశేఖర్‌ ఇప్పటివరకు సుమారు 10 మందిని మోసగించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement