వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన రెండో రోజు కొనసాగింది. భారీ జన సందోహం అడుగడుగునా ఆయనకు స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో పార్టీ శ్రేణులకు చెందిన పలువురి కుటుంబాలను స్వయంగా పరామర్శించారాయన.
కొన్ని చోట్ల ఆయనకు పలువురు తమ సమస్యలపై మొరపెట్టుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తానని వాళ్లందరికీ ఆయన హామీ ఇస్తూ ముందుకు సాగారు.


