ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు.. చర్చలకు సిద్దం: మంత్రి పొన్నం | Telangana RTC Employees Strike Updates | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు.. చర్చలకు సిద్దం: మంత్రి పొన్నం

Apr 22 2026 6:48 AM | Updated on Apr 22 2026 3:25 PM

Telangana RTC Employees Strike Updates

తెలంగాణలో ఆర్టీసీ ​కార్మికుల సమ్మె అప్‌డేట్స్‌.. 

ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

  • ఆర్టీసీ సోదరులు సమ్మె విరమించాలి
  • ఆర్టీసీ మనందరి కుటుంబం…కార్మికులు మా సోదరులు..
  • సమ్మె విరమించి విధుల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా
  • సమ్మె సమస్యకు పరిష్కారం కాదు… ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం కోరుతోంది.
  • మీ సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేశాం… 4 వారాల్లో నివేదిక వస్తుంది.
  • మీరు లేవనెత్తిన విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి అంశాలు సాంకేతికంగా పరిశీలనలో ఉన్నాయి
  • ఈ రెండు కీలక విషయాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించే పనిలో ఉన్నాం

ఆర్టీసీని కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీ: అద్దంకి

  • ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్‌..
  • ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి
  • కుట్రదారులను కార్మికులు నమ్మవద్దు
  • ఆర్టీసీని కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీ
  • ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని కేసీఆర్ అండ్ కో భావించింది
  • కేసీఆర్ కోసం కొందరు చేసే సమ్మెకు కార్మికులు సహకరించవద్దు
  • ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్, మంత్రి పొన్నం అండగా ఉంటారు

 

చర్చలకు సిద్దం: మంత్రి పొన్నం

  • ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్దం.
  • సమ్మె విరమించి చర్చలకు రండి.
  • 32 సమస్యల్లో 29 అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
  • కమిటీ వేశాం.. నాలుగు వారాల సమయం అడిగాం.
  • 2018లో ఈవీ బస్సులు మొదలయ్యాయి.
  • ఈవీ బస్సులు కేంద్రం నిర్ణయం
  • ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం.
  • గత ప్రభుత్వ చర్యలు గుర్తులేదా?.
  • హరీష్‌ రావు వెనుక ఉండి సమ్మెను నడిపిస్తున్నారు.
  • ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు.  

 

నిర్మానుష్యంగా ఎంజీబీఎస్‌

  • ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెలవెలబోతున్న బస్టాండ్‌
  • బస్సులు లేకపోవడంతో ఖాళీగా ఎంజీబీఎస్‌.  

 

హైదరాబాద్..

  • ప్రతీ రోజు 6779 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ.
  • సమ్మె కారణంగా 1247 బస్సు లు నడుపుతున్న ఆర్టీసీ..
  • సాయంత్రం వరకు మరికొన్ని బస్సుల సర్వీసులు పెంచుతామంటుంన్న ఆర్టీసీ.
  • ఈరోజు 9 గంటల వరకు కేవలం 18% బస్సులు మాత్రమే నడిపిన ఆర్టీసీ..
  • ఇందులో 634 ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు..
  • ఎలక్ట్రిక్ బస్సులు 467 నడుపుతున్నారు...
  • మొత్తం 4 శాతం బస్సులను నడుపుతున్న ఆర్టీసీ..
  • పోలీసుల భద్రత మధ్య డిపోల నుంచి బస్సులు ముందుకు సాగుతున్నాయి. 

 

ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం అలర్ట్‌..

  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
  • 12 గంటలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్..
  • ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించనున్నట్టు సమాచారం. 

నల్లొండలో నిలిచిపోయిన 350 బస్సు సర్వీసులు

  • ఉమ్మడి నల్లొండ జిల్లాలో నిలిచిపోయిన 350 బస్సు సర్వీసులు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పాక్షికంగా సాగుతోంది.
  • ఉమ్మడి నల్గొండలో 180కి పైగా ఎలక్ట్రిక్, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 డిపోల్లో 350కి పైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.

 

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బంద్ సంపూర్ణం

  • కార్మికుల సమ్మెతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ డిపో మూతపడింది.
  • బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయాయి.
  • బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు.
  • పోలీసుల పహారా మధ్య ఇప్పటివరకు మూడు ప్రైవేటు బస్సులను డిపో నుంచి బయటకు తీశారు.


ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..

  • కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు-లారీ
  • ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
  • దీంతో వారిని స్థానికుల సహాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
  • కరీంనగర్​ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

 

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..

  • ఆర్టీసీ సోదరులకు నా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి
  • ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృశ్య సమ్మె విరమించాలని విజ్ఞప్తి
  • సమ్మె సమస్యకు పరిష్కారం కాదు..
  • ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది..
  • నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం..
  • కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు..
  • ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి  వ్యతిరేకత లేదు..
  • అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలు..
  • ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్‌లో ఉన్నాయి..
  • ఈ రెండు అంశాల్లో  పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉంది.
  • వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగాం..
  • ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చిస్తామని నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశాం..
  • ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి..
  • గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయి
  • ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం..
  • పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేశాం..
  • 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం
  • రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం
  • రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం
  • ఇవే కాకుండా నెల వారిగా పీఎఫ్, సీసీఎస్‌కి 75 కోట్లు చెల్లిస్తున్నాం..
  • ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది..
  • సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం..
  • గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో  శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం  జరిగింది..
  • అన్ని అంశాలు పరిష్కారం చేస్తాం..
  • ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..
  • మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టు వద్దు..
  • గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసు
  • ఆర్టీసీలో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు, మన అక్కా చెల్లెల్లు ..
  • ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారు..
  • ఆర్టీసీలో నిత్యం  ఉపాధి కోసం విద్య, వైద్యం కోసం పోయే పరిస్థితి..
  • ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్న.. సమ్మె వద్దు..
  • మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలుసుకోవచ్చు..
  • ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చు
  • పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దు..
  • పేద ప్రజలకు కార్లలో పోయే స్థోమత లేదు..
  • ప్రతి ఒక్క ఆర్టీసీ కుటుంబ సభ్యుడికి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న..
  • ప్రజలకు అసౌకర్యం కలగకుండా  ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందాం..
  • ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది..
  • మీ సమస్యల పరిష్కారం పై సానుకూలంగా ఉన్నాం..
  • సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు..
  • నేను విద్యార్థి నాయకుడిని.. కార్మికులకు అండగా ఉంటా..
  • గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి..
  • మీ నాయకులు నిరసనలు చెప్పుకొని వారికి ఆ హక్కు ఉంది..
  • మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న..

 

కామారెడ్డిలో ఉద్రికత్త..

  • కామారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
  • అద్దె బస్సులను అడ్డుకున్న జేఏసీ నేతలు..
  • జేఏసీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట
  • ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు...
  • ధర్నాకు దిగిన ఆర్టీసీ కార్మికులు..


సూర్యాపేట జిల్లా

  • కోదాడ బస్ డిపోలో తీవ్ర ఉద్రిక్తత
  • బస్సులను బలవంతంగా డిపో నుంచి పోలీస్ పహారాలో తీసుకొస్తుండగా అడ్డుకున్న సమ్మెలో ఉన్న ఉద్యోగులు
  • బస్సు కింద పడుకుని డైవర్ల నిరసన
  • బలవంతంగా లాగి పక్కకు పడేసిన పోలీసులు

 

అద్దె బస్ డ్రైవర్లు Vs పోలీసులు

  • మంచిర్యాల జిల్లా
  • తమపై పోలీసులు దాడి చేశారంటూ అద్దె బస్ డ్రైవర్ల ఆందోళన
  • మంచిర్యాల బస్ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేసిన అద్దె బస్ డ్రైవర్లు
  • కండక్టర్లను ఇవ్వకుండా బస్సులను తీసేదే లేదంటున్న అద్దె బస్ డ్రైవర్లు
  • ప్రజలు ఆగ్రహంతో బస్సులపై దాడులు చేస్తే ఎవరు భద్రత కల్పిస్తారని ఆగ్రహం
  • యజమానుల హామీతో నిరసన విరమించిన డ్రైవర్లు

 

డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

  • కరీంనగర్ బైపాస్‌లో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది.
  • ప్రైవేటు డ్రైవర్‌ బస్సు నడపడంతో ప్రమాదం
  • తృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రయాణికులకు గాయాలు.
  • గాయపడిన వారికి ఆసుపత్రికి తరలింపు.. 

 

కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత

  • కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉద్రిక్తత నెలకొంది.
  • నిజాంసాగర్ వెళ్లే బస్సును బయటకు తీసుకువచ్చే ప్రయత్నం.
  • పోలీస్ బందోబస్తు మధ్య బస్సు కదిలింపు
  • బస్సును అడ్డుకున్న జేఏసీ నాయకులు.
  • ప్రైవేటు డ్రైవర్ సాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు.
  • బస్టాండ్‌లో కొంత సేపు ఉద్రిక్తత
  • సమ్మె వల్ల బాన్సువాడ ఆర్టీసి డిపోలో ఆగి పోయిన బస్సులు.
  • పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.
  • అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహన దారులు.

 

సంగారెడ్డిలో ఉద్రిక్తత..

  • సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత..
  • అద్దె బస్సులను పటాన్‌చెరు పంపేందుకు అధికారుల యత్నం.
  • బస్సులను అడ్డుకున్న కార్మికులు.
  • కార్మికులను చెదరగొట్టిన పోలీసులు.
  • పోలీసు ఎస్కార్ట్‌ వాహనంతో బస్సులను నడుపుతున్న అధికారులు. 

 

మెదక్ జిల్లా..

  • మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం..
  • బస్సులను డిపోల నుండి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న కార్మికులు..

 

ప్రయాణికుల అవస్థలు..

  • ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
  • ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొన్ని డిపోల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు.
  • సమ్మె నేపథ్యంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.
  • పికెట్​, కంటోన్మెంట్, రాణిగంజ్​ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి.
  • దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.


చర్లపల్లిలో ప్రయాణికుల ఇక్కట్లు

  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఇక్కట్లు
  • చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రేట్లు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాపిడో, ఓలా, ఉబర్‌ను ఆశ్రయిస్తున్నారు.

 

గోదావరిఖనిలో బందోబస్తు..

  • పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు.
  • దీంతో బస్సులు డిపోలకే 150 బస్సులు, 600 ఉద్యోగులు పరిమితం అయ్యారు.
  • గోదావరిఖని బస్టాండ్​, డిపో వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
     

 

కార్మికులు విధులకు హాజరు కావాలి: ఆర్టీసీ ఎండీ

  • కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
  • సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరింది.
  • దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.
  • కార్మికులు విధులకు హాజరు కావాలి.

నోటీసు నుంచి సమ్మె వరకు

  • ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మార్చి 13, 2026న సమ్మె నోటీసు
  • ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె
  • ​రాత్రి వరకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీతో కార్మిక సంఘాల నేతలు చర్చలు
  • ​సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కావాలని కోరిన అధికారులు
  • ​ఇవి పాత డిమాండ్లేనని, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ చర్చల నుంచి తప్పుకున్న కార్మిక సంఘాలు
  • ​మొత్తం 32 డిమాండ్లతో చర్చలు
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్
  • పెండింగ్‌లో ఉన్న 30% ఫిట్‌మెంట్ మరియు వేతన బకాయిల చెల్లింపు చేయాలని కోరిన కార్మిక సంఘాలు
  • ​పీఎఫ్ (PF), సీసీఎస్ (CCS) కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్  
  • ​కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడం
  • ​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుపడుతున్న కార్మిక సంఘాలు
  • ​మొత్తం RTC బస్సులు  9,375
  • ఆర్టీసీ స్వంత బస్సులు: 6,594
  • ​అద్దె (Hire) బస్సులు: 3,396
  • సమ్మె కారణంగా దాదాపు 6,000 పైగా బస్సులు డిపోలకే పరిమితం
  • ​సుమారు 50,000 మందికి పైగా సిబ్బంది ఉండగా, సమ్మెలో దిగిన మెజారిటీ కార్మికులు
  • ​ఆర్టీసీ రోజువారీ ఆదాయం సుమారు రూ. 21 కోట్లు
  • ​రోజూ ప్రయాణించే 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది
  • ​గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కార్మిక సంఘాలు ముందుగానే నోటీసు ఇవ్వడం, ప్రభుత్వ హామీలపై స్పష్టత కోరడం అనే వ్యూహంతో అడుగులు
  • ​కేవలం కమిటీలతో కాలయాపన చేయకుండా, జీవో (GO) రూపంలో లేదా లిఖితపూర్వక హామీ వచ్చే వరకు సమ్మె విరమించకూడదని నిర్ణయం
  • ​రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసనలు తెలుపుతూ  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం

 

 

ఆర్టీసీ బస్సులు బంద్‌ 

  • చర్చలు విఫలం.. నేడు తొలి షిఫ్ట్‌ నుంచి ఆర్టీసీ బస్సులు బంద్‌ 

  • సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీకి మద్దతు ప్రకటించిన రెండో జేఏసీ 

  • భారీగా తాత్కాలిక సిబ్బందిని సమకూర్చుకుంటున్న ఆర్టీసీ 

  • యథావిధిగా తిరగనున్న ఎలక్ట్రిక్‌ బస్సులు సహా ఆర్టీసీలోని అద్దె బస్సులు 

  • తాత్కాలిక సిబ్బందితో మరో 2 వేల బస్సులు తిప్పే యత్నం 

  • సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు..  

  • బస్సులు తిరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు

ప్రభుత్వ ఆదేశాలు.. 

  • జిల్లాలవారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ప్రభుత్వం ఆదేశం.
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం.
  • ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు.
  • సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ప్రభుత్వం చర్యలు. 

 

జేబీఎస్‌లో బస్సులు బంద్‌..

  • సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు
  • జేబీఎస్‌లో సమ్మె ప్రభావం
  • తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపే ప్రయత్నం
  • భారీగా పోలీసుల మోహరింపు
  • ప్రశాంతంగా ధర్నా చేసుకోవాలని పోలీసుల సూచనా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె భాగంగా కొత్తగూడెంలో ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన 66 బస్సులు.
  • స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.
  • కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, ఆర్టీసీ నాయకులు ధర్నా.
  • ధర్నా చేస్తున్న ఆర్టీసీ, సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు.
  • బస్సులు లేక బస్టాండ్‌లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు.
  • ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు.

 

కరీంనగర్ జిల్లా..

  • కరీంనగర్ వన్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
  • తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు
  • తమ సమస్యల్ని పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
  • యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతూ డిపో గేట్ ముందు నిరసన.

బస్సులు బంద్‌.. 

  • తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 
  • అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 
  • సమ్మెకు దిగిన ఆర్టీసీ జేఏసీ.. 
  • సమ్మె కారణంగా దాదాపు ఆరు వేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం. 
  • తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు. 
  • తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటన. 

 

Advertisement
 
Advertisement
Advertisement