west bengal elections
-
దీదీ ధిక్కార స్వరం!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల సంఘం(ఈసీ) ఆసరాతో మా గెలుపు కొల్లగొట్టారు. మేం ఓడిపోలేదు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేద’ని ఆమె బాంబు పేల్చారు. ఆమె అయిదేళ్ల పదవీకాలం ఎటూ ఈ నెల ఏడుతో ముగుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఈలోగానే ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా... లేక గడువు ముగిశాక ఆమెను సచివాలయంలోకి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఓడిపోయినవారు ప్రత్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేసే ప్రత్యా మ్నాయం ఉంటుంది. అవన్నీ తేలటానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. సీనియర్ నాయకు రాలు గనుక ఇవన్నీ ఆమెకు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. కానీ అక్కడితో ఆగిపోతే ఆమెకూ, ఇతర నాయకులకూ తేడా ఉండేది కాదు. వైదొలగక తప్పదని తెలిసినా తగినంత రచ్చచేసి నిష్క్రమించటం ఆమె ఎత్తుగడ కావొచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకు రాలిగా పనిచేసినప్పటినుంచి మమత స్ట్రీట్ ఫైటర్. వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరాటంలో పార్టీనుంచి సరైన సహకారం అందటం లేదన్న ఏకైక కారణంతో ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆ తర్వాత ఆమెదంతా అలుపెరగని పోరాట చరిత్ర.ఇంత రగడకు ఏకైక కారణం ఎన్నికల సంఘం(ఈసీ). స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో అమలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాక కూడా ఇతర రాష్ట్రాల్లోనైనా సజావుగా పూర్తి చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆ సంస్థకు లేకపోయింది. బెంగాల్లో దాన్ని మరింత అధ్వాన్నం చేసింది. తొలగింపు ల్లోనూ, చేర్పింపుల్లోనూ అవకతవకలకు అంతూ దరీ లేకుండా పోయింది. ఫాం–7 కింద ఊరూ పేరూలేని వారు దాఖలు చేసిన ఫిర్యాదుల్ని ఆసరా చేసుకుని తాఖీదులు పంపడం, కావలసిన పత్రాలన్నీ ఇచ్చాక నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ కాలేదంటూ తొలగించటం వంటివి చోటుచేసుకున్నాయి. పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా ‘తార్కిక వ్యత్యాసం’ పేరిట అనర్హులుగా జమేయటం మరో దాష్టీకం. ఏతావాతా 91 లక్షలమంది ఓటర్లు మాయమయ్యారు. పైగా ఏడు లక్షలమంది రహస్యంగా వచ్చిచేరారని మమత ఆరోపిస్తున్నారు. అజ్యుడికేషన్లో మాత్రం కేవలం 1,607 మందికి మాత్రమే ఓటుహక్కు పునరుద్ధరించారు. మిగిలిన లక్షలాది దరఖాస్తులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓటుహక్కు ప్రసాదించే సంస్థ అనే ముద్రనుంచి దాన్ని తొలగించటమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థగా ఈసీ పరివర్తన చెందటంలో మతలబేమిటి?సర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా గత నెల 13న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఓటర్ల జాబితాల్లో భారీస్థాయి తొలగింపులు జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ‘గణనీయమైన ప్రభావం’ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో ఆలోచిస్తామని కూడా చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎటూ విపక్షాలు సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం ఉంది. విచారకరమైన సంగతేమంటే... ఈ ఎన్నికల్లో తానూ ఒక అభ్యర్థినే అన్నట్టు ఈసీ ప్రవర్తించింది. వచ్చిన కేంద్ర పరిశీలకులు సైతం అందుకు తగినట్టే ఉన్నారు. మరి ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రావటంలో వింతేముంది?ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటి ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకూ ఈసీ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులకు అతీ గతీ లేదు. నిమిషానికి నలుగురు చొప్పున ఓటేయటం గురించీ, సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేయటం గురించీ పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు ప్రశ్నిస్తుంటే మన్నుతిన్న పాములా కూర్చుంది. ఏ సంస్థా ఇంత సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించిన వైనం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కనీసం ఇప్పుడు సర్ ప్రారంభించబోయే రాష్ట్రాల్లోనైనా సక్రమంగా ప్రవర్తించటం ఈసీ నేర్చుకోవాలి. లేనట్టయితే అక్కడ కూడా ఇలాంటి ఛీత్కారాలే ఎదురవుతాయి. -
బిగ్ బ్రేకింగ్: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ, రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతను మేళవిస్తూ.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ సమాచారం.మోదీ చెప్పినట్లే..మే 9న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్‌పూర్‌లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్లో నిర్మిస్తామని అన్నారు.అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభంబెంగాల్లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు (మే 5) ఢిల్లీ నుంచి కోల్‌కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆమెను కోరనున్నారు.బెంగాలీల మనోభావాలకు పెద్దపీటమే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. బెంగాలీలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ‘పొచిషే బోయిశాఖ్’ (రవీంద్ర జయంతి) రోజున ప్రమాణస్వీకారం చేయడం ద్వారా స్థానికుల మనోభావాలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఠాగూర్ జయంతి బెంగాల్లో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో భాగం. నాలుగున్నర దశాబ్దాల వామపక్ష, టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ రాబోతున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది. -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్‌లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్‌ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం
కోల్‌కతా: మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం.. ఇలాంటి పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇస్తూ, బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలు కాదు.. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం! షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.షేక్ హసీనా పతనం తర్వాత..డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి నిరసనగా కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు, సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులపై మమతా బెనర్జీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీదీ ప్రభుత్వం కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మాత్రమే కొమ్ముకాస్తోందని, బెంగాల్ హిందువుల పక్షాన నిలబడలేదనే వాదనను ఆ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.అక్రమ చొరబాటుదారులపై బీజేపీ అస్త్రంబంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్, ఈసారి ఆ ప్రభావానికి లోనైంది.గేమ్ ఛేంజర్‌గా ‘మతువా’ ఓటుబ్యాంక్ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది ‘మతువా’ సామాజిక వర్గం. 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆవిర్భవించిన ఈ వర్గానికి బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో బలమైన పట్టుంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు స్థానికులను బీజేపీ వైపు నిలబడేలా చేశాయి. తాము మతపరమైన వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో, బీజేపీ మాత్రమే తమకు పౌరసత్వం కల్పిస్తుందన్న ఆశతో వారు బీజేపీ పక్షాన నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి -
భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి.. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. -
అర్ధరాత్రి హైడ్రామా.. మమతా బెనర్జీ సైతం ఎంట్రీ ఇచ్చి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజక వర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌కు చేరుకున్నారు. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లో బ్యాలెట్ బాక్సులు తెరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు మమతా బెనర్జీ వచ్చారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌కు వచ్చారు. ఇది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం. అక్కడ ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్ ఉంది. ఆ కౌంటింగ్ కేంద్రాన్ని మమతా బెనర్జీ పరిశీలించి, అర్ధరాత్రి దాటాక మీడియాతో మాట్లాడారు. “అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ మాత్రమే పై అంతస్తులో ఉండవచ్చు. మీడియా కోసం సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా నేను సూచించాను. పారదర్శకతను కొనసాగించాలి. ఫిర్యాదులు రావడంతో నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. కేంద్ర బలగాలు మొదట నన్ను లోపలికి అనుమతించలేదు. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే మేము సహించం. ఇక్కడ ఈవీఎంల కోసం స్ట్రాంగ్‌రూమ్ ఉంది. చాలా చోట్ల మానిప్యులేషన్ జరుగుతోందని మేము గమనించాము. ఎన్నికల నియమాల ప్రకారం పార్టీ అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్‌కు సీల్ చేసిన గది వరకు వెళ్లే అనుమతి ఉంటుంది. మా ఏజెంట్‌ను అరెస్ట్ చేశారు. ఏకపక్ష వైఖరి కనిపిస్తోంది. తప్పుడు చర్యలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతాం” అని తెలిపారు.నేతాజీ ఇండోర్ స్టేడియంలోనూ అంతే.. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ బయట కూడా అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు లేకుండా బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారని ఆరోపించారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఉంచారు.బెంగాల్ మంత్రి శశి పాంజా, తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ ఈవీఎంల భద్రతపై అనుమానం వచ్చి స్వయంగా అక్కడికి వచ్చి నిరసన చేపట్టారు. వారిద్దరు నేతాజీ ఇండోర్ స్టేడియం బయట ధర్నా ప్రారంభించారని తృణమూల్ ఓ ప్రకటనలో తెలిపింది.మరోవైపు, తృణమూల్ ఆరోపణలను బీజేపీ నేత తాపస్ రాయ్ పూర్తిగా ఖండించారు. “ఇవి అన్నీ తృణమూల్ ఇప్పుడు భయ వాతావరణాన్ని సృష్టించేందుకు వ్యాపింపజేస్తున్న వదంతులు. వాళ్లే భయపడుతున్నారు. నేనూ స్ట్రాంగ్‌రూమ్ పరిశీలించేందుకు వచ్చాను. తృణమూల్ అబద్ధాలు చెబుతోంది” అన్నారు. #WATCH | West Bengal Elections 2026 | Chief Minister Mamata Banerjee arrives at the Bhabanipur strong room in Kolkata. pic.twitter.com/29buaqzUCy— ANI (@ANI) April 30, 2026 -
బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అక్కడ ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి? మెజారిటీ రాకపోతే బెంగాల్ రాజకీయాల్లో జరగబోయేది ఏమిటి?హోరాహోరీ పోరు: ఎగ్జిట్ పోల్స్ అంచనాలుఅస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే, అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ పైనే పడింది. ఇక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రెండు పార్టీల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీవ్రమైన పోటీ కారణంగా, పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి?ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రాకపోవడాన్ని ‘హంగ్ అసెంబ్లీ’ అంటారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం ఒక్క సీటు అయినా అదనంగా (సింపుల్ మెజారిటీ) గెలుపొందాలి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏమవుతుంది?హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ ఆ పార్టీ మెజారిటీ నిరూపించుకోలేకపోతే, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, గడువులోపే చిన్న పార్టీల మద్దతు కూడగట్టడం, పోస్ట్-పోల్ (ఎన్నికల అనంతర) పొత్తులు పెట్టుకోవడం వంటి వ్యూహాలకు పార్టీలు పదును పెడతాయి. బయటి మద్దతుతో ఏర్పడే ఇలాంటి మైనారిటీ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.ఇది కూడా చదవండి: Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ -
బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ!
రాజకీయాల్లో వారసత్వం సాధారణమే.. అయితే ఈ జాబితాలోని వారు సొంతంగా తమదైన ముద్రను దక్కించుకోవడం అనేది అంత ఈజీగా జరగదు. అయితే పశ్చిమ బెంగాల్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వాడవాడలా అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లునిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, కేవలం ఆ గుర్తింపునకే పరిమితం కాకుండా, పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు అభిషేక్ బెనర్జీ. మేనత్త నీడ నుంచి బయటపడి, బీజేపీకి దీటైన సవాల్ విసురుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సేనాధిపతిగా మారిన అభిషేక్ ప్రయాణం అత్యంత ఆసక్తికరం.నెత్తురోడిన అత్తను చూసిన రెండేళ్ల చిన్నారిఅది 1990వ సంవత్సరం. సీపీఎం కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి, తలకు కట్టుతో మంచంపై ఉన్న మమతా బెనర్జీని చూసి ఆ రెండేళ్ల బాలుడు చలించిపోయాడు. తన అత్తపై ఎందుకు దాడి జరిగిందని ఇంట్లో నినాదాలు చేస్తూ, అప్పటి నుంచే రాజకీయ పరిణతిని కనబరిచాడు. దశాబ్దాల తర్వాత అదే ఫోటోను ఓ సభలో మమత స్వయంగా అతనికి బహుకరించారు. ఆనాటి ఆ చిన్నారే నేటి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ అభిషేక్ బెనర్జీ.23 ఏళ్లకే యూత్ ఐకాన్‌గా ఎంట్రీపశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్దలు కొట్టి, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2011 సంవత్సరంలోనే అభిషేక్ రాజకీయ అరంగేట్రం జరిగింది. కేవలం 23 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పాత తరం నేతల భావోద్వేగ, పోరాట పద్ధతులకు భిన్నంగా.. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.రికార్డు మెజారిటీలతో తిరుగులేని సత్తా2014లో లోక్‌సభ బరిలోకి దిగిన అభిషేక్, తన 26వ ఏట డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి గెలిచి, 16వ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో 71,000 ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2019లో బీజేపీ హవాలోనూ తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.పార్టీ పగ్గాలు.. ఈడీ, సీబీఐ సవాళ్లుఅంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ ప్రభావం 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడింది. ఆయన తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్లో దూసుకువస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో, పార్టీ జాతీయ ఆశయాలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలంపైగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ) విచారణలను సైతం ధైర్యంగా ఎదుర్కోవాల్సి వచ్చింది.ఓల్డ్ వర్సెస్ న్యూ.. సరికొత్త వ్యూహంగత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్‌లో సీనియర్లకు, అభిషేక్ నేతృత్వంలోని యువ నాయకత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందనే వార్తలు వచ్చాయి. కానీ, 2026 ఎన్నికల్లో ఈ విభేదాలన్నీ సమసిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు పార్టీలో పక్కా వ్యూహం అమలవుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా కేంద్రంగా పరిపాలనను పర్యవేక్షిస్తూ, ఉత్తర బెంగాల్‌పై దృష్టి పెడితే.. అభిషేక్ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి దక్షిణ బెంగాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.2026 ఎన్నికలు.. అసలైన అగ్నిపరీక్షఅభిషేక్ బెనర్జీకి 2026 ఎన్నికలు అత్యంత కీలకం. ఇవి పార్టీలో తన స్థానాన్ని, నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎదురైన అగ్నిపరీక్షలాంటివి. డేటా ఆధారిత, యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాలతో, కచ్చితమైన బూత్ స్థాయి మేనేజ్మెంట్తో ఆయన ముందుకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్‌ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా, బీజేపీ సంస్థాగత బలాన్ని దీటుగా ఢీకొట్టగల శక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీకి తనను తాను అత్యున్నత నేతగా నిరూపించుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశంగా మారాయి.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ బాటలో దుర్గేష్.. న్యాయమూర్తికి షాకింగ్ లేఖ -
పోలింగ్ బూత్ లో 'కమలం' గుర్తుపై స్టిక్కర్లు..
-
ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని..
నాడియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేడు (బుధవారం) తీవ్ర ఉత్కంఠ నడుమ ప్రారంభమైంది. ఇది కేవలం ఎన్నికల సమరం మాత్రమే కాదని, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటం’ అని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడియా జిల్లాలోని కరీంపూర్ గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 120లో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె.. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. #WATCH | West Bengal Assembly Elections 2026: On arriving in an e-rickshaw to cast her vote, TMC MP Mahua Moitra says, "Because the ECI has said that not to come by motorbike. So we have come by TOTO.""This time, we are engaged in the fight to save democracy. 2.7 million voters… https://t.co/JlRbauNv4V pic.twitter.com/NGo9jH83Ph— ANI (@ANI) April 29, 2026‘టోటో’లో వచ్చి ఓటేసిన ఎంపీఎన్నికల సంఘం నిబంధనలకు వినూత్న రీతిలో సమాధానమిచ్చారు మహువా మోయిత్రా. పోలింగ్ కేంద్రాల వద్దకు మోటార్‌బైక్‌లపై రాకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో, ఆమె ఏకంగా ఓ ‘టోటో’ (ఈ-రిక్షా)లో వచ్చి ఓటు వేశారు. నిబంధనలను పాటిస్తూనే, తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఆటంకాలు అడ్డురావని ఈ చర్య ద్వారా తెలియజేశారు.27 లక్షల ఓట్ల గల్లంతుపై ప్రతీకారంకేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై మహువా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.7 మిలియన్ల (27 లక్షల) మంది ఓటర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని ఆమె ఆరోపించారు. అయితే, మిగిలిన ఓటర్లు కచ్చితంగా వంద శాతం ఓటింగ్‌లో పాల్గొంటారని, అందుకే ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం ఖాయమని అన్నారు. ఇది సాధారణ లెక్క అని, కేంద్రం, ఈసీ ఆడిన ఈ నాటకానికి బదులు తీర్చుకోవడానికే ప్రజలు కసితో ఓటు వేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! -
బెంగాల్‌కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యూపీకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ.. అధికార టీఎంసీ అభ్యర్థికి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.ఆకతాయి పనులొద్దుఫల్టా నియోజకవర్గంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు.. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అజయ్ పాల్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. జహంగీర్ నివాసానికి చేరుకున్న ఆయన, అక్కడ అభ్యర్థి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘జహంగీర్‌కు స్పష్టంగా చెప్పండి.. ప్రజలను బెదిరించినట్లు మళ్లీ ఫిర్యాదులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడినా, ఓటర్లను వేధించినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.భద్రతపై అనుమానాలు.. ఎస్పీకి నోటీసులుజహంగీర్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది వివరాలను కూడా శర్మ ఆరా తీశారు. అక్కడ 14 మంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉండటాన్ని గమనించిన ఆయన స్థానిక ఎస్పీ నుంచి వివరాలు కోరారు. అయితే, జహంగీర్‌కు ఉన్న వై-కేటగిరీ భద్రత కింద కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో మంజూరైన దానికంటే అదనంగా నలుగురు పోలీసులను ఎందుకు మోహరించారనే దానిపై వివరణ కోరుతూ శర్మ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భగ్గుమన్న టీఎంసీఈ సంఘటనతో బెంగాల్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. శర్మ చర్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్వాగతిస్తూ.. ‘బెదిరింపుల శకం ముగిసింది, చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని అన్నారు. మరోవైపు టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద ఎన్కౌంటర్లతో పేరుగాంచిన అధికారిని ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నియమించిందని, ఆయన నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని విమర్శించింది.ఇది కూడా చదవండి: Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి -
కమలానికి ‘వంద’ కష్టాలు: షా వ్యూహం రివర్స్?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న చక్కర్లు కొడుతోంది. 2021లో 77 సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి కనీసం 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? బెంగాల్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరిట జరిగిన వ్యూహాలు, నాయకత్వ లేమి బీజేపీకి అడ్డంకిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.చరిత్ర చెప్పిన చేదు నిజంబెంగాల్ రాజకీయ చరిత్రను నిశితంగా గమనిస్తే, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు 100 సీట్ల మార్కును దాటలేకపోయింది. అధికార పార్టీకి ఎప్పుడూ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ దక్కుతూ వస్తోంది. అంతేకాకుండా 1977 నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, అధికార పార్టీలను ఏ ఒక్క పార్టీ ఒంటరిగా గద్దె దించలేదు. 1977లో కాంగ్రెస్‌ను లెఫ్ట్ ఫ్రంట్ ఓడించగా, 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను తృణమూల్-కాంగ్రెస్ కూటమి అంతం చేయడం ఈ చారిత్రక వాస్తవాలకు నిదర్శనం.లోక్‌సభ ఫలితాలే అసెంబ్లీకి పునాదిబెంగాల్లో మరో విచిత్రమైన రాజకీయ సంప్రదాయం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన ప్రతిపక్ష కూటములు, అంతకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అగ్రస్థానంలో నిలిచాయి. 1977లో కమ్యూనిస్టులు, 2009లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి లోక్‌సభలో సత్తా చాటిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాయి. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేది ఇక్కడి ఓటర్ల నమ్మకం. కానీ బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ (29 సీట్లు) చేతిలో ఓడిపోయి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితం కమలనాథులకు ఒక అతిపెద్ద ప్రతికూలాంశం.ఓటర్ల జాబితా సవరణ.. ఒక వ్యూహాత్మక అస్త్రం?పదేళ్ల పాటు మతపరమైన ధ్రువీకరణ, తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో హిందూ ఓట్లను ఆకర్షించలేకపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న 48 శాతం ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే ఎన్నికల సంఘం ద్వారా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అనే భారీ ప్రక్రియను బీజేపీ తెరపైకి తెచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మమతకు మద్దతుగా నిలిచే ముస్లింలు, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బలమైన స్థానిక నాయకత్వ లేమిబెంగాల్లో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరణకు ప్రధాన ఆటంకం ప్రజాకర్షణ కలిగిన బలమైన స్థానిక నాయకుడు లేకపోవడం. జ్యోతి బసు రెండు దశాబ్దాల పోరాటం తర్వాత సీఎం కాగా, మమతా బెనర్జీ కూడా 90ల నుంచి విపక్షంలో ఉంటూ, సుదీర్ఘ పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారి, 2020 వరకు మమత వెంటే ఉండి పార్టీ మారిన నాయకుడు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగే స్థాయిలో ఆయనకు ప్రజాదరణ లేకపోవడం బీజేపీకి అతిపెద్ద లోపం.వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలు2011లో కేవలం 4 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు, 2021 నాటికి 38 శాతానికి పెరగడం వెనుక వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలే ప్రధాన కారణం. 2018 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ సృష్టించిన తీవ్ర హింస (34.2% సీట్లు ఏకగ్రీవం) నుండి రక్షణ పొందేందుకు ఆ ఓటర్లు బీజేపీని ఒక సురక్షిత ఆశ్రయంగా భావించారు. అయితే, ఆ తర్వాత మమతా బెనర్జీ తన శ్రేణులను నియంత్రించడం, సంక్షేమ పథకాలను మరింత విస్తరించడంతో బీజేపీ వైపు ఓటర్ల వలసలు నెమ్మదించాయి.బెడిసికొట్టిన వ్యూహం.. ప్రత్యామ్నాయాల వేటబీజేపీ ప్రయోగించిన ‘సర్’ వ్యూహం బెడిసికొట్టి, ముస్లింలతో పాటు మతువా, రాజ్‌బన్షీ వంటి అణగారిన వర్గాలు, బెంగాలీయేతర వలసదారులు, సవర్ణ హిందువుల ఓట్లను కూడా గల్లంతు చేసిందనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు సాధించడంలో విఫలమైతే, తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ లేదా వామపక్షాల వైపు చూసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ‘ఆప్’ క్లీన్ స్వీప్.. రాజ్యసభలో బీజేపీ రికార్డ్! -
దక్షిణ కోట ఎవరికి దక్కేను?
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల చదరంగంలో గెలుపు పావులను ఉత్తరబెంగాల్ కొండ ప్రాంతాలు, జంగల్‌మహల్ అటవీప్రాంతాల్లో కాకుండా దక్షిణబెంగాల్ మైదానప్రాంతాల్లోనే కీలక పార్టీలు మొహరిస్తుంటాయి. ఈసారి కూడా అదే ఆట మొదలైంది. జంట జిల్లాలైన ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో, కోల్‌కతా, హౌరా ప్రాంతాల్లో గెలుపు అనేది అధికారపీఠానికి రాచబాటగా చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాలపై తృణమూల్కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేయగా ఈసారి జెండా కిందకు దింపి కాషాయజెండా రెపరెపలాడేలా చేస్తామని కమలదళ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఉత్తర 21 పరగణాల జిల్లాలో 33 సీట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 31 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు అనేది అత్యంత కీలకం. కోల్‌కతా నగర పరిధిలోని 11 సీట్లు, హౌరా నగర పరిధిలోని 16 సీట్లు కూడా కలుపుకుంటే కీలక నియోజకవర్గాల సంఖ్య 91కి పెరుగుతోంది. 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇవి మూడింట ఒకవంతు స్థానాలతో సమానం. అలా ఇవి ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలను యావత్ రాష్ట్రంలోని కీలక జిల్లాలుగా చెబుతుంటారు. పెద్ద ప్రెసిడెన్సీ డివిజన్‌గా కొనసాగుతున్న కోల్‌కతా, హౌరా, నదియా, నార్త్, సౌత్ 24 పరగణాల్లో మొత్తంగా 111 సీట్లున్నాయి. వీటిని గెలిస్తే రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అధికారం చక్రం తిప్పొచ్చని అటు టీఎంసీ, ఇటు బీజేపీ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ 111 స్థానాలకుగాను 2021 ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 96 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) ఒకే ఒక్క చోట గెలిచింది. ఇంతటి కీలక దక్షిణబెంగాల్ను గుప్పిటపట్టకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ బలం పుంజుకుంది. ఇక్కడి 21 సెగ్మెంట్లలో బీజేపీ హవా కొనసాగింది. నదియా, ఉత్తర 24 జిల్లాల్లో బీజేపీ, దక్షిణ 24, హౌరా, కోల్‌కతాల్లో టీఎంసీ సత్తాచాటాయి. ఇక్కడి మెజార్టీ స్థానాల్లో గెలిచి నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. ‘‘ఇక్కడి స్థానాలను పదిలపర్చుకుంటే అధికారం మనదే. ఇవి కేవలం సీట్లు కాదు. మమతా బెనర్జీ రాజకీయ ఎత్తులకు సామాజిక వేదికలు’’అని టీఎంసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘మాకూ ఈ స్థానాలు చాలా ముఖ్యం. నార్త్ 24 పరగణాల జిల్లాలో మతువాలు, శరణార్థుల ఓట్లను కొల్లగొడితే మాకు పని సులువు అవుతుంది’’అని బీజేపీ సీనియర్ నేత చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంతం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండేది. 2006లో సీపీఐ(ఎం) లెఫ్ట్ కూటమి ఏకంగా 72 చోట్ల గెలిచింది. కానీ సచార్ కమిటీ నివేదిక తర్వాత ముస్లింలు లెఫ్ట్‌పార్టీలకు ముఖంచాటేశారు. సింగూర్–నందిగ్రామ్ ఉద్యమం తర్వాత మమతబెనర్జీ హవా కొనసాగి ఈ ప్రాంతంపై టీఎంసీ పట్టుసాధించింది. ఇప్పుడీ ప్రాంతం మమత ప్రభుత్వానికి రాజకీయ ఇంజిన్‌గా మారింది. 2008లో దక్షిణ 24 పరగణాలు, పూర్బా మేదినీపూర్ జిల్లా పరిషత్‌లను గెల్చుకుని టీఎంసీ ఇక్కడ పాగావేసింది. నార్త్ 24 పరగణాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిన శరణార్థులు ఎక్కువ. ఇక్కడి మతువాలు 14 సీట్లలో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. వీళ్లందరికీ పౌరసత్వం ఇస్తామని, సీఏఏ అమలుచేస్తామని బీజేపీ చేసిన వాగ్దానాలు పనిచేశాయి. దీంతో 2021లో ఇక్కడి ప్రెసిడెన్సీ డివిజన్లో బీజేపీ గెల్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలవేళ నదియాలోని 11 అసెంబ్లీ, నార్త్ 24 పరగణాల్లో ఎనిమిది సెగ్మెంట్లలో బీజేపీ ఓట్ల శాతం మెరుగుపడింది. అయితే ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే అమలుతో సమీకరణాలు మారిపోయే అవకాశముంది.ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 29న జరగబోయే రెండో దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారంతో ముగిసింది. 142 స్థానాలకుగాను ఈసారి 41,001 పోలింగ్ స్టేషన్లలో 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 1,64,35,627 మంది పురుషులుకాగా, 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొదటిదశ మాదిరే రెండో దశ పోలింగ్నుప్రశాంతంగా చేపట్టేలా హింసకు తావులేకుండా 2,321 కంపెనీల కేంద్రబలగాలను ఎన్నికలసంఘం పోలింగ్ స్థానాల్లో మొహరించింది. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్లు సైతం ఆయా ప్రాంతాల్లో పహారాకాస్తున్నాయి. భంగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కంచుకోట భవానీపూర్ నుంచి సీఎం మమతాబెనర్జీ మరోసారి పోటీకి నిలబడ్డారు. మైనార్టీలు అత్యధికంగా ఉండే కోల్‌కతా పోర్ట్ నియోజకవర్గంలో టీఎంసీ తరఫున ఫిర్హాద్ హకీం, బీజేపీ తరఫున రాకేశ్ సింగ్ నిలబడి పోటీకి రసవత్తరంగా మార్చారు. భాత్పారా, జగత్దల్, బరాక్‌పూర్, బంగావ్, డమ్‌డమ్, సందేశ్‌ఖాలీ, హింగల్గంజ్, రాణాఘాట్ ఉత్తర్, దక్షిణ్, రాశ్బెహారీ, జాదవ్పూŠ, బలేగంజ్ స్థానాల్లో బలమైన నేతలు పోటీపడుతున్నారు. -
బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత
భట్పారా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పారా ప్రాంతం నెత్తురోడింది. అధికార టీఎంసీ , ప్రతిపక్ష బీజేపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు చివరకు కాల్పులు, నాటు బాంబుల దాడులకు దారితీయడంతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.బీజేపీ అభ్యర్థి ఇంటి వద్ద కాల్పుల మోతఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బీజేపీ అభ్యర్థి పవన్ సింగ్ (సీనియర్ నేత అర్జున్ సింగ్ కుమారుడు) నివాసం వెలుపల భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసరడంతో పాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పవన్ సింగ్ భద్రతా బృందంలో విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్ యోగేష్ శర్మ కాలికి తూటా తగిలింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ స్టేషన్ వద్దే ఘర్షణ, రాళ్లదాడిఆదివారం సాయంత్రం జగద్దల్ ప్రాంతంలోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పార్టీ జెండాలు కడుతున్న ఓ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టీఎంసీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, అప్పటికే అక్కడకు చేరుకున్న బీజేపీ మద్దతుదారులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.రాజకీయ ఆరోపణలుఈ దాడులపై అటు టీఎంసీ, ఇటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ కార్యకర్తలపై అకారణంగా దాడులు చేశారని టీఎంసీ ఆరోపిస్తుండగా, టీఎంసీకి చెందిన రౌడీ మూకలే కాల్పులు జరిపారని, వారి వల్లే జవాన్ గాయపడ్డారని బీజేపీ ప్రతివిమర్శలు చేస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో భట్పారా, జగద్దల్ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇది కూడా చదవండి: చద్దా టీ పార్టీకి సీచేవాల్ ‘షాక్’.. దిమ్మతిరిగే కౌంటర్‌తో.. -
‘మే 5 నుంచి..’ ఆడపిల్లలకు అమిత్ షా భరోసా!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మే 5 తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాత్రి ఒంటిగంట దాటినా ఆడపిల్లలు ఎలాంటి భయం లేకుండా వీధుల్లో తిరగగలరని ఆయన భరోసా ఇచ్చారు.మహిళల భద్రతపై దీదీకి సూటి ప్రశ్నలుగత పదిహేనేళ్ల మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలోని తల్లులు, సోదరీమణులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అమిత్ షా ఆరోపించారు. ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ, కలకత్తా లా కాలేజ్ వంటి ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలన్నారు. ‘రాత్రి 7 గంటల తర్వాత మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని దీదీ చెబుతున్నారు. దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రీ ఇలాంటి మాట అనలేదు. ఒక మహిళ.. సీఎంగా ఉండి కూడా భద్రత కల్పించలేకపోయినందుకు సిగ్గుపడాలి. మే 5న మేం అధికారంలోకి వచ్చాక ఏ రౌడీ కూడా మహిళల వైపు కన్నెత్తి చూడలేడు, అలాంటి వారిని కటకటాల వెనక్కి నెడతాం’ అని జమాల్పూర్ ర్యాలీలో అమిత్ షా హెచ్చరించారు. जमालपुर वासी भी भाजपा सरकार बना रहे हैं...ভোটের প্রথম দফাতেই ১১০টি আসনে জয়লাভ করে বিজেপি পশ্চিমবঙ্গে সরকার গঠনের পথে অনেকটাই এগিয়ে গিয়েছে। জামালপুর বিধানসভার বাসিন্দারাও তৃণমূল কংগ্রেসকে সম্পূর্ণভাবে পরাজিত করার জন্য প্রস্তুত।#BanglarHridoyeBJP https://t.co/E5l9lC5GPy— Amit Shah (@AmitShah) April 25, 2026తొలి దశలో 110కి పైగా స్థానాలు మావేమొదటి దశ పోలింగ్ సరళిని బట్టి బీజేపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. 152 స్థానాలకు గాను 110కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. 16 జిల్లాల్లోని 52 స్థానాల్లో ఏకంగా 92.98 శాతం పోలింగ్ నమోదు కావడమే మమతా సర్కార్ పతనానికి సంకేతమన్నారు. బెంగాల్ ప్రజల్లో భయం పోయిందని, బీజేపీ పట్ల నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ పూర్తయ్యే సరికి బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మతువా సామాజిక వర్గానికి ‘సీఏఏ’ రక్షణ కవచంపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని షా విమర్శించారు. అయితే బీజేపీ అధికారంలోకి రాగానే సీఏఏను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మూలాలున్న మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: 29న కోల్‌కతాలో బిగ్గెస్ట్ ఫైట్ -
తరిమి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు పారిపోయిన బీజేపీ అభ్యర్థి
-
బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధం
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల (152 స్థానాలకు)తో పాటు తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గురువారం (ఏప్రిల్ 23) ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే4న వెల్లడవుతాయి. పశ్చిమ బెంగాల్లో.. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్‌లో 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 8,000కి పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో క్యూలు భారీగా ఉండకుండా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 3,60,77,171 ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వీరిలో మంది 1,84,99,496 పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, 465 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.మొదటి దశలో పోలింగ్ జరిగే ప్రాంతాలు: మొదటి దశలో ఉత్తర బెంగాల్ జిల్లాలు డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బేహార్ ప్రాంతాలు, అలాగే జంగల్ మహల్, పురులియా, బాంకురా, పశ్చిమ మేదినిపూర్, బీర్బూమ్, ముర్షిదాబాద్ భాగాలు ఉన్నాయి.వోటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లి వేయాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. తమిళనాడులోతమిళనాడులో 5.73 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.ఇందులో 2.93 కోట్ల మహిళా ఓటర్లు, 7,728 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 249 మోడల్ బూత్‌లు, 325 మహిళలు నిర్వహించే బూత్‌లు, 71 దివ్యాంగులు నిర్వహించే బూత్‌లు ఉన్నాయి.ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) రాష్ట్రవ్యాప్తంగా వినియోగానికి సిద్ధం చేశారు. మొత్తం 1,06,418 బ్యాలట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, 75,064 వివిప్యాట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,60,068 పోలింగ్ సిబ్బంది ఈ కేంద్రాల్లో విధుల్లో ఉంటారు.అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ముందు వచ్చి క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకు ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో పబ్లిక్ హాలిడే.బస్సులు, మెట్రో, స్థానిక రవాణా సేవలు సాధారణంగా నడుస్తాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు సౌకర్యంగా ఉంటుంది.పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి. -
మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చిరుతిండి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వంటకానికి యావత్తు భారతదేశంలో ప్రజలంతా చేసుకుంటారు. కాకపోతే ఆయా ప్రాంతాల వారీగా పలుల పేర్లు ఉన్నాయంతే. కానీ దీని రుచికి అందరు ఫిదా అనే చెప్పాలి. విదేశీయలు సైతం అబ్బా అని లొట్టలేసుకుంటూ తినేలా చేసే స్నాక్ ఐటెం ఇది. మరి నోరూరించే ఈ ఝల్మురి వంటకాల కహానీ గురించి సవివరంగా చూద్దామా..!.ఝల్మురి అంటే..కోల్‌కతా స్ట్రీట్ చిరుతిండి ఇది. మరమరాలు, ఆవనూనె, మసాలాలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగుళ్లు, సెనగపప్పులు వేసి కమ్మగా, కారంగా చేసే వంటకం. ఇది ఏమి స్టవ్ వెలిగించే చేసే వంటకం కాదు. ఇది మొత్తం పదార్థాలు కలపడం పైనే రుచి ఆధాపడి ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే..బెంగాలీలో “ఝల్” అంటే కారం, “మురి” అంటే మరమరాలు. ఈ రెండింటినీ కలిపితే,కారం కారం మరమరాలు అని అర్థం. అమ్మకందారులు స్టీల్ పాత్రలలో దీన్ని కలుపుతూ..పదార్థాలను గాల్లోకి ఎగరువేస్తూ..కోన్ల వార్తాపత్రికలను చుట్టి సర్వ్ చేస్తుంటారు. చవకైనది..మనసుకు ఆహ్లాదాన్ని, కాలక్షేపాన్ని ఇచ్చే చిరుతిండి ఇది. వలసవాద కాలంలో బెంగాల్లో ఉద్భవించిందని చెబుతుంటారు. మాములు చిరుతిండిగా మొదలైన రైళ్లలో, బీచ్‌లలో, కళాశాల ప్రాంగణాలలో విరివిగా అమ్ముతుంటారు. ఇంకా పెద్ద పెద్ద కేఫ్‌లు సైతం లభిస్తోంది. ఈ స్ట్రీట్ భారతదేశమంతటా ఫేమస్. పైగా ఆయా ప్రాంతాల వారీగా పలు రకాలుగా పిలుస్తారు. చేసే విధానం ఒక్కటే. మరి ఆ పేర్లేంటో చూసేద్దామా..! ఇన్ని పేర్లా..?!ముంబైలో దీన్ని భేల్పురిగా తీపి కారంల కలయికతో తయారు చేస్తారు. ఇక బెంగళూరు చురుమురిలో తురిమిన కొబ్బరితో దక్షిణ భారత రుచితో మిళితం చస్తారు. ఒడిశాలో మసాల మురిగా..అందులో అన్ని ఎక్కువ పదార్థాలు జోడించనప్పటికీ ఘాటుగా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలో ముంతమసాల, పిడతకింద పప్పు, ఉగ్గాణి వంటి పేర్లోతో పిలుస్తారు.ముంతమసాల: రమరాలు, మసాలా దినుసులు, వేరుశెనగ గుళ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు తదితరాలను కలిపి గిన్నెలో ఇస్తారు కాబట్టి ముంత మసాల. అంటే ఇక్కడ ఒక చిన్న అల్యూమినియం ముంతలో (గిన్నె)లో సర్వ్ చేస్తారు. ఇది కోస్తాంధ్ర, రాయలసీమలో సాయంత్రం వేళల్లో దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్.పిడతకింద పప్పు: ఇది కూడా ముంతమసాల లాంటిదే, కానీ ఇందులో మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా చేసి కలుపుతారు. అలాగే మరమరాలు మెత్త బడకుండా చిన్న మట్టి కుండలో నిప్పులు వేసి మరమరాలపై ఉంచుతారు అందువల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఇది ముఖ్యంగా కోస్తాంధ్ర (గుంటూరు, కృష్ణా జిల్లాలు) లో ఎక్కువగా కనిపిస్తుంది.ఉగ్గాణిమరమరాలను నీటిలో నానబెట్టి, తాలింపు పెట్టి చేసే ఒక రకమైన తడి మిశ్రమం. దీనికి పసుపు, వేరుశెనగ గుళ్లు, పుట్నాల పొడి (పుట్నాల పప్పు పొడి) ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా మిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, అందుకే దీనిని 'ఉగ్గాణి బజ్జీ' అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో (కర్నూలు, అనంతపురం) ఇది చాలా ఫేమస్. అక్కడ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తింటారట. ఆరోగ్యదాయకం కూడా..ఈ మరమరాలతో తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యప్రదం కూడా. ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ తక్కువ. పైగా అన్ని నేచురల్‌గా కలిపేస్తారు. ఇక్కడ డీప్‌ఫ్రైకి ఛాన్స్‌లేదు. టమటా, ఉల్లిపాయలు నుంచి అన్ని కూడా పచ్చిగానే కలుపుతారు. ఒకరకంగా సలాడ్ మాదిరి ఐటెం. కాకపోతే కాస్త మరమరాలతో రుచికరంగా మారుతుంది. పైగా వెయిట్‌లాస్ స్నాక్ ఐటెం అని అంటున్నారు. ఇది కడుపు నిండిన అనుభూతితోపాటు మనసుకు హాయినిచ్చే స్నాక్ ఐటెం అట. ఇక మరమరాల్లో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని అంటున్నారు. పైగా తేలిగ్గా అరిగిపోతుంది కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఫైబర్ తోపాటు, సులువుగా జీర్ణమయ్యే బలవర్ధకమైన చిరుతిండి అట. -
లూటీలో తృణమూల్ పీహెచ్డీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 15 ఏళ్ల పాలనలో దోపిడీలో పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. చొరబాటుదార్ల అభివృద్ధిలోనే తృణమూల్‌కు అమితాసక్తి ఉందని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలతో యువత, మహిళలు, రైతన్నలను పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని ఆరోపించారు. చొరబాటుదార్ల ఓట్లతో కేవలం వారి మేలుకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ భావిస్తోందని మండిపడ్డారు. ప్రధాని ఆదివారం బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణ్‌గఢ్, పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈసారి పోటీ తృణమూల్ లూటీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు, బీజేపీ అభివృద్ధి ఎజెండాకు మధ్యేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కోరితే బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవి బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలన్నారు. అభివృద్ధి జాడే లేదు ‘‘భారత్ 3జీ నుంచి 5జీకి ఎదిగింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ మన దేశంలోనే ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాం. బెంగాల్లో మాత్రం అభివృద్ధి జాడే లేదు’’ అంటూ మోదీ దుయ్యబట్టారు. ‘‘మమత పాలనలో అవినీతి, ఉద్యోగాల కొరత తప్ప ఇంకేమీ లేదు. ఉపాధి లేక బెంగాల్ మహిళలు ఢిల్లీ, ముంబై వలస వెళ్లాల్సి వచ్చింది. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను చొరబాటుదార్లకు తృణమూల్ పంచిపెడుతోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అడ్డుకుంటాం. ఇది నా హామీ! తృణమూల్ దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర సామాజిక స్వరూపాన్నే మార్చేశాయి. చొరబాట్లతో బెంగాల్ భాష, సంస్కృతి మారిపోతున్నాయి. మమత ప్రభుత్వం గిరిజన భాషలను, గుర్తింపును అవమానిస్తోంది. మదర్సాలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తూ సంతాలీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. గిరిజనుల భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తృణమూల్ నేతలకు లంచమివ్వనిదే ఒక్క పనీ జరగడం లేదు. లంచాల సంస్కృతిని తట్టుకోలేక పరిశ్రమలు రాష్ట్రం వీడాయి. అవినీతితో ఉపాధి సంక్షోభం పెరిగింది. ఉద్యోగాల్లేక యువత అలమటిస్తోంది’’ అని విమర్శించారు. మహిళలకు తీరని ద్రోహం మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి లోక్‌సభలో తెచ్చిన బిల్లును అడ్డుకుని మహిళలకు తృణమూల్ తీరని ద్రోహం చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘2029 నుంచే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళల ఆకాంక్షలతో కాంగ్రెస్‌తో కలిసి తృణమూల్ సమాధి కట్టింది. తద్వారా బెంగాల్ సోదరీమణులనూ దగా చేసింది. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. కొన్ని జిల్లాల్లో టీఎంసీ ఒక్క సీటూ గెలవదని నా రాజకీయ అనుభవంతో చెప్పగలను’’ అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. మాతృశక్తి భరోసా పథకం కింద వారికి ఏటా రూ.36,000, గర్భిణులకు రూ.21,000, కుమార్తెల చదువుకు రూ.50,000 ఇస్తాం. వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100కు పెంచుతాం’’ అని హామీ ఇచ్చారు. ఝాల్మురీ రుచికిమోదీ ఫిదాబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. రుచెలా ఉందని దుకాణదారు ప్రశ్నించగా ఉప్పు తప్ప అన్నీ బాగున్నాయని బదులిచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా తాను ఉప్పు వాడడం లేదని చెప్పారు. ఝాల్మురీ ఆరగిస్తున్న ఫొటో, వీడియోను మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
వింత ప్రచారాలు: జిలేబీలు వేస్తూ.. గడ్డాలు గీస్తూ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. కేవలం రాజకీయ విమర్శలు, సవాళ్లతోనే కాకుండా, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు ఇప్పుడు బెంగాల్ వీధుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీలైన టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు వింత విన్యాసాలతో ప్రజల ముందుకు వస్తున్నారు.బన్స్బేరియాలో ‘స్వీట్’ పాలిటిక్స్సప్తగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వరాజ్ ఘోష్ తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బన్స్బేరియాలో ప్రచారంలో ఉన్న ఆయన అకస్మాత్తుగా ఓ స్థానిక స్వీట్ షాపులోకి వెళ్లారు. అక్కడ హల్వాయి అవతారమెత్తి వేడి వేడి నూనెలో జిలేబీలు వేయడం, రసగుల్లాలను తయారు చేయడం మొదలుపెట్టారు. తనకు పన్నీరుతో స్వీట్లు చేయడం బాగా తెలుసని, ఫలితాలు వెలువడే మే 4వ తేదీన తాను గెలిచినా, ఓడినా తన ప్రత్యర్థులకు కూడా ఈ రసగుల్లాలు తినిపిస్తానని ఆయన ప్రకటించడం విశేషం.చేపతో చెక్ పెట్టిన బీజేపీ అభ్యర్థిమరోవైపు బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి శారద్వత్ ముఖోపాధ్యాయ్ ప్రచారం చర్చనీయాంశమైంది. బెంగాలీల ఆహారపు అలవాట్లపై బీజేపీ ఆంక్షలు విధిస్తుందన్న మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్‌గా, ఆయన ఏకంగా ఒక పెద్ద చేపను చేతితో పట్టుకుని ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బెంగాలీలు తమకు ఇష్టమైన చేపల కూరను ఆస్వాదించవచ్చని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.గృహిణులతో కలిసి రొట్టెలు.. ఉట్టి కొట్టే వేడుకలుఅధికార టీఎంసీ అభ్యర్థులు కూడా ప్రజలతో మమేకం కావడంలో వెనకడుగు వేయడం లేదు. పుర్సురాయ్ టీఎంసీ అభ్యర్థి పార్థా హజారీ ఒక ఇంటికి వెళ్లి కట్టెల పొయ్యిపై గృహిణి చేస్తున్న రొట్టెలను స్వయంగా కాల్చారు. అలాగే, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ అభ్యర్థి నరేశ్ చంద్ర బౌరీ ఈద్ సందర్భంగా జరిగిన ‘హాండీ ఫోడ్’ (ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆయన కుండను పగలగొట్టిన తీరు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.బార్బర్‌గా ఎమ్మెల్యే.. యాగంలో కమ్యూనిస్ట్ నేతప్రచార పర్వం పతాక స్థాయికి చేరడంతో అభ్యర్థులు తమ ఇమేజ్ను పక్కన పెట్టి సామాన్యుల్లో కలిసిపోతున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా ఏకంగా ఓ గ్రామస్థుడికి గడ్డం గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ ఉత్తరపరాలో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో అక్కడున్నవారికి ఆకట్టుకున్నారు. మరోవైపు, సీనియర్ నేత సువేందు అధికారి ప్రచారం ముగిసిన తర్వాత ఒక సాధారణ ఓటరు ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి తన సామాన్య జీవితాన్ని చాటుకున్నారు. వంట చేయడం, గడ్డం గీయడం, మసాలా దినుసులు నూరడం, రైతుల పక్కన పొలంలో పనిచేయడం వంటి రోజువారీ పనులతో అభ్యర్థులు సరికొత్త ప్రచార పర్వాన్ని సృష్టించారు. ఓటర్ల మదిలో చెరగని ముద్ర వేసేందుకు సాగుతున్న ఈ 'వినూత్న యుద్ధం'లో చివరకు ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: ‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్ -
‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత వేడెక్కింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించి, మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ)డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.ఓటర్లకు నిర్భయంగా లంచంతాజాగా బీజేపీ నేతలు పంపిణీ చేసిన ‘మాతృశక్తి గ్యారెంటీ కార్డుల’ చుట్టూనే ఇప్పుడు కొత్త రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ కార్డుల ద్వారా మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.3,000 జమ చేస్తామని బీజేపీ పరోక్షంగా హామీ ఇస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య నిబంధనలను అపహాస్యం చేస్తూ, ఓటర్లకు బహిరంగంగా లంచం ఇవ్వడమేనని ఆమె మండిపడ్డారు. పోలింగ్‌కు ముందే ఆదరాబాదరాగా కొత్త ఖాతాలు ఎందుకు తెరుస్తున్నారని, ఇదంతా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే ఓటు బ్యాంకు జిమ్మిక్కు మాత్రమేనని ఆమె ఆరోపించారు.ఈసీ నిష్పాక్షికతపై దీదీ ప్రశ్నల వర్షంఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఈసీ కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే ఉక్కుపాదం మోపుతోందని, అధికార బీజేపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆమె ప్రశ్నించారు. అందరికీ చట్టం సమానమే అయినప్పుడు, బీజేపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రధాని పదవిపై తనకు అపార గౌరవం ఉందని, అయితే ప్రజలను ఇలా బహిరంగంగా తప్పుదోవ పట్టిస్తుంటే తాను మౌనంగా ప్రేక్షకపాత్ర పోషించలేనని మమత అన్నారు. ఆర్థిక మంత్రిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఉత్కంఠ రేపుతోన్న బెంగాల్ పోరురాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తమవి కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన పరిపాలనా పరమైన హామీలే తప్ప, ఎలాంటి ఎన్నికల ప్రలోభాలు కావని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త వివాదం ఓటర్ల మనోభావాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయ పోరులో అందరి దృష్టి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మీదే నిలిచింది.ఇది కూడా చదవండి: టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్? -
బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగం(2026) మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు.. యువత భవిష్యత్ ఆలోచనల మధ్య సాగుతున్న మహా సంగ్రామం. ఈ చరిత్రక ఎన్నికల్లో గెలుపోటములను శాసించే బ్రహ్మాస్త్రం ఇప్పుడు ‘జెన్ జెడ్’ చేతుల్లోనే ఉంది. మొదటిసారి ఓటు వేస్తున్న లక్షలాది మంది యువత.. కుల, మత, వారసత్వ రాజకీయాలకు అతీతంగా, తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి రావాలా లేదా బీజేపీ నేతృత్వంలోని ‘పరివర్తన్ 2.0’కు పట్టం కట్టాలా అనేది ఇప్పుడు ఈ తరం యువత చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.సంక్షేమ పథకాలే టీఎంసీకి శ్రీరామరక్షతృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ‘కన్యాశ్రీ’, ‘సబుజ్ సాథి’ వంటి సంక్షేమ పథకాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వారి విద్యాభ్యాసానికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడి వారి జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అలాగే, బెంగాలీ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడే నాయకత్వంపై కొంతమంది యువతకు మక్కువ ఎక్కువ. దీదీ పాలనను కొనసాగిస్తే తమకు అందుతున్న ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నది వారి భావన. అయితే 2011లో వచ్చిన రాజకీయ మార్పును కేవలం సుదూర చరిత్రగా మాత్రమే చూస్తున్న నేటి ‘జెన్ జెడ్’ ఓటర్లు.. పాత రాజకీయ కథనాలను గుడ్డిగా నమ్మడం లేదు. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వీరు సోషల్ మీడియా ప్రభావంతో, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీని నిశితంగా పరిశీలిస్తూ, ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు.‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే..పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువతలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అధికార పార్టీ పాలనపై వారిలో క్రమంగా అసంతృప్తి రగులుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయి ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో.. బెంగాల్ యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు నైపుణ్యాన్ని నమ్ముకున్న యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపాయి. సరిగ్గా ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. పారదర్శకత, అవినీతి రహిత పాలన, కేంద్రంతో కలిసి పనిచేసే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమంటూ 'పరివర్తన్ 2.0' నినాదంతో యువతను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది.‘సీఈఓ’ లాంటి లీడర్ కావాలినేటి యువత ఏ ఒక్క రాజకీయ పార్టీకీ కట్టుబడి ఉండలేదు. వారు పూర్తిగా సమస్యల ఆధారిత విధానాన్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తరంలో చాలా మంది తమకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ, వారు అడిగే ప్రశ్నలు, డిమాండ్లు మాత్రం రాజకీయ వ్యవస్థను నిలదీసేలా ఉన్నాయి. వారికి ఉద్వేగభరితమైన మాటలు చెప్పే నాయకులు కాదు, ఒక బహుళజాతి కంపెనీని నడిపించే ‘సీఈఓ’ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థుడైన నాయకుడు కావాలి. ఉద్యోగాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను యువత కోరుకుంటోంది. రాష్ట్రంలోని పట్టణ యువత ఓటింగ్ శాతమే విజేతను నిర్ణయించనున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా యువతను ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇది కూడా చదవండి: కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో -
బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు
కోల్‌కతా: ఎన్నికల సమయంలో మైకులు పట్టుకుని, నాయకుల వెంటపడే జర్నలిస్టులను మనం చూసేవుంటాం. అయితే ఇప్పుడు ఓటర్ల ముందు చేతులు కట్టుకుని నిలుచుని, ఓట్లు అడుగుతున్న జర్నలిస్టులు తారసపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైనం కనిపిస్తోంది. దశాబ్దాల పాటు వార్తలు రాసి, ఎన్నికల విశ్లేషణలు చేసి, నాయకులకు ప్రశ్నలు వేసిన నలుగురు రిపోర్టర్లు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. న్యూస్ రూమ్ నుంచి నామినేషన్ సెంటర్ల వరకు వీరి ప్రయాణం పలు మలుపులు తిరిగింది. బెంగాల్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.ఖర్దహా నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరపున జర్నలిస్ట్ దేవదీప్ పురోహిత్ బరిలో ఉన్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయి అవగాహన తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులుగా కల్యాణ్ చక్రవర్తి (బీజేపీ), జాయ్‌దేబ్ ఘోష్ (కాంగ్రెస్), దేబ్జ్యోతి దాస్ (సీపీఐ-ఎం)గట్టి పోటీ ఇస్తున్నారు. సియురి (Siuri) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో జర్నలిస్ట్ జగన్నాథ్ ఛటోపాధ్యాయ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు నాయకుల ప్రసంగాలు కవర్ చేసిన ఆయన, ఇప్పుడు స్వయంగా ఇంటింటి ప్రచారంలో మునిగిపోయి ప్రజల మద్దతు కూడగడుతున్నారు.మరోవైపు మేమారి నియోజకవర్గం నుంచి 25 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న మానబ్ గుహక్.. బీజేపీ టికెట్‌పై బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీకి చెందిన రాసబిహారి హల్దర్ పోటీలో ఉన్నారు. అలాగే తారకేశ్వర్ నుంచి మరో రిపోర్టర్ సంతు పాన్ సైతం బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వీరి జర్నలిజం అనుభవం ఓట్లుగా మారుతుందో లేదో వేచిచూడాలి.ఇది కూడా చదవండి: అరుణాచల్ వివాదం: ‘డ్రాగన్’కు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్ -
బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఈ పోరులో బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి వచ్చిన కీలక నేత, ఆయన మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, టీఎంసీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు, పాలించు విధానాన్నే నేడు బీజేపీ పాటిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించిన మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుండటం ఏమాత్రం అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుని, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. #WATCH | Kolkata, West Bengal | Netaji Subhas Chandra Bose's grandnephew Chandra Kumar Bose joins TMC. pic.twitter.com/z8Rzt46XHo— ANI (@ANI) April 12, 2026దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను భరించలేకే ఆ పార్టీని వీడానని, లౌకికవాదం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న టీఎంసీ విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చంద్ర కుమార్ బోస్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో దీదీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా బెంగాల్ ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత 2021 ఎన్నికల్లో 213 స్థానాలతో అఖండ విజయం సాధించిన టీఎంసీకి, 77 స్థానాలతో బలపడిన బీజేపీకి మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ తరుణంలో నేతాజీ వారసుడు టీఎంసీలో చేరడం ఆ పార్టీ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(2026) దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అటు బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను టార్గెట్ చేశాయి. అవే మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అయితే ఈ ఓట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాత ఫార్ములాను నమ్ముకోగా, ఆమె కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సరికొత్త వాగ్దానాలతో రంగంలోకి దిగింది.ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు..2011 నుండి బెంగాల్లో టీఎంసీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మమతా బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన ‘లక్ష్మీర్ భండార్’ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1,500కి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ, పార్టీని ఆదుకుంటున్న మహిళా ఓటర్లను కట్టిపడేసేందుకే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో 30 శాతంగా ఉంటూ, సుమారు 110 సీట్లలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ, అలియా యూనివర్సిటీ అభివృద్ధి వంటి హామీలను టీఎంసీ ఇచ్చింది. ‘మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రం ఇక్కడి తల్లులు, కుమార్తెలు, మైనారిటీలు, పేదల పక్షాన నిలబడుతుంది’ అని టీఎంసీ నేత జయప్రకాశ్ మజుందార్ స్పష్టం చేశారు.మహిళల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు..ఇదే సమయంలో టీఎంసీకి అత్యంత బలంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకుకే గండికొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి సంచలన హామీలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ల ఏర్పాటు వంటివి బీజేపీ సంకల్ప్ పత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్‌ఖాలీ ఉదంతాలతో మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు, వారికి భద్రతపై భరోసా కల్పించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.‘చేపలు, గుడ్లు తినకుండా ఎవరూ ఆపలేరు’ మహిళా సాధికారతతో పాటు, హిందుత్వ అజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అమలు చేస్తామని, చొరబాటుదారులను ఏరివేస్తామని, ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది. ‘ఈ ఎన్నికలు బుజ్జగింపులకు-న్యాయానికి, చొరబాట్లకు-భద్రతకు, అవినీతికి-అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం’ అని బీజేపీ నేత దేబ్జిత్ సర్కార్ అభివర్ణించారు. 2021లో బీజేపీ అత్యధికంగా లాభపడిన ఎస్సీ-ఎస్టీ బెల్టుల్లో టీఎంసీ ఈసారి స్కాలర్షిప్లు, హాస్టళ్ల ఏర్పాటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి దీటుగా బీజేపీ.. రాజ్‌బన్షీ, కుర్మి భాషలకు గుర్తింపుతో పాటు, ఉత్తర బెంగాల్‌కు ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి భారీ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు తమపై ఉన్న ‘ఉత్తరాది పార్టీ’ అనే ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ ఈసారి ‘బెంగాలీ హిందుత్వ’ నినాదాన్ని ఎత్తుకుంది. వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్లు, చైతన్య మహాప్రభు సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెబుతూనే.. చేపలు, గుడ్లు తినకుండా బెంగాలీలను ఎవరూ ఆపలేరని భరోసా ఇవ్వడం గమనార్హం.ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్..ఇక ఈ ద్విముఖ పోరులో ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు గుర్తింపు రాజకీయాలను పక్కనబెట్టి ఉపాధి చుట్టూ తమ ప్రచారాన్ని అల్లుకున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని లెఫ్ట్ ఫ్రంట్ హామీ ఇస్తే, అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తామని, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రవర్తి మాటల్లో.. ‘టీఎంసీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తుంటే, బీజేపీ దానిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాము ఇంకా రేసులో ఉన్నామని గుర్తుచేయడానికే లెఫ్ట్, కాంగ్రెస్ పోరాడుతున్నాయి’. కాగా పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వేస్తున్న ప్రతి ఎత్తుగడ, ఇస్తున్న ప్రతి హామీ బెంగాల్ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. ఏ మేనిఫెస్టో ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొడుతుందో ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే!ఇది కూడా చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం -
పశ్చిమ బెంగాల్లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 11) తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్‌ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్‌లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. -
బెంగాల్లో మళ్లీ అదే రిపీట్ అవుద్ది: మోదీ
హాల్దియా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్లో మార్పుల రాబోతుందని చెప్పారు. మోదీ గురువారం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈ సారి భవానీపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు."రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను ఓడించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయించారు. అని నేను చూశాను. ఈ ఉత్సాహం, ఉత్తేజంలోనే బీజేపీ విజయం కనిపిస్తోంది. ఇది మార్పును తీసుకువచ్చే తుపాను. ఇది టీఎంసీ సర్కారుకు వీడ్కోలు. ఐదు సంవత్సరాల క్రితం మేదినిపూర్, నందిగ్రామ్ మార్పునకు మార్గాన్ని చూపాయి. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ అదే దారిలో నడవడం ప్రారంభించింది.ఇతర రాష్ట్రాలు ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాయి. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించింది. బెంగాల్లో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. బెంగాల్‌ను అభివృద్ధి వైపుగా తీసుకెళ్లడానికి పునాదిని శక్తిమంతంగా వేసే ఎన్నికలు ఇవి. టీఎంసీ సర్కారును గద్దె దించడం అవసరం. ఇప్పుడు భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశంలో వృద్ధి వేగవంతంగా ఉందంటే అనేక రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. కానీ దేశం ముందుకు వెళ్తుండగా, టీఎంసీ సర్కార్ బెంగాల్‌ను వెనక్కి నెడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు.చొరబాటుదారుల పరిశ్రమలు పెరిగాయి.. ఒకప్పుడు భారత పురోగతికి పునాది వేసిన తయారీ, వాణిజ్యాన్ని బలపరిచిన బెంగాల్‌ను టీఎంసీ అన్ని అభివృద్ధి సూచికల్లో దిగజార్చిందని మోదీ చెప్పారు. ‘ఈ పరిస్థితి మేదినిపూర్, హాల్దియా ప్రజల కంటే ఎవరికి బాగా ఎవరు తెలుసు? శతాబ్దాల క్రితమే చారిత్రక తమ్రలిప్త (Tamralipta Kingdom)తో వాణిజ్యం జరిగిన పోర్ట్ నగరం. హాల్దియా ఆధునిక భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. కానీ ఇటీవల దశాబ్దాల్లో హాల్దియాలో కర్మాగారాలు మూతపడ్డాయి. ఒకప్పుడు దేశం నలుమూలల నుంచి ప్రజలు హాల్దియాకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి యువత ఉద్యోగాల కోసం అండమాన్, ఒడిశాకు వలస వెళ్తున్నారు. టీఎంసీ సర్కార్‌లో చొరబాటుదారుల పరిశ్రమలు మాత్రమే పెరిగాయి. నకిలీ పత్రాలు తయారు చేయడం, పశువుల అక్రమ రవాణా వంటి రంగాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.దీదీకే జై కొడుతున్న జనం!తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందనమమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.ఎన్నికల నగారాకు అంతా సిద్ధంవచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’ -
నేటి నుంచి బెంగాల్లో బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాషాయదళం ముందుకు సాగుతోంది. పోలింగ్‌కు ముందు పార్టీ శ్రేణులను సన్న ద్ధం చేసేలా బృహత్ కార్యాచరణతో ముందుకెళుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేలా ఆదివారం నుంచి వారం పాటు ‘పరివర్తన్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. 260 భారీ సభలు..2021 అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఈసారి 160 స్థానాలు లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తృణముల్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రను మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలుకావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ వంటి పథకాలు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెబుతోంది. అక్రమ ఓటర్లు, చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ జాతీయ భద్రతపై టీఎంసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తమ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకుగాను 260 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, 250 చిన్నచిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తూ మొత్తంగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేలా యాత్రను డిజైన్ చేశారు. దీనిద్వారా ప్రత్యక్షంగా కోటిన్నర మంది ప్రజలను కలవాలన్నది లక్ష్యంగా ఉంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ యాత్రలో తొలిరోజు కూచ్‌బెహర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కానుండగా, నదియా ఉత్తర్లో మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఘార్గ్రామ్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పురులియాలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి పాల్గొననున్నారు. 2వ తేదీన దక్షిణ 24 పరగణాలు, మథురాపూర్, రాయదిఘి సభలకు హోంమంత్రి అమిత్ షా, హౌరా, హూగ్లీ జిల్లాల సభలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాద్వాన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు సభలకు హాజరు కానున్నారు. ఈ యాత్ర చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది. -
నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటా; ఎంపీ సవాల్
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించి బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నబీజేపీకి అభిషేక్ ఒక సంచలన సవాల్ విసిరారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సంచలన ప్రకటన చేశారు. ‘‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబసభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తీసుకొస్తే.. మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని.. తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
దూకుడు తగ్గించడమా? పెంచడమా?
కోల్‌కతా/న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో.. రానున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. గతంలో మాదిరిగానే పౌరసత్వ సవరణ చట్టం అమలు, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై దూకుడుగా వెళ్లాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహాలను తెరపైకి తేవాలా? అనే విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోవని తాజా ఢిల్లీ ఎన్నికలు స్పష్టం చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని భావించలేమని పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. వారు ఢిల్లీ ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఢిల్లీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. ‘ఢిల్లీలో కొన్ని నెలల వ్యవధిలోనే రెండు విభిన్న ఫలితాలు వచ్చాయి. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమాగా ఉండలేం’ అని వారు వివరించారు. ‘రాష్ట్ర ఎన్నికలకు వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది. జాతీయ ఎన్నికల్లో పనిచేసిన అంశాలు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు.సీఏఏ, ఎన్నార్సీల అమలుపైననే మా ప్రచారం ఉండకూడదు. సుపరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలనూ తెరపైకి తేవాలి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ వాదనకు విరుద్ధంగా మరో వాదనను మరి కొందరు నేతలు వినిపించారు. ‘సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి వ్యూహాలను మార్చాల్సిన అవసరం లేదు. వాటిపై దూకుడుగా ముందుకు వెళ్లడమే మంచిది. గతంలో అలా దూకుడుగా వెళ్లిన సందర్భంగా మంచి ఫలితాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. తృణమూల్ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే.. ఆవేశపూరిత, ఉద్వేగభరిత వ్యూహాలనే అమలు చేయాలి. ఒకవేళ వ్యూహాలను మారిస్తే వెనకడుగు వేసినట్లవుతుంది. ఇది పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సందేశం తీసుకువెళ్తుంది’ అని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు సన్నిహితులైన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడ్తున్నారు. ద్విముఖ పోరు వల్లనే ఓటమి ‘ఢిల్లీ’ పరాజయంపై బీజేపీ సమీక్ష ప్రారంభించింది. గతం కన్నా ఈ సారి ఓటు శాతం పెంచుకున్నప్పటికీ.. ద్విముఖ పోటీ నెలకొనడం వల్లనే ఓటమి పాలయినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 62 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 2015లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి ఆ సంఖ్యను కాస్త మెరుగుపర్చుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, పార్టీ దిగ్గజాలను ప్రచార బరిలో దింపినప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోవడంపై గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. -
సీపీఎం అడుగులు ఎటు?
పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గురించి ఏదైనా చెప్పడానికి ఉన్నదీ అంటే, అది– ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మిగిలి ఉంది అని చెప్పడమే. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పనిచేస్తోందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే, సీపీఎం కలకత్తా సభలలో జరిగిన పరిణామం దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీలో అయినా చోటు చేసుకుకోగలదంటే నమ్మడం సాధ్యం కాదు. రాహుల్ గాంధీ, అమిత్‌షా, లేదంటే కె. చంద్రశేఖరరావు ఏదైనా ఒక రాజకీయ ప్రతిపాదన చేస్తే వారి నాయకత్వంలోని పార్టీల సభ్యులు దానిని ఓడిస్తారని మనం కలలో అయినా ఊహించగలమా? కలకత్తాలో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగబోయే సమావేశానికి అజెండాను తయారు చేసి పెట్టిన సమావేశం ఇది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో వ్యూహాత్మక అవగాహన కుదుర్చుకోవాలని ఆ పార్టీలో ఒక ప్రతిపాదన ఉంది. ఈ ఆలోచనకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మద్దతు ఉంది. కానీ ఇలాంటి ఆలోచనకు సీతారాం యేచూరి కంటే ముందు ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న ప్రకాశ్ కారత్‌తో పాటు, పార్టీ కేరళ శాఖ కూడా ప్రతిఘటించడం జరిగింది. దీని మీదే తీవ్ర స్థాయి చర్చ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఓటింగ్ పెట్టడంతో 31 ఓట్లతో సీతారాం యేచూరి ప్రతిపాదన వీగిపోయింది. ఆయన చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా 55 ఓట్లు వచ్చాయి. దీని అర్థం కాంగ్రెస్ చేయి, సీపీఎంకు అండగా ఉండదు. హైదరాబాద్ సభల నిర్ణయమే కీలకమా? అయితే హైదరాబాద్ సభలో తీసుకునే నిర్ణయమే అంతిమ నిర్ణయమవుతుం దని యేచూరి వర్గీయులు మాత్రం లోపాయికారీగా ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈ వర్గంలో ఎక్కువగా బెంగాల్ శాఖ సభ్యులే ఉన్నారు. అలాగే ఫిబ్రవరిలో జరగబోయే త్రిపుర ఎన్నికల తరువాత పరిస్థితులు మారతాయని కూడా ఆశాజనకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోని కూటమి నుంచి సీపీఎం నాయకత్వంలోని కూటమి గట్టి పోటీని ఎదుర్కొం టున్నది. కానీ కేరళ పార్టీ శాఖ తన విధానాన్ని మార్చుకోదు. ఆ రాష్ట్ర పరిస్థితి అనే పట్టకం నుంచి చూసుకుని ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తుంది కూడా. ఆ రాష్ట్ర రాజకీయాలలో సీపీఎం నాయకత్వంలోని కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమితో తలపడుతుంది. కాబట్టి జాతీయ స్థాయి ఒప్పందం యోచనకు అంగీకరించదు. దీని వల్ల బీజేపీకి ప్రతిపక్ష స్థానం లభిస్తుందని సీపీఎం భయపడుతోంది. నిజానికి బీజేపీ కూడా అలాంటి అవకాశం కోసమే అక్కడ ఎదురుచూస్తున్నది. యేచూరి ప్రతిపాదనను ఓడించడానికి కారత్ శిబిరం 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మందుగుండులా ఉపయోగించుకుంది. ఆ ఎన్నికలలో బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నాయి. అయితే సీపీఎం కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు లభించాయి. కారత్ చెప్పినది వాస్తవమని రుజవయిందని చెప్పడానికి ఆ ఎన్నికల ఫలితాలే ఉపయోగపడినట్టు కనిపిస్తున్నది. అప్పుడు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు కారత్ వర్గం వ్యతిరేకించింది. ‘నేను ముందే చెప్పలేదూ!’ అన్న భావాన్ని గొంతు నిండా నింపుకుని ప్రకాశ్ కారత్ కలకత్తా సభలకు వచ్చారు. కాగా, పార్టీలో జరిగిన అత్యున్నత స్థాయి ఎన్నికలలో తన ప్రతిపాదన వీగిపోవడమంటే, పార్టీలో తన స్థానం ఎక్కడో యేచూరికి అవగతమయ్యేటట్టు చేసినట్టే. ఇంకా చెప్పాలంటే కేంద్ర కమిటీలోని 91 మంది సభ్యులలో మూడింట ఒక వంతు మంది మద్దతును మాత్రమే యేచూరి కూడగట్టగలరని కూడా వెల్లడయింది. ఇది సహజంగానే ఆయనను నిరాశకు గురి చేసి, రాజీనామాకు సిద్ధపడేటట్టు చేసింది. అయితే ఆయనను ఆ పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఆయన నిష్క్రమణకు వీర మరణం స్థాయి దక్కకూడదని భావిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ సమావేశాల కంటే ముందే సీపీఎంలో చీలిక అవకాశాలను తోసిపుచ్చలేం. నిజానికి ఈ ఎన్నిక పార్టీలోని దోషాన్ని కూడా ఎత్తి చూపింది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకు కూడా అంగీకరించకుండా కేరళ శాఖ ఓటు వేసింది. ఇక బెంగాల్ శాఖలో అయితే ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన వారంతా యేచూరి ప్రతిపాదనకు మద్దతు పలికారు. దేశ రాజకీయ వ్యవస్థలో వేగంగా ప్రాధాన్యం కోల్పోతున్న పార్టీకి ఇది మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం యేచూరికి ఇదే మొదటిసారి కాదు కూడా. రాజ్యసభ బరిలోకి యేచూరి దిగితే సీపీఎంకు తమ మద్దతు ఉంటుందని జూలై , 2017లో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఆయనను మూడోసారి కూడా ఎగువ సభకు పంపించడానికి సీపీఎం కేంద్ర కమిటీ నిరాకరించింది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవరికీ రెండు పర్యాయాలకు మించి ఆ అవకాశం ఇవ్వరు. పార్టీ నిర్మాణం పని మీద యేచూరి మరింత సమయం కేటాయించవలసి ఉంది. చివరిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సీపీఎంకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇందులో చివరి కారణమే రాజకీయంగా చాలా ప్రాధాన్యం కలి గినది. పార్టీలో కాంగ్రెస్ పట్ల ప్రతికూల పవనాలు వీస్తున్న సంగతిని యేచూరి అప్పుడే గుర్తించి ఉండవలసింది. కాబట్టి కలకత్తా సమావేశాలలో జరిగిన పరిణామం రెండోసారి ఆయనకు ఎదురైన ఓటమి. ఒక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో భారత రాజకీయాలలో సంభవించిన ఈ పరిణామం అర్థం ఏమిటి? వామపక్షాల ప్రభావం నిజంగా ఎంత? బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్‌కు సీపీఎం లేదా వామపక్షం అండగా నిలబడగలదన్న భ్రమలలో మనం మిగిలిపోకూడదు. ఆ వాతావరణం లేదు. నిజం చెప్పాలంటే వామపక్షం ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కేవలం లెటర్‌హెడ్ పార్టీ స్థాయికి కుంచించుకుపోయింది. ఎన్నికలలో వరస అపజయాలు, వివిధ రాష్ట్రాలలోని ప్రధాన స్రవంతి పార్టీలకు తోక పార్టీలుగా వ్యవహరించడం కూడా ఆ పరిస్థితిని తెచ్చి పెట్టింది. తనకు సిద్ధాంతపరమైన గౌరవం ఉందని ఆ పార్టీ అభిప్రాయం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ – ఈ జాబితా ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ అన్ని రాష్ట్రాలలోను వామపక్షం రాజకీయ పక్షంగా ప్రాధాన్యం కోల్పోయింది. వీటితో పాటు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిలో కూడా వామపక్షం లేదు. ఇది కూడా ఒక వాస్తవమే. అమెరికాకు వ్యతిరేకంగా వారు ఇచ్చే సామ్రాజ్య వ్యతిరేక నినాదాలు 21వ శతాబ్దపు భారతదేశంలో చర్విత చర్వణంగా మాత్రమే ఉన్నాయి. అయితే కేంద్రంలోను, రాష్ట్రాలలోను బీజేపీ నుంచి ఎంతటి ప్రతికూలత ఎదురవుతున్నప్పటికీ వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో చురుకుగానే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయి రాజకీయాలకీ; కేంద్ర రాష్ట్ర స్థాయి రాజకీయాలకూ మధ్య వచ్చిన శూన్యాన్ని నింపడం ఎలాగో కూడా సీపీఎం ఆలోచించాలి. విశ్వవిద్యాలయాల స్థాయిలో మొదటిసారి ఓటు హక్కు విని యోగించుకుంటున్నవారిని సాధారణ ఎన్నికలలో తమ బలంగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు? ఇందుకు కారణం కొన్ని భ్రమలలో ఆ పార్టీ చిక్కుకుని ఉండడమే. బీజేపీని తన ప్రధాన శత్రువని సీపీఎం పేర్కొంటున్నది. అయినప్పటికీ, బీజేపీ కంటే తక్కువ శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి అది సుముఖంగా లేదు. ప్రజా ప్రయోజనం కంటే అహంభావానిదే పై చేయి అయ్యేటట్టు చేస్తోందనడానికి ఇదే నిదర్శనం. వామపక్షం గళం బొత్తిగా కరవైపోతున్న కాలమిది. సాపేక్షంగా చూసినప్పుడు యేచూరి వంటి యువ నాయకుడి అవసరం ఇప్పుడు రాజ్యసభలో ఉందన్న వాస్తవాన్ని పార్టీ గుర్తించడం లేదు. పైగా నిబంధనలంటూ మంకు పట్టుకు పరిమితమైంది. కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు వామపక్షాలు తిరస్కరించడం అంటే అది విపక్ష కూటమి ఏర్పాటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది క్షేత్రస్థాయిలో కాకపోవచ్చు. కానీ అవగాహనకు సంబంధించి ఎక్కువ ప్రభావం చూపుతుంది. కలకత్తా సభ తరువాత సీపీఎం నిర్ణయం మీద కొన్ని చతురోక్తులు ఇప్పటికే జనంలోకి వచ్చాయి కూడా. అక్కడ జరిగిన నిర్ణయం సీపీఎంలో బీజేపీ విజయమని ఆ చతురోక్తులు పేర్కొంటున్నాయి. ఇంకా పలువురు ఇది సీపీఎం పార్టీ చేసిన రెండవ చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు. 1996లో జ్యోతిబసు ప్రధాని కావడానికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నడం మొదటి చారిత్రక తప్పిదమని చెబుతూ ఉంటారు. ఆ రెండుచోట్ల మినహాయించినా... సీపీఎం నిర్ణయాన్ని గుడ్డిలో మెల్లగా భావించాలి. ముఖ్యంగా బెంగాల్ రాజకీయాల విషయంలో అయితే అదే నిజం. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు ఖాళీ చేసిన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి దీటుగా నిలబడగలిగిన ప్రధాన వ్యతిరేక శక్తి. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలి. 2019 ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సోనియాగాంధీ, మమతా బెనర్జీల మధ్య ఉన్న స్నేహాన్ని ఉపయోగించాలి. సీట్ల సర్దుబాటు విషయంలో మమత కొన్ని చిక్కులు సృష్టించవచ్చు. కానీ రాహుల్ మాత్రం సీపీఎం చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయరాదు. రాహుల్ ఢిల్లీలో ఉంటూ కలకత్తా పట్టకం నుంచి చూసి పరిస్థితులను అంచనా వేయరాదు. కేరళకు సంబంధించి ఢిల్లీలో దోస్తీ, కేరళలో కుస్తీ వంటి మాటలతో బీజేపీ ఎద్దేవా చేసే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోకూడదు. మరొక విపక్షంగానే భావిస్తూ అక్కడ కాంగ్రెస్ కూటమి పినరాయ్ విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్తో పోరాడగలదు. సీపీఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినా అక్కడ మూడో పక్షానికి స్థానానికి దొరకడమనేది అరుదని గతాన్ని చూస్తే తెలుస్తుంది. బీజేపీ పరిస్థితి అక్కడ అదే. తన ప్రతిపాదన గురించి సభ్యులకు అవగాహన కల్పించడానికి సీతారాం యేచూరికి ఇంకా రెండు మాసాల గడువు ఉంది. కేరళ, బెంగాల్‌లను మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి సీపీఎంకు కొంత అవకాశం ఉంది. కానీ దీనితో ప్రయోజనం తక్కువే. ఇలాంటి ప్రయత్నం మూడోసారి కూడా విఫలమైతే యేచూరికి రాజీనామా చేయడం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం పార్టీలో బలం లేని వాస్తవాన్ని ఏ నాయకుడికైనా అర్థమయ్యేటట్టు చేస్తుంది. - టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
మార్ఫింగ్ ఫొటోతో రచ్చరచ్చ!
కోల్‌కతా: మమతా బెనర్జీపై కేవలం కార్టూన్ వేసినందుకు ఏకంగా ప్రొఫెసర్‌ను జైలుకు పంపిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్ నేతలది. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మార్ఫింగ్ ఫొటోలతో రాజకీయ లబ్ధి పొందేందుకు తహతహలాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కరత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను తృణమూల్ ఎంపీ డిరెక్ ఒబ్రియన్ ఆదివారం విలేకరులకు విడుదల చేశాడు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా సిద్ధాంత వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇది నిజమైన ఫొటోనా? కాదా? అన్నది మాత్రం ఆయన చూసుకోలేదు. ఈ ఫొటోపై వెంటనే బీజేపీ మండిపడింది. అది ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని, నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ నకిలీ ఫొటోలను విడుదలచేస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్రమోదీకి రాజ్‌నాథ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ నాటకమాడుతుందని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం అగ్రనేత కరత్ కూడా స్పందించారు. రాజ్‌నాథ్ హోంమంత్రి అయ్యాక ఆయనను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. -
ఎన్నికల సిబ్బంది కారులో బాంబులు!
పశ్చిమబెంగాల్లో ఎన్నికల హింస దారుణంగా ఉంది. ఎన్నికల అధికారులను తీసుకెళ్లాల్సిన కారులో నాలుగు బాంబులు కనిపించాయి. డ్రైవర్ కారును స్టార్ట్ చేయబోతుండగా.. ఈ బాంబులను గుర్తించారు. ఆదివారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు డీసీఆర్సీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సెంట్రల్ స్కూలు ఆవరణలో ఈ కారు పార్క్ చేసి ఉంది. తన కారు సీటు కింద పాలిథిన్ బ్యాగులో ఏవో వస్తువులు ఉండటాన్ని డ్రైవర్ చూశాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేయడంతో అందరూ అక్కడకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, పోలీసు సిబ్బంది కూడా వచ్చి పాలిథిన్ బ్యాగును తీశారు. అందులో నాలుగు బాంబులు ఉన్నట్లు ఆ తర్వాత చెప్పారు. ఈ ఘటనతో ఎన్నికల వాహనాలను తీసుకెళ్లడానికి అక్కడున్న డ్రైవర్లు నిరాకరించారు. తమకు తగినంత భద్రత కల్పించాలని లేకపోతే ముందుకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఎన్నికల సిబ్బందిని తరలించడం కూడా కష్టంగా మారింది. -
అప్పుడు మా మాటీ మానుస్.. ఇప్పుడు మనీ మనీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. పరస్పర విమర్శలతో అక్కడి వాతావరణం గరం గరంగా మారింది. గత ఎన్నికల్లో 'మా మాటీ మానుష్' అనే నినాదం విన్నామని, కానీ ఐదేళ్ల తర్వాత చూస్తే ఎక్కడ చూసినా 'మరణం.. మరణం.. మరణం..' అని, 'మనీ.. మనీ' అని వింటున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. ''నరదా తెలుసు కదా.. టీవీలో చూశాను.. ఈ మా మాటీ మానుస్ వాళ్లు డబ్బు తీసుకుంటున్నారు డబ్బులు..'' అని ఎద్దేవా చేశారు. నరదా స్టింగ్ ఆపరేషన్‌లో పశ్చిమబెంగాల్ మంత్రులు లంచాలు తీసుకుంటుండగా బయటపడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వాళ్లకు అభవృద్ధితో అవసరం లేదని.. ఒకవైపు వామపక్షాలు మరోవైపు దీదీ ఇద్దరూ అత్యాచారాలు, అవినీతి, హింసకు సంబంధించిన ఆరోపణలతో పరస్పరం కొట్టుకుంటున్నారని మోదీ అన్నారు. దీదీ గానీ, వామపక్షాలు గానీ.. మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వరని ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పాలనలో పశ్చిమబెంగాల్ దారుణాలను చూసిందని, ఇద్దరి తీరుతెన్నులు స్పష్టంగా తెలిశాయని చెప్పారు. తన సమావేశాలకు రావడానికి మమతా బెనర్జీ వెనకాడతారని, కానీ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సోనియా గాంధీని మాత్రం తప్పనిసరిగా కలిసి వెళ్తారని.. వాళ్లిద్దరి బంధం ఏంటో తనకు అర్థం కాదని అన్నారు. -
91 ఏళ్ల వయస్సులోనూ.. బస్తీమే సవాల్!
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ అధికారంలో ఉన్న 1962లో ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీచేశారు. వెనుదిగిరి చూస్తే 54 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమరంలో ఆయన పదికిపైగా విజయాలు సాధించారు. అయినా 91 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఎన్నికల గోదా నుంచి ఆయన తప్పుకోలేదు. ఇప్పటికీ అదే ఇనుమడించిన ఉత్సాహంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆయనే జ్ఞాన్‌సింగ్ సోహన్‌పాల్. 91 ఏళ్ల ఆయన బెంగాల్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సర్దార్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాంప్రసాద్ తివారీ, అటు బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బరిలోకి దిగారు. సోహన్‌పాల్ 1977 ఎన్నికల్లో తొలిసారి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో వామపక్షాల ప్రభంజనంతో బెంగాల్లో కాంగ్రెస్‌లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని పరాజయాలు ఎదురైనా ఆయన ప్రత్యక్ష రాజకీయ రంగం నుంచి వైదొలగలేదు. 'ప్రజలకు ఎంతో పనిచేయాల్సి ఉంది. ఎన్నో ప్రాజెక్టులు సగమే పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది' అని ఉత్సాహంగా చెప్తున్నారు సోహన్‌పాల్. 'చాచా'గా పేరొందిన సోహన్‌పాల్ మరోసారి ప్రజల మద్దతు తనకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరగ్‌పూర్ పట్టణంలో ప్రతి ఒక్కరూ తనను గుర్తుపడతారని, ప్రజలకు సేవ చేసేందుకు తనకు మరో అవకాశం లభిస్తుందని ముదుసలి వయస్సులోనూ ఉత్సాహం ఏమాత్రం ఈ కాంగ్రెస్ అభ్యర్థి భరోసాగా ఉన్నారు. -
ఆమె సూపర్ ఫాస్ట్ గురూ!
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలు ప్రకటించి మినీ సార్వత్రిక సంగ్రామానికి తెరతీశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ. ఆయన అలా తేదీలు ప్రకటించారో.. లేదో, అదేరోజు సాయంత్రం తమ రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు కూడా పశ్చిమబెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి తేదీలను ప్రకటించారు. కానీ, ఈ ఐదు రాష్ట్రాల్లో టీఎంసీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా అసలు ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మమతమ్మ మాత్రం పెద్ద ఫైలు పట్టుకుని సాయంత్రం మీడియాను పిలిచి మొత్తం అన్ని స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పారు. దాంతో ప్రత్యర్థులు సహా ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఇంత ప్రిపరేషన్ ఉండటం అసాధ్యమని, దాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత కేవలం మమతకే దక్కుతుందని అంటున్నారు. వరుసగా రెండోసారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విజయకేతనం ఎగరేయడం దాదాపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా దీదీ ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉంటే.. ఇక ప్రత్యర్థి పార్టీలు కోలుకోవడం కష్టంలాగే కనిపిస్తోంది. కమ్యూనిస్టులు సహా మరే ఇతర పార్టీ ఇంకా అసలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తులు మొదలుపెట్టక ముందే అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటే.. వాళ్లకు చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది. దాంతో విజయావకాశాలు మరింత మెరుగుపడటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేయడంలో మమతా బెనర్జీ మహా ఫాస్ట్ అని చెబుతారు. మరీ ఇంత ఫాస్టా అని మిగిలినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట.


