బెంగాల్‌లో ముస్లింలు, మతువాలపై వేధింపులు | NCP Nahid warns of rise in communal propaganda after West Bengal polls | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ముస్లింలు, మతువాలపై వేధింపులు

May 9 2026 4:45 AM | Updated on May 9 2026 4:45 AM

NCP Nahid warns of rise in communal propaganda after West Bengal polls

వారికి ఓటు హక్కు నిరాకరించారు 

బంగ్లాదేశ్‌ ఎంపీ తీవ్ర విమర్శలు 

ఢాకా: పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు, మతువాలు వేధింపులకు గురవుతున్నారని, వారి ఓటు హక్కును కోల్పోయారని బంగ్లాదేశ్‌ నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ, ప్రతిపక్ష చీఫ్‌ విప్‌ నహీద్‌ ఇస్లాం వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు భారత్‌ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ, అక్కడి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

 ముస్లింలు, దళితులు, మతువాలతో సహా అన్ని మైనారిటీ వర్గాలకు సమాన రక్షణ కల్పించి దక్షిణాసియాకు బంగ్లాదేశ్‌ ఆదర్శంగా నిలవాలన్నారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల బెంగాల్‌లో ఎన్నికలు జరిగా యి. ఎన్నికలు వారి అంతర్గత విషయం. దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే, ఎన్నికలకు ముందే లక్షలాది మంది ఓటర్లు తమ హక్కులను కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు, మతువా వర్గానికి చెందినవారున్నారు. 

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఈ ముస్లింలకు పౌరసత్వం నిరాకరిస్తున్నారని, వారిపై హింస పెరిగిందని ఆరోపణలొస్తున్నాయి’అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని మత సమూహాల శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించాల్సిన బాధ్యతను బంగ్లాదేశ్‌పై ఉందన్నారు. బంగ్లాదేశ్‌ వ్యతిరేక కథనాల పట్ల, మత విద్వేష ప్రచారం, రెచ్చగొట్టే చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలో మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్‌ ఆదర్శంగా నిలవాలన్నారు. పారీ్టలో అంతర్గత విభేదాలను నివారించాలని, యోగ్యత, సామూహిక క్రమశిక్షణ ఆధారంగా సంస్థాగత బలాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఉద్యమాల్లో పాల్గొన్న వారి హక్కులను పరిరక్షించడం, భవిష్యత్‌ రాజకీయ ప్రక్రియలలో వారిని భాగస్వాములను చేయడం పార్టీ భవిష్యత్‌కు అత్యవసమని ఆయన పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement