రాజ్యాంగం ఏం చెబుతోంది? | Begal Results: Mamata Banerjee Refused To Resign What Constitution Says | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం ఏం చెబుతోంది?

May 6 2026 6:30 AM | Updated on May 6 2026 9:38 PM

Begal Results: Mamata Banerjee Refused To Resign What Constitution Says

ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ చెబుతున్న మాట ఇది. ఇంతకీ రాజ్యాంగం ఏం చెబుతోంది.. 

ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ తదుపరి కార్యాచరణను అమల్లోకి తీసుకురావచ్చు. ఆ అధికారం రాజ్యాంగం గవర్నర్‌కు ప్రసాదించింది. శాసనసభ అనేది శాశ్వతసభ కాదు. ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దవుతుంది. 

తదుపరి ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలున్న పార్టీని కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ కోరవచ్చు. పాత సీఎం రాజీనామా చేయాలని ఆదేశించవచ్చు. రాజీనామాచేయకపోతే పాత మంత్రిమండలి, కేబినెట్‌ మంత్రుల పదవులను గవర్నర్‌ రద్దుచేస్తారు.

ఒకవేళ పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేల్లో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య సాధారణ మెజారిటీకి సరిపడా లేదు కాబట్టి బలనిరూపణలో మమత ఓడిపోవడం ఖాయం. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీనే గవర్నర్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. 

నేటితోనే టీఎంసీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తోంది. దీంతో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం చూసినా టీఎంసీ పాలన ముగిసినట్లే. మమత ఆటోమేటిక్‌గా సీఎం పదవిని కోల్పోయినట్లే లెక్క. గవర్నర్‌ కోరనిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మమతకు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement