నాడియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేడు (బుధవారం) తీవ్ర ఉత్కంఠ నడుమ ప్రారంభమైంది. ఇది కేవలం ఎన్నికల సమరం మాత్రమే కాదని, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటం’ అని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడియా జిల్లాలోని కరీంపూర్ గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 120లో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె.. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
#WATCH | West Bengal Assembly Elections 2026: On arriving in an e-rickshaw to cast her vote, TMC MP Mahua Moitra says, "Because the ECI has said that not to come by motorbike. So we have come by TOTO."
"This time, we are engaged in the fight to save democracy. 2.7 million voters… https://t.co/JlRbauNv4V pic.twitter.com/NGo9jH83Ph— ANI (@ANI) April 29, 2026
‘టోటో’లో వచ్చి ఓటేసిన ఎంపీ
ఎన్నికల సంఘం నిబంధనలకు వినూత్న రీతిలో సమాధానమిచ్చారు మహువా మోయిత్రా. పోలింగ్ కేంద్రాల వద్దకు మోటార్‌బైక్‌లపై రాకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో, ఆమె ఏకంగా ఓ ‘టోటో’ (ఈ-రిక్షా)లో వచ్చి ఓటు వేశారు. నిబంధనలను పాటిస్తూనే, తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఆటంకాలు అడ్డురావని ఈ చర్య ద్వారా తెలియజేశారు.
27 లక్షల ఓట్ల గల్లంతుపై ప్రతీకారం
కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై మహువా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.7 మిలియన్ల (27 లక్షల) మంది ఓటర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని ఆమె ఆరోపించారు. అయితే, మిగిలిన ఓటర్లు కచ్చితంగా వంద శాతం ఓటింగ్‌లో పాల్గొంటారని, అందుకే ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం ఖాయమని అన్నారు. ఇది సాధారణ లెక్క అని, కేంద్రం, ఈసీ ఆడిన ఈ నాటకానికి బదులు తీర్చుకోవడానికే ప్రజలు కసితో ఓటు వేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!


