Live Updates
బీజేపీ ఘన విజయం.. కమలం హవా..
విజయోత్సవ సంబరాలకు మోదీ..
- విజయోత్సవ సంబరాలకు మోదీ.
- సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ.
- బెంగాల్ విజయోత్సవ సంబరాల్లో పాల్గొననున్న మోదీ.
- సాయంత్రం 6.30 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగం.
- పశ్చిమ బెంగాల్‌లో కమల వికాసం..
- ముగిసిన 15 ఏళ్ల దీదీ పాలన.
- భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.
వెనుకంజలో ముగ్గురు సీఎంలు..
- వెనుకంజలో మమత, పినరయి, స్టాలిన్
- కేరళ సీఎం పినరయి విజయన్ వెనుకంజ
- ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ 2812 ఓట్ల ఆధిక్యం
- ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 95 స్థానాల్లో ఆధిక్యం
- భవానీపూర్‌లో పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ వెనుకంజ
- భవానీపూర్, నందిగ్రామ్ స్థానాల నుంచి పోటీ చేసిన సువేందు అధికారి ఆధిక్యం
- బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
- బీజేపీ దూసుకెళ్తుండటంతో శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
- కొలత్తూర్ నియోజకవర్గంలో సీఎం ఎంకే స్టాలిన్ వెనకంజ
- దూసుకుపోతున్న టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు
రంగస్వామి విజయం..
- రంగస్వామి విజయం..
- తట్టంచావడి స్థానంలో రంగస్వామి విజయం
- పుదుచ్చేరిలోని తట్టంచావడి స్థానంలో ముఖ్యమంత్రి రంగస్వామి విజయం సాధించారు.
- పోటీ చేసిన మరో స్థానం మంగళంలో ఆధిక్యంలో ఉన్నారు.
హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..
- మూడు రాష్ట్రాల్లో బీజేపీ హవా..
- బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ దూకుడు.
- అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ.
- కేరళలో ఘోర పరాభవం దిశగా ఎల్డీఎఫ్.
- కేరళలో దూసుకుపోతున్న యూడీఎఫ్.
- తమిళనాడులో టీవీకే భారీ ఆధిక్యం.
బెంగాల్‌లో వికసించిన కమలం..
- బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం..
- బెంగాల్‌లో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం
- ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
- ముస్లింలో చీలిక ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రాయం.
- ఈ చీలిక ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది
- దక్షిణ బెంగాల్, కూచ్ బెహర్‌లో మాత్రం టీఎంసీ వైపు మొగ్గు చూపుతున్నారు.
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఈసీ డేటా ప్రకారం బీజేపీ 32 స్థానాల్లో, టీఎంసీ 9 స్థానాల్లో ఆధిక్యం
- అసోం, పుదుచ్చేరిలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
మార్పు కోరుకున్న ఓటర్లు..
- మార్పు కోరుకున్న ఓటర్లు..
- బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం.
- తమిళనాడులో సంచలన ఫలితాలు..
- తాజా ఎన్నికల ఫలితాల్లో సీఎం స్టాలిన్ సహా 28మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
డీఎంకే ప్రముఖుల వెనుకంజ..
- డీఎంకే ప్రముఖుల వెనుకంజ..
- స్టాలిన్ సహా డీఎంకే ప్రముఖుల వెనుకంజ.
- కొళత్తూరులో స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి ఆధిక్యం.
- దాదాపు 107 స్థానాల్లో టీవీకే ఆధిక్యం.
విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత..
- టీవీకే చీఫ్ విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత.
- విజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలు.
- జెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులు.
- మరోవైపు.. మూడో స్థానానికి పడిపోయిన డీఎంకే
- డీఎంకే శ్రేణుల్లో నిరాశ.
#WATCH | Tamil Nadu Elections 2026 | Security increased outside the residence of TVK chief and actor Vijay, in Chennai.
Official EC trends show TVK leading on 68 of the total 234 seats in the state; counting is still underway. pic.twitter.com/LQXfCO1f8S— ANI (@ANI) May 4, 2026
ఏడు ఉప ఎన్నిక స్థానాల్లో ఫలితాలు ఇలా..
- ఏడు ఉప ఎన్నిక స్థానాల్లో ఫలితాలు ఇలా..
- గుజరాత్‌లోని ఉమ్రిత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజ.
- కర్ణాటకలోని భగల్‌కోట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్.
- కర్ణాటకలోని దావణగెరే సౌత్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం.
- మహారాష్ట్రలోని బారామతిలో లీడ్‌లో సునేత్రా పవార్.
- మహారాష్ట్రలోని రాహురి స్థానంలో బీజేపీ ఆధిక్యం.
- త్రిపురలోని ధర్మానగర్‌లో బీజేపీ ఆధిక్యం.
- నాగాలాండ్‌లోని కోరిదంగ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.
నిరాశలో డీఎంకే శ్రేణులు..
- బోడినాయకనూర్‌లో పన్నీర్ సెల్వం లీడ్.
- ఎడప్పాడిలో ఆధిక్యంలో పళనిస్వామి
- కేరళలో దూసుకుపోతున్న యూడీఎఫ్.
- తమిళనాడులో మూడో స్థానంలోని డీఎంకే.
- సంబరాల టెంట్లు తీసేసిన డీఎంకే.
- తమిళనాడులో వంద స్థానాల్లో టీవీకే ముందంజ.
- డీఎంకే కూటమిలో ఐదు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం.
- రెండో స్థానంలో అన్నాడీఎంకే.
- తిరుచ్చి ఈస్ట్‌లో విజయ్ 1649 ఓట్ల ఆధిక్యం.
ఆసక్తికరంగా ఎన్నికల ఫలితాలు..
- తట్టంచావడి, మంగళంలో రంగస్వామి ముందంజ
- తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో విజయ్ ముందంజ.
- అసోంలో జోర్హాట్‌లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గోగొయ్ వెనుకంజ.
- బెంగాల్‌లో ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం.
- రెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీ.
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ వెనుకంజ.
- నందిగ్రాంలో బీజేపీ నేతల సువేందు అధికారి లీడ్.
- కేరళ ధర్మదంలో సీఎం విజయన్ ముందంజ.
- పనిహట్టిలో ఆర్జీకర్ జూనియర్ తల్లి రత్న దేబ్‌నాథ్(బీజేపీ) ముందంజ.
డీఎంకే దూకుడుకి బ్రేక్.. దూసుకెళ్తున్న టీవీకే
- తమిళనాడు ఫలితాలపై సర్వతా ఉత్కంఠ
- డీఎంకే దూకుడుకు బ్రేక్ వేస్తూ.. దూసుకెళ్తున్న టీవీకే
- అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చిన టీవీకే
- ఎర్లీ ట్రెండ్స్‌లో.. డీఎంకేను దాటి దూసుపోతున్న టీవీకే
- తమిళనాడులో టీవీకే ముందంజ
- రెండో స్థానంలో డీఎంకే
- మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే
- చెన్నై మినహా దాదాపు అన్ని చోట్ల టీవీకే ఆధిక్యం
- 90-100 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే
- తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో టీవీకే అధినేత విజయ్ ఆధిక్యం
తమిళనాడులో పోటాపోటీ..
- కేరళ నెమంలో రాజీవ్ చంద్రశేఖర్(బీజేపీ) లీడింగ్.
- సీపీఎం రెబల్ సుధాకరన్ అంబళపుళలో లీడింగ్.
- కేరళలో యూడీఎఫ్, అసోంలో బీజేపీ లీడ్.
- అసోంలో అడుగంటుతున్న కాంగ్రెస్ లీడింగ్స్.
- తమిళనాడులో సీఎం స్టాలిన్, ఉదయనిధి వెనుకంజ.
- పాలక్కాడ్‌లో బీజేపీ ముందంజ.
- భవానీపూర్‌లో మమత ముందంజ.
- అసోం జలూక్‌బరిలో సీఎం హిమంత లీడింగ్.
రన్నరప్‌గానే అన్నాడీఎంకే..
- బెంగాల్ బహరంపూర్‌లో అధీర్ రంజన్ చౌదరి(కాంగ్రెస్) వెనుకంజ.
- తమిళనాడులో పలు స్థానాల్లో రన్నరప్‌గానే అన్నాడీఎంకే.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపుగా డీఎంకేవైపు.
- ఇవి జనతా Vs మమత పోటీ ఎన్నికలు: బీజేపీ
- బెంగాల్‌లో ఐదు చోట్ల కాంగ్రెస్ లీడ్.
డీఎంకే దూకుడు..
- ఎన్నికల ఫలితాల్లో డీఎంకే దూకుడు.
- తిరుచ్చి వెస్ట్‌లో మంత్రి నెహ్రు వెనుకంజ.
- కొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందంజ.
- ఎడప్పాడిలో పళనిస్వామి లీడింగ్.
- చెన్నై సిటీలో డీఎంకే, టీవీకే హోరాహోరీ.
- చెపాక్‌లో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యం.
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో డీఎంకే ఆధిక్యం.
- తిరుచ్చి ఈస్, పెరంబూర్‌లో విజయ్ వెనుకంజ
- ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల కోసం టీవీకే, అన్నాడీఎంకే పోటాపోటీ.
మమత వెనుకంజ.. సువేందు లీడ్
- ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం.
- తమిళనాడులో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం.
- బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్.
- భవానీపూర్, నందిగ్రామాలో సువేందు ఆధిక్యం.
- భవానీపూర్‌లో సీఎం మమతపై సువేందు లీడ్.
- తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి వెనుకంజ.
- మైలాపూర్‌లో తమిళిసై వెనుకంజ.
- అసోం పోస్టల్ బ్యాలెట్‌లో భారీ ఆధిక్యంలో బీజేపీ.
బారామతి ఉప ఎన్నిక.. సునేత్రకు పరీక్ష
- బారామతి ఉప ఎన్నిక.. కౌంటింగ్ ప్రారంభం
- నేడు బారామతి ఉప ఎన్నిక ఫలితాలు.
- ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం.
- పోటీలో డిప్యూటీ సీఎం సునేత్రా పవార్
- అజిత్ పవార్ అకాల మరణంతో బారామతి ఉప ఎన్నిక
#WATCH | Baramati Assembly bypoll 2026 | Baramati, Maharashtra: Visuals outside the MIDC Warehouse Corporation in Baramati, where the counting of votes is underway. pic.twitter.com/xZklcOWbb8
— ANI (@ANI) May 4, 2026
సీఎం మమతకు లీడ్...
- కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు.
- కాసేపట్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం.
- భవానీపూర్‌లో సీఎం మమత ముందంజ.
- పెరంబూర్‌లో విజయ్ ముందుంజ, తిరుచ్చి ఈస్ట్‌లో వెనుకంజ.
- బెంగాల్‌లో బీజేపీ ముఖ్య నేతలు ముందంజ.
- పుదుచ్చేరి పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీయే ఆధిక్యం.
విజయ్‌కి లీడ్..
- తమిళనాడులో విజయ్ ముందంజ..
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లలో డీఎంకే ముందంజ.
- పెరంబూర్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో విజయ్ ముందంజ
బీజేపీ ముందంజ..
- అసోంలో పోస్టల్ బ్యాలెట్‌లొ బీజేపీ ముందంజ.
- కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీ.
- బెంగాల్ పోస్టల్ బ్యాలెట్లలో టీఎంసీ, బీజేపీ టఫ్ ఫైట్
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లలో డీఎంకే ముందంజ.
- అసోంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం..
- అసోంలో ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది.
- 126 స్థానాల్లో ఎన్నికలు.
#WATCH | Assam Assembly Elections 2026 | Guwahati, Assam: Visuals from Maniram Dewan Trade Centre in Guwahati, where the counting of votes for 126 Assembly constituencies has begun.
Counting of votes for 126 Assembly constituencies will begin from 8 am. pic.twitter.com/Kgk4JpH0mx— ANI (@ANI) May 4, 2026
- ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం.
- ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..
- మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
- కౌంటింగ్ హాల్‌లోకి ఫోన్లు నిషేధం.
Counting of votes for the elections to the Assemblies of Assam, Keralam, Tamil Nadu, West Bengal and Puducherry begins. Counting of votes for by-polls in seven Assembly constituencies of five States also being done today.
In West Bengal, counting being done on 293 of the total… pic.twitter.com/DMaW2aDjnT— ANI (@ANI) May 4, 2026
పవర్ కట్, సీసీ కెమెరాలు ఆఫ్.. బీజేపీపై మమత ఆరోపణలు..
- సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు
- అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకున్నాయి, సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయని ఫైర్.
- బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఆమె ఎక్స్‌లో పోస్టు
- హుగ్లీలోని సెరంపుర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరమ్ వంటి ప్రాంతాల్లో దశల వారీగా విద్యుత్ కోతలు
- సీసీటీవీలను కూడా ఆఫ్ చేశారని, స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలోకి వాహనాల రాకపోకలు సాగుతున్నాయని ఆరోపణలు.
- ఈ చర్యలన్నీ బీజేపీ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆగ్రహం.
- టీఎంసీ పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు
- స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా కాయాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే.. వెంటనే ఫిర్యాదులు చేయాలని వెల్లడి.
সতর্ক থাকুন। পাহারা দিন। রাত জাগুন। অভিযোগ করুন।
বিভিন্ন জায়গা থেকে খবর পাচ্ছি, পরিকল্পিতভাবে লোডশেডিং করে দেওয়া হচ্ছে। হুগলির শ্রীরামপুর, নদীয়ার কৃষ্ণনগর থেকে বর্ধমানের আউশগ্রাম, কলকাতার ক্ষুদিরাম অনুশীলন কেন্দ্রে এরকম ঘটনা সামনে এসেছে যেখানে দফায় দফায় লোডশেডিং করা হচ্ছে,…— Mamata Banerjee (@MamataOfficial) May 3, 2026
అన్నాడీఎంకే ఆఫీసు వద్ద సందడి..
- అన్నాడీఎంకే ఆఫీసు వద్ద సందడి..
- తమిళనాడులో కౌంటింగ్ సందర్బంగా అన్నాడీఎంకే ఆఫీసు వద్ద సందడి.
- అభ్యర్థుల ప్రత్యేక పూజలు..
- మరోవైపు.. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు.
#WATCH | Tamil Nadu Assembly Elections | Visuals from the AIADMK Office in Chennai.
Counting of votes for all 234 Assembly constituencies of the state will begin at 8 AM today. pic.twitter.com/u7gMFLhLSU— ANI (@ANI) May 4, 2026
బెంగాల్‌లో కలకలం..
- బెంగాల్‌లో కలకలం..
- రోడ్డు పక్కన చెత్తలో వీవీప్యాట్ స్లిప్పులు
- ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్‌గ్రామ్ అసెంబ్లీ పరిధిలోని సుభాశ్ నగర్ రోడ్డు పక్కన పెద్ద ఎత్తున వీవీప్యాట్ స్లిప్పులు
- ఈ స్లిప్పులు నోవాపారా నియోజకవర్గం బూత్ నంబర్ 29కి చెందినవిగా తెలుస్తోంది.
- దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- విచారణకు కలెక్టర్ ఆదేశం
- నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న సీపీఐ అభ్యర్థి గార్గి ఛటర్జీ, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్లిప్పులు స్వాధీనం
- ఈ సంఘటనపై ఉత్తర 24 పరగణాల జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు.
- బయటకు వచ్చి వీవీప్యాట్ స్లిప్పులు మాక్‌పోల్‌కు సంబంధించినవి అని చెప్పారు.
- ఈ స్లిప్పులు అసలు పోలింగ్‌కు చెందినవి కాదని అన్నారు.
#WATCH | North 24 Parganas | West Bengal Assembly Elections 2026 | VVPAT slips allegedly from booth number 29 of Noapara Assembly were found discarded in Subhashnagar of Ichapur Nilganj Panchayat of Madhyamgram Assembly, a day before the vote counting was scheduled in the… pic.twitter.com/BRWS3aRMdT
— ANI (@ANI) May 3, 2026
అసోం బీజేపీదేనా?
- అసోంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 126,
- మ్యాజిక్ ఫిగర్ 64
- అసోంలో విజయం బీజేదే అంటూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు.
- జాలుక్‌బారీ నుంచి బరిలో నిలిచిన సీఎం హిమంత.
విజయన్ సంచలన నిర్ణయం..
- కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140
- మ్యాజిక్ ఫిగర్ 71
- కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి రావొచ్చని ఎగ్జిట్‌పోల్స్.
- ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం విజయన్
- సోషల్ మీడియాలో కేరళ సీఎం విజయన్ ప్రొఫైల్ మార్పు
- సీఎం స్థానంలో సీపీఎం పొలిట్‌బ్యూట్ సభ్యుడిగా మార్పు.
బెంగాల్‌లో దంగల్ ఇలా..
- బెంగాల్‌లో మొత్తం సీట్లు 294, మ్యాజిక్ ఫిగర్ 148
- బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి
- భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి.
- కౌంటింగ్ సందర్భంగా 75వేల మంది కేంద్ర బలగాలతో భద్రత.
- బెంగాల్‌లోని ఫాల్తా స్థానానికి ఈనెల 21న రీపోలింగ్.
- ఈనెల 24న ఓట్లు లెక్కింపు.
#WATCH | Counting of votes for all 140 Assembly constituencies in Keralam to begin at 8 am today.
Latest visuals from the BJP office in Thiruvananthapuram. pic.twitter.com/ktgw1KJMpF— ANI (@ANI) May 4, 2026
టీవీకే క్యాంపు రాజకీయం..
- తమిళనాడులో టీవీకే క్యాంపు రాజకీయాలు..
- మహాబలిపురం దగ్గర రిసార్టులు బుక్ చేసిన టీవీకే
- గెలిచిన టీవీకే అభ్యర్థులను రిసార్టులకు రావాలన్న విజయ్.
- 234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు
- 5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా..
- తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్ నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
- మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులు
- మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ
- డీఎంకే, అన్నాడీఎంకే కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీ
- కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారా
- రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బంది
- ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్
- కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి,
- చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీ
- పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్
- కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం
- అక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటు
- ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు
#WATCH | Tamil Nadu Elections 2026 | Visuals from the counting centre set up at Loyola College, where votes for several key Assembly constituencies will be counted today.
According to officials, counting at Loyola College covers the following constituencies:
Thousand Lights… pic.twitter.com/ZszSZtY6E8— ANI (@ANI) May 4, 2026
కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటలకు ట్రెండ్స్..
- ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్.
- మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు.
- కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు.
- కేంద్ర బలగాలతో కట్టుదిట్టుమైన నిఘా.
- కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటలకు ట్రెండ్స్.
#WATCH | West Bengal Assembly Elections | Heavy security deployed outside the Chief Electoral Officer's office in Kolkata.
Counting of votes for 293 Assembly constituencies of the state will begin at 8 AM today. pic.twitter.com/KAYqaP1LPK— ANI (@ANI) May 4, 2026
కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాటు..
- కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాటు..
- పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడే కౌంటింగ్
- ఏర్పాట్లు పూర్తిచేసిన ఎన్నికల సంఘం
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత
- కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా క్యూఆర్ కోడ్ ఐడీ కార్డులు
- అనధికార వ్యక్తులను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు
- తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంల లెక్కింపు
- ఫలితాల సరళిపై మధ్యాహ్నం కల్లా స్పష్టత వచ్చే అవకాశం
- ఉప ఎన్నికలు జరిగిన ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ నేడు ఓట్ల లెక్కింపు


