ఎన్నికల సిబ్బంది కారులో బాంబులు! | four bombs seized from car, that was meant to shift polling staff | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిబ్బంది కారులో బాంబులు!

Apr 16 2016 3:21 PM | Updated on Sep 3 2017 10:04 PM

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల హింస దారుణంగా ఉంది. ఎన్నికల అధికారులను తీసుకెళ్లాల్సిన కారులో నాలుగు బాంబులు కనిపించాయి.

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల హింస దారుణంగా ఉంది. ఎన్నికల అధికారులను తీసుకెళ్లాల్సిన కారులో నాలుగు బాంబులు కనిపించాయి. డ్రైవర్ కారును స్టార్ట్ చేయబోతుండగా.. ఈ బాంబులను గుర్తించారు. ఆదివారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు డీసీఆర్‌సీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సెంట్రల్ స్కూలు ఆవరణలో ఈ కారు పార్క్ చేసి ఉంది. తన కారు సీటు కింద పాలిథిన్ బ్యాగులో ఏవో వస్తువులు ఉండటాన్ని డ్రైవర్ చూశాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేయడంతో అందరూ అక్కడకు చేరుకున్నారు.

బాంబు స్క్వాడ్, పోలీసు సిబ్బంది కూడా వచ్చి పాలిథిన్ బ్యాగును తీశారు. అందులో నాలుగు బాంబులు ఉన్నట్లు ఆ తర్వాత చెప్పారు. ఈ ఘటనతో ఎన్నికల వాహనాలను తీసుకెళ్లడానికి అక్కడున్న డ్రైవర్లు నిరాకరించారు. తమకు తగినంత భద్రత కల్పించాలని లేకపోతే ముందుకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఎన్నికల సిబ్బందిని తరలించడం కూడా కష్టంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement