ఆత్మాహుతి దాడి..10 మంది మృతి | 10 Killed In Attack On Somali Interior Ministry | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి..10 మంది మృతి

Jul 7 2018 8:08 PM | Updated on Nov 6 2018 8:16 PM

10 Killed In Attack On Somali Interior Ministry  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మొగదిషు(సోమాలియా):  సోమాలియా రాజధాని నగరం మొగదిషులో శనివారం బాంబుల మోత మోగింది. రెండు కార్లతో ఆత్మాహుతి దళ సభ్యులు దాడికి దిగారు. సోమాలియా అంతర్గత మంత్రిత్వ శాఖ  భవనంపై ఆత్మాహుతి దాడికి దిగడంతో 10 మంది చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక సమాచార శాఖా మంత్రి దహిర్‌ మహ్మద్‌ గల్లె తెలిపారు. ఈ ఘటనను ఆఫ్రికన్‌ యూనియన్‌ మిషన్‌ తీవ్రంగా ఖండించింది. చనిపోయిన వారిలో సైనికులు, జర్నలిస్టులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారని మీడియా పేర్కొంది. అల్‌ షాబాద్‌ అనే మిలిటెంట్‌ గ్రూప్‌ ఈ ఆత్మాహుతి దాడికి  పాల్పడినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement