పెళ్లి కావటం లేదని.. హుసేన్‌సాగర్‌లో దూకిన యువతి.. | Woman Ends Life In Hussain Sagar | Sakshi
Sakshi News home page

పెళ్లి కావటం లేదని.. హుసేన్‌సాగర్‌లో దూకిన యువతి..

Feb 3 2026 7:21 AM | Updated on Feb 3 2026 7:25 AM

Woman Ends Life In Hussain Sagar

హైదరాబాద్: పెళ్లికాలేదనే మనస్థాపంతో ఓ యువతి హుస్సేన్‌ సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్‌ భైంసాకు  చెందిన టి. విజయలక్ష్మి (26) తల్లి సరస్వతీతో కలిసి కూకట్‌పల్లిలోని మైత్రీనగర్‌లో నివాసం ఉంటోంది. తల్లికి మనస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కూతురు విజయలక్ష్మీ చూసుకుంటోంది. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వివాహం అనంతరం తల్లి కూడా తనతో పాటే ఉంటుందని చెబుతుండటంతో సంబంధాలు వెనక్కుపోతున్నాయి. 

దీంతో మనస్తాపం చెంది జనవరి 31న ఉదయం ర్యాపిడో బుక్‌ చేసుకుని రెండు రోజుల్లో తిరిగి వస్తానని తల్లికి చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కజిన్‌ బ్రదర్‌ ఆదివారం కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు సాయంత్రం హుస్సేన్‌ సాగర్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం తేలి ఉందని సమాచారం రావడంతో లేక్‌ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుప్రతికి తరలించి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ ఉండటంతో విజయలక్ష్మిగా గుర్తించడంతో లేక్‌ పోలీసులు కేసులు కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement