Live Updates
తమిళనాడులో భారీగా ఎన్నికల పోలింగ్
తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్
- తమిళనాడులో ఆరు గంటల వరకు 84.29 శాతం పోలింగ్
- పోలింగ్ వివరాలు ప్రకటించిన ఎన్నికల శాఖ అధికారులు
తమిళనాడు చరిత్రలో రికార్డు సృష్టించిన ఓటర్లు
- తమిళనాడు చరిత్రలో రికార్డు సృష్టించిన ఓటర్లు
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్ (తొలి విడత)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది.
- సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 82.24 శాతం పోలింగ్ నమోదు
- పశ్చిమ బెంగాల్‌లో 89.93 శాతం పోలింగ్
- తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత కింద 152 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్
- మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
- 2021 - 73.63 శాతం పోలింగ్
- 2016 - 74.81 శాతం పోలింగ్
- 2011 - 78.01 శాతం పోలింగ్
- 2006 - 70.82 శాతం పోలింగ్
- 2001 - 59.07 శాతం పోలింగ్
- 1996 - 66.95 శాతం పోలింగ్
- 1991 - 63.84 శాతం పోలింగ్
- 1989 - 69.69 శాతం పోలింగ్
- 1984 - 73.47 శాతం పోలింగ్
- 1980 - 65.42 శాతం పోలింగ్
- 1977 - 61.58 శాతం పోలింగ్
- 1971 - 72.10 శాతం పోలింగ్ శాతం నమోదైంది
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో భారీగా ఎన్నికల పోలింగ్
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో భారీగా ఎన్నికల పోలింగ్
- తమిళనాడులో సాయంత్రం 5గంటల వరకు 82శాతం పోలింగ్
- పశ్చిమ బెంగాల్‌లో సాయంత్రం 5గంటల వరకు 90శాతం పోలింగ్
తమిళనాడులో 70శాతం పోలింగ్
- తమిళనాడులో మధ్యాహ్నం 3గంటల వరకూ 70 శాతం పోలింగ్
- పోలింగ్ వివరాలు ప్రకటించిన ఎన్నికల శాఖ అధికారులు
1గం. కల్లా 56.81 శాతం
- తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్
- మధ్యాహ్నాం 1గం. కల్లా 56.81 శాతం పోలింగ్ నమోదు
- పోలింగ్ సెంటర్ల వద్ద పల్చగా ఓటర్లు
- సాయంత్రం ఓటింగ్ శాతం పెరిగే చాన్స్
- సాయంత్రం 6గం. వరకే ఓటింగ్
బీజేపీని అడుగు పెట్టనివ్వం: ఉదయనిధి స్టాలిన్
- తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది
- ఈ ఎన్నికల్లో విజయం మాదే
- బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం
- డీఎంకే ఈ ఎన్నికల్లో చర్రిత తిరగరాస్తుంది
విజయ్‌పై కనిమొళి ఆగ్రహం
- ఈసీకి విజయ్ లేఖపై స్పందించిన కనిమొళి
- ఓటర్లు పోలింగ్ బూత్‌లకు సమయానికి చేరుకోలేకపోతున్నారన్న విజయ్
- ప్రభుత్వ కుట్ర ఉందని లేఖలో ఆరోపించిన విజయ్
- చెన్నైలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న విజయ్
- విజయ్ వ్యాఖ్యలపై కనిమొళి ఆగ్రహం
- విజయ్ వ్యాఖ్యల్లో నిజం లేదన్న కనిమొళి
పోలింగ్ కేంద్రాల వద్ద..
- తమిళనాడులో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- ఉదయం 11గం. దాకా 37.58 శాతం పోలింగ్
- ఓటింగ్‌పై ఎండ ప్రభావం
- పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్‌కు ఓటర్ల తగ్గుముఖం
- ఓటర్లకు చుక్కలు చూపిస్తున్న బస్సుల కొరత
- బస్టాండ్‌లలో ఓటర్ల పడిగాపులు
- మధ్యాహ్నాం తర్వాత ఓటింగ్ శాతం మళ్లీ పుంజుకునే అవకాశం
ఓటేసిన మాజీ సీఎం ఓపీఎస్
- ఓటేసిన మాజీ సీఎం
- బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పన్నీర్‌సెల్వం
- ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోంది
- డీఎంకే అధినేత స్టాలిన్ మరోసారి అధికారంలోకి రాబోతున్నారు
- డీఎంకే కూటమి 200కి పైగా స్థానాలు గెలుస్తుందనే నమ్మకం ఉంది
పోలింగ్ సమయం పెంచండి: విజయ్
- ఈసీకి టీవీకే అధినేత విజయ్ లేఖ
- పోలింగ్ టైం 2 గంటలు పెంచాలని రిక్వెస్ట్
- ఎన్నికల వేళ తమిళనాడులో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం
- బస్సులు దొరక్క ఓటర్ల పడిగాపులు
- ఓటు వేయకుండా అడ్డుకునే కుట్ర జరుగుతోందని విజయ్ ఆరోపణ
- అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఈసీని కోరిన విజయ్
- సాయంత్రం 6గం.తో ముగియనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
కొనసాగుతున్న పోలింగ్
- తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్
- రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న పోలింగ్ శాతం
- పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- 9గం. వరకు 17.69 శాతం పోలింగ్
- పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు స్వాగతం పలుకుతున్న రోబోలు
- రూరల్ ప్రాంతాల్లో బస్సులు లేక ఓటర్ల అవస్థలు
- కోయంబత్తూర్‌లో రోడ్లపై బైఠాయించి నిరసన
పొద్దుపొద్దునే ఓటేసిన ప్రముఖులు
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్
- పొద్దుపొద్దున్నే క్యూ కట్టిన ఓటర్లు
- పోటాపోటీగా ప్రముఖుల సందడి
- ఓటేసిన రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు
- కుటుంబంతో కలిసి కొలతూరులో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం ఎంకే స్టాలిన్
- ఎడప్పాడి నియోజకవర్గంలోని సిలువంపాలయం ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్‌లో ఓటేసిన అన్నాడీఎంకే చీఫ్, ప్రతిపక్ష నేత పళనిస్వామి
- చెన్నైలో ఓటేసిన నటుడు, టీవీకే అధినేత విజయ్
- ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం
- స్టెల్లా మేరీస్ కాలేజీలో భార్య లత, కూతురు సౌందర్యతో కలిసి వచ్చి ఓటేసిన రజినీకాంత్
- కూతురు శ్రుతి హాసన్‌తో ఓటేసిన నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్
- ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో అజిత్
- ఓటేసిన కుష్బు సుందర్, శివకార్తీకేయన్ తదితరులు..
ఓటేసిన విజయ్
- ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్
- చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్
- భారీ జనసందోహం నడుమ పోలింగ్ స్టేషన్‌కు చేరుకున్న విజయ్
- ఓటేశాక.. ప్రజలకు అభివాదం
- గతంలో సైకిల్ మీద వచ్చి ఓటేసిన నటుడు విజయ్
- ఈసారి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్
- తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్.. రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్
- విజయంపై విజయ్ ధీమా
- మొత్తం 234 నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ
#WATCH | Tamil Nadu Elections 2026 | Vijay, TVK chief and candidate from Tiruchirappalli East and Perambur constituencies, at a polling station in Chennai after casting his vote. pic.twitter.com/yCXPjQyJEh
— ANI (@ANI) April 23, 2026
హాట్ సీట్స్ ఇవే..
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్
- హాట్ సీట్లపైనే అందరి దృష్టి
ఎడప్పాడి (సేలం జిల్లా)
- ADMK ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) బలమైన స్థావరం.
- 2011 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపు.
- గౌండర్ కమ్యూనిటీ మద్దతుతో.. డీఎంకే, మాజీ సహచరుల సవాళ్లను ఎదుర్కొంటున్న పళనిస్వామి
- గత విజేతలు: 2011, 2016, 2021 అన్నాడీఎంకే పళనినే
లాల్గుడి
- లాటరీ వ్యాపారవేత్త సాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్,
- రూ.1000 కోట్లకుపైగా ఆస్తులు ప్రకటించిన ధనిక అభ్యర్థిగా లీమా
- ఫిబ్రవరిలో అన్నాడీఎంకేలో చేరిన లీమా
- డీఎంకే కంచుకోటగా లాల్గుడి
- 1971 నుంచి ఎనిమిది సార్లు గెలిచిన డీఎంకే అభ్యర్థి
కొలత్తూర్ (చెన్నై)
- 2011లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న MK స్టాలిన్
- 2021లో 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపు
మదురై సెంట్రల్
- హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన IT మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) హ్యాట్రిక్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- అన్నాడీఎంకే మిత్రపక్షం పుతియా నీది కట్చి(PNK) అభ్యర్థిగా ప్రముఖ దర్శక నటుడు సుందర్ సీ పోటీ
- టీవీకే పోటీతో మైనారిటీ ఓట్లు చీలిపోయే అవకాశం
- గత విజేతలు: 2011 (DMDK); 2016, 2021 (DMK).
పేరంబూర్ (ఉత్తర చెన్నై)
- అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్న స్థానం.
- ఒకప్పుడు వామపక్ష పార్టీలకు అడ్డా.. కార్మిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతం
- 2021లో DMK అభ్యర్థి 54,000 ఓట్ల మెజారిటీతో గెలుపు
- టీవీపీ యాప్ ద్వారా 40,000 మంది మద్దతు తెలిపినందున ఈ స్థానం ఎంచుకున్న విజయ్
- గత విజేతలు: 2011 (CPM); 2016 (ADMK); 2021 (DMK).
చెపాక్-తిరువల్లికేని (చెన్నై)
- 2011 నుంచి డీఎంకే ఆధీనంలో ఉన్న స్థానం.
- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 2021లో 69,000 ఓట్ల మెజారిటీతో గెలుపు
- ముస్లిం ఓటర్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం
- గత విజేతలు: 2011, 2016, 2021 (DMK)
- ఓటు హక్కు వినియోగించుకున్న నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్
- మైలాపూర్‌లో ఓటేసిన కుష్బూ
- ఓటేశాక.. వేలిని మీడియాకు ప్రదర్శించిన కుష్బూ
- మైలాపూర్‌లో బీజేపీ అభ్యర్థిగా మాజీ గవర్నర్ తమిళిసై
ఓటేసిన అజిత్.. ఫ్యాన్స్ వీరంగం
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
- తిరువాన్మియూర్‌లోని ఓటేసిన స్టార్ నటుడు అజిత్ కుమార్
- అజిత్ రాకతో పోలింగ్ కేంద్రం బయట భారీగా గుమిగూడిన అభిమానులు, ప్రజలు
- అజిత్‌ను చూడటానికి.. సెల్ఫీలు దిగడానికి ఎగబడడంతో గందరగోళం
- వద్దని వారించిన అజిత్
- అయినా అరుపులు, కేకలు
- సీరియస్‌గా తన ఫోన్‌తో కేకలు వేస్తున్న ఫ్యాన్స్‌ను వీడియో తీసిన అజిత్
- తోపులాట జరగడంతో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
- పరిస్థితి అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
- అదనపు బలగాల మోహరింపుతో అదుపులోకి పరిస్థితి
Tamil Nadu Assembly Election 2026 | முதலாவதாக வாக்களிக்க வந்த நடிகர் அஜித் | N18S#Election2026 #ElectionsWithNews18 #TNElection2026 #TamilNaduElection2026 #TNPolls#News18TamilNadu #TamilNews
For More Updates Watch LIVE : https://t.co/wei01m6qgT pic.twitter.com/HnSBQV9Pyh— News18 Tamil Nadu (@News18TamilNadu) April 23, 2026
నా భర్య ఘన విజయం సాధిస్తుంది: సౌందరరాజన్
- తమిళనాట కొనసాగుతున్న పోలింగ్
- మైళపోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలో మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- బీజేపీ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి నుంచి పోటీ
- భార్య పోటీపై స్పందించిన భర్త పి సౌందరరాజన్
- నేను మొత్తం నియోజకవర్గాన్ని తిరిగా
- ఎన్డీయే.. ముఖ్యంగా నా భార్య ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది
- గెలిచాక నియోజకవర్గంలో ఇప్పటిదాకా పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తుంది
#WATCH | Tamil Nadu Elections 2026 | Chennai: Husband of BJP candidate from Mylapore assembly constituency, Tamilisai Soundararajan, P Soundararajan says, "I have gone around the entire constituency. It is going to be a huge success for NDA, especially for my wife in… pic.twitter.com/0EVh6ssFWe
— ANI (@ANI) April 23, 2026
తమిళనాడు ఓటర్లకు మోదీ పిలుపు
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్
- తమిళనాడు ఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
- ప్రజాస్వామ్యపు పవిత్ర కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించండి
- ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలి
- రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడానికి మార్గం సుగమం చేయాలని నేను తమిళనాడు ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నా
தமிழ்நாட்டு மக்கள் சட்டமன்றத் தேர்தலில் வாக்களிக்க உள்ள வேளையில், அனைத்து வாக்காளர்களும் மிகுந்த உற்சாகத்துடன் இந்த புனிதமான ஜனநாயகக் கடமையை நிறைவேற்ற வேண்டுமெனக் கேட்டுக்கொள்கிறேன். குறிப்பாக, தமிழ்நாட்டின் இளைஞர்களும், பெண்களும் பெருமளவில் திரண்டு வந்து, சாதனை அளவிலான வாக்குகள்…
— Narendra Modi (@narendramodi) April 23, 2026
ఉదయాన్నే ఓటేసిన ప్రముఖులు
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మొదలైన పోలింగ్
- ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
- ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం
- నీలంకరైలో ఓటేసిన ఎన్‌టీకే చీఫ్ సెంథమిలన్ సీమన్
- చెన్నైలోని ఓ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన నటుడు గౌతమ్ కార్తీక్
#WATCH | Tamil Nadu Elections 2026 | Senior Congress leader P Chidambaram casts his vote and shows his inked finger, at a polling station in Karaikudi, Sivaganga. pic.twitter.com/5rRqLmFtCk
— ANI (@ANI) April 23, 2026
ఓటర్ మహాశయులకు విజ్ఞప్తులు
- తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు
- పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- సరైన పార్టీకి ఓటేయాలంటూ రాహుల్ గాంధీ, స్టాలిన్ తదితరుల విజ్ఞప్తి
- డీఎంకే, అన్నాడీఎంకే కూటములు, టీవీకే పార్టీ మధ్య త్రిముఖ పోటీ
- పోలింగ్ కోసం 75 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- ఎన్నికల విధుల్లో 3.60 లక్షల మంది సిబ్బంది
- భద్రత కోసం 83 వేల మంది పోలీసులు, 300 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు
- రాష్ట్ర వ్యాప్తంగా 5.73 కోట్ల ఓటర్లు
- ఇప్పటిదాకా 4.18 లక్షల పోస్టల్ ఓట్లు నమోదు
- ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం చర్యలు
తమిళనాట పోలింగ్ ప్రారంభం
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- ఒకే విడతలో 234 స్థానాలకు జరగనున్న పోలింగ్
- ఓటర్లకు ఇస్తున్న స్లిప్పులపై క్యూఆర్ కోడ్‌లు!
ఓటు హక్కు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- ఓటు హక్కు విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- జైల్లో ఉన్న వ్యక్తి ఓటు హక్కు కోసం కోర్టును ఆశ్రయించిన వైనం
- తాను ఓటేస్తానని.. ఎన్నికల సంఘం అందుకు అంగీకరించాలని.. ఆ దిశగా ఈసీని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్
- పుజల్ సెంట్రల్ జైలు నుంచి పిటిషన్ వేసిన హరి నాదర్
- ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 62(5) ప్రకారం కుదరదన్న కోర్టు
- జైలులో ఉన్నవాళ్లు లేదంటే పోలీస్ కస్టడీలో ఉన్నవారు ఓటు వేయలేరని స్పష్టీకరణ
- ప్రివెంటివ్ డిటెన్షన్ (నిరోధక నిర్బంధం)లో ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని వెల్లడి
- అయితే హరి నాదర్‌పై గూండాస్ చట్టం కింద నిర్బంధం ఉన్నప్పటికీ.. ఆయనపై మరో రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యి, రిమాండ్‌లో ఉన్నారని గుర్తించిన కోర్టు
- తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారని, ఇంకా శిక్ష ఖరారు కాలేదని పిటిషనర్ వాదించారు
- తనకు ఓటు హక్కు (Article 326) ఉల్లంఘన అవుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నాదర్
- జైలు అధికారులు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్‌కి పంపలేదని.. అందువల్ల తన అభ్యర్థిత్వం తిరస్కరించబడిందని వాదన
- హరి నాదర్ కేసు ప్రివెంటివ్ డిటెన్షన్ మినహాయింపులోకి రాదని స్పష్టం చేసింది.
- ఆయనపై ఉన్న ఇతర క్రిమినల్ కేసుల కారణంగా ఓటు హక్కు ఇవ్వలేమని పేర్కొంది
- బుధవారం పిటిషన్‌ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
ఏ పార్టీకి ఎన్ని..? ఎవరెవరు ఎక్కడంటే..??
- డీఎంకే 164 స్థానాల్లో పోటీ
- కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ
- మిత్రపక్షాలకు 170 స్థానాలు కేటాయించిన డీఎంకే
- కొలతూర్ నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ
- చెపాక్, తిరువేల్లికని నుంచి స్టాలిన్ తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీ
- అన్నాడీఎంకే 169, 27 స్థానాల్లో బీజేపీ
- మిత్రపక్షాలకు 65 సీట్లు కేటయించిన ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే
- ఎడప్పడి నుంచి అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి పోటీ
- మైలపోరి నుంచి బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై పోటీ
- అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రనటుడు విజయ్ పార్టీ టీవీకే డెబ్యూ
- 234 స్థానాల్లోనూ టీవీకే పోటీ
- పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ
కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్
- కాసేపట్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్
- 234 నియోజకవర్గాల్లో పోలింగ్, పోటీలో 4,023 మంది
- 85,875 మంది పోలీసులతో భద్రత
- తమిళనాడులో ఓటు వేయనున్న 5.73 కోట్ల మంది
- 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ముగిసిన మాక్ పోలింగ్
- తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
- ముగిసిన మాక్ పోలింగ్
- ఈవీఎంలతో సిద్ధంగా ఉన్న ఎన్నికల సిబ్బంది
- తమిళనాట భారీగా పోలీసుల మోహరింపు
- పోలింగ్ బూత్‌ల పరిధిలో కఠిన ఆంక్షలు


