'త‌మిళ‌నాడు సీఎం అవుతా.. విజ‌య్ ఆత్మ‌విశ్వాసం' | Vijay confidence has been fantastic says TVK chief father | Sakshi
Sakshi News home page

అదే అత‌డి ధైర్యం: విజ‌య్ తండ్రి

May 4 2026 2:17 PM | Updated on May 4 2026 4:17 PM

Vijay confidence has been fantastic says TVK chief father

చెన్నై: తమిళనాడు శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో హీరో విజ‌య్ పార్టీ త‌మిళగ‌ వెట్రి క‌ళ‌గం(టీవీకే) సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా దూసుకెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ప్రస్తుతం 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేప‌థ్యంలో టీవీకే పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, విజ‌య్ అభిమానుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు సంబ‌రాల్లో మునిగిపోయారు. త‌న కుమారుడు విజ‌యంపై విజ‌య్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. చాలా గ‌ర్వంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. గ‌త రెండేళ్లుగా త‌న కుమారుడిలో ఆత్మ‌విశాసం రెట్టింపు అయింద‌ని వెల్ల‌డించారు. తాను క‌చ్చితంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అవుతాన‌ని విజ‌య్ బ‌లంగా న‌మ్మాడ‌ని చెప్పారు. అత‌డు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

"ఒక తండ్రిగా నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాను. నా కుమారుడికి శుభాకాంక్షలు. గత రెండేళ్లుగా అతడి ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా వస్తానన్న విజ‌య్‌ నమ్మకాన్ని నేను అభినందిస్తున్నాను. ఒక నాయకుడిగా, ఎలాంటి పొత్తు లేకుండా సొంత కాళ్లపై నిలబడతానన్నది అతడి ధైర్యం. విజయ్‌కి ఇది ఒక చారిత్రాత్మక విజయం అని నేను భావిస్తున్నాను" అని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు.

చ‌ద‌వండి: 'త‌మిళ సీఎం ప్ర‌మాణ‌స్వీకారానికి ప్ర‌ధాని మోదీ'

త‌మ‌ కుమారుడి విజ‌యం ప‌ట్ల త‌న భార్య శోభ కూడా సంతోషంగా ఉంద‌ని చంద్రశేఖర్ చెప్పారు. "ఆమె కేవలం అతడి తల్లి మాత్రమే కాదు. ఆమె విజయ్‌కి మొదటి అభిమాని. ఆమె చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement