బెంగాల్‌ ప్రజలకు విముక్తి.. విజయోత్సవ సభలో మోదీ | Bengal election victory is historic: Modi | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ప్రజలకు విముక్తి.. విజయోత్సవ సభలో మోదీ

May 4 2026 7:33 PM | Updated on May 4 2026 7:57 PM

Bengal election victory is historic: Modi

ఢిల్లీ: హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పేర్కొన్నారుఢిల్లీలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. భారత్ మదర్‌ ఆఫ్‌ డెమెక్రసీ అని ఈ ఎన్నికలు నిరూపించాయని ఐదురాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్‌ వరకూ కమలం వికసించిందని బెంగాల్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరగడం ఎంతో గొప్ప విషయమన్నారు. 

దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ‍ప్రజలు గుర్తించారన్నారు. ఈ రోజు భారత్‌కు, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు.  పార్టీ విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని తెలిపారు. బెంగాల్‌లో కమలం విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు.  బెంగాల్‌లో ప్రజాసామ్య విజయం సాధించామన్నారు. ఈ రోజు ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజని కొనియాడారు. 

ఐదు రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్‌ కీలక పాత్ర పోషించారని మోదీ తెలిపారు. బెంగాల్‌లో  ‍‍ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా అసంఖ్యాక కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని మోదీ ఉద్ఘాటించారు. వారందరికి మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నానని ప్రధాని అన్నారు.

మరోవైపు మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.  అస్సాం ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏ విజయం, అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి మా కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనమని.. బీజేపీ నేతలు అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి  అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారన్నారు. ఐదురాష్ట్రాలకు జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో  బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement