మరో ట్విస్ట్‌.. టీవీకే పార్టీకి కాంగ్రెస్ కండీషన్‌ | Congress Sets Condition For Tvk Party | Sakshi
Sakshi News home page

మరో ట్విస్ట్‌.. టీవీకే పార్టీకి కాంగ్రెస్ కండీషన్‌

May 8 2026 5:57 PM | Updated on May 8 2026 7:12 PM

Congress Sets Condition For Tvk Party

చెన్నై: టీవీకే పార్టీకి కాంగ్రెస్ షరతు విధించింది. మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్‌ కండీషన్‌ పెట్టింది. మరోవైపు, కేవలం సపోర్ట్‌ మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయించగా.. టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది. మరోవైపు, పెరంబదూర్‌ నుంచి ఎమ్మెల్యే కొనసాగాలని విజయ్ భావిస్తుండగా.. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే షరతు పెట్టింది.

తిరుచ్చి ఈస్ట్‌ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్‌ విధించింది. తిరుచ్చి ఈస్ట్‌ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావళన్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీటు తమకు కేటాయించాలని టీవీకేకు షరతు పెట్టింది. ఇదిలా ఉండగా, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సోమవారం విజయ్‌  ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్‌ ఉంది.

విజయ్‌కు సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ప్రకటించాయి. లెప్ట్‌, వీసీకే మద్దతుతో విజయ్‌కే పూర్తి మెజార్టీ దక్కింది. టీవీకే-107, కాంగ్రెస్‌-5, సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2 మద్దతుతో 118కి సంఖ్యాబలం చేరింది. షరతులు లేకుండా టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖను టీవీకేకు వామపక్షాలు అందచేశాయి.


 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement