tamil nadu elections
-
తొలి సంతకంతోనే విజయ్ సంచలనం..
చెన్నై: తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్.. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మహిళా భద్రతపై విజయ్ రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీటీమ్ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం చేశారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. నేను మీ ఇంట్లో కుటుంబసభ్యుడిని. మీకు అన్నగా తమ్ముడి ఉంటా. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. నాతో ప్రయాణం చేస్తున్న మీకు మంచి చేస్తా. ఇది అస్థిర ప్రభుత్వం కాదు....నా ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది. ఏది సాధ్యమే అది మాత్రమే చేస్తా. విద్యార్థుల భవిష్యత్‌కు విజయ్ మామ అండగా ఉంటాడు. మైనార్టీలకు అండగా ఉంటా ప్రజాధనం వృథా చేయను. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్వరలో శ్వేత పత్రం విడుదలచేస్తా. తమిళ ప్రజలకు రుణపడి ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. -
విజయ్ కేబినెట్ మంత్రులు వీరే
చెన్నై: తమిళనాడు విజయ్ శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌తో పాటు మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ కేబినెట్లో మంత్రులుగా ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్‌రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకటరమణన్, ఆర్ నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన ప్రమాణస్వీకారం చేశారు.తెలుగు అమ్మాయి కీర్తన..శివకాశి నుంచి ఎమ్మెల్యేగా కీర్తన గెలుపొందిన తెలుగు అమ్మాయి కీర్తన మంత్రిగా ప్రమాణం చేశారు. విజయ్ కేబినెట్లో ఏకైక మహిళా ప్రతినిధి కాగా, మహిళా సాధికారత లక్ష్యంగా కీర్తనకు ప్రాధాన్యత ఇచ్చారుఎన్ ఆనంద్..మంత్రిగా ప్రమాణం చేసిన ఎన్ ఆనంద్.. టి.నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈయన విజయ్‌కి అత్యంత నమ్మకస్తుడిగా పేరొంది. విజయ్ పార్టీ నిర్మాణంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు.అదవ్ అర్జున..విల్లివాక్కం నుంచి గెలిచిన అదవ్ అర్జునకు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ విధానాల రూపకల్పనలో అదవ్ అర్జున కీలక పాత్ర పోషించారు కేఏ సెంగొట్టియన్..గోబిచెట్టిపాళయం నుంచి గెలిపిన కేఏ సెంగొట్టియన్.. ఈయన సీనియర్ రాజకీయ వేత్త. అన్నాడీఎంకే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. విజయ్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలవనున్నారు.నిర్మల్ కుమార్..తిరుప్పరంకుండ్రం నుంచి గెలిచిన నిర్మల్ కుమార్.. ఐటీ, సోషల్ మీడియా రంగంలో పట్టున్న నేతగా పేరొంది. గతంలో బీజేపీ ఐటీ వింగ్‌లో నిర్మల్‌కుమార్ కీలక బాధ్యతలు చేపట్టారుకేజీ అరుణరాజ్..తిరుచెంగోడు నుంచి గెలిచిన కేజీ అరుణరాజ్కు షెడ్యూల్ కులాల(ఎస్సీ) ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు లభించింది. సామాజిక న్యాయం దిశగా అరుణ్‌రాజ్ అవకాశం లభించింది.పి.వెంకటరమణన్..మంత్రిగా ప్రమాణం చేసిన పి.వెంకటరమణన్ మైలాపూర్ నుంచి గెలిచారు. చెన్నై నగర రాజకీయాల్లో ఆయన చురుకైన నేతగా గుర్తింపు పొందారుఎ.రాజమోహన్..ఎ.రాజమోహన్ ఎగ్మోర్ నుంచి గెలిచారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజమోహన్ గుర్తింపుపొందారు టీకే ప్రభు..మంత్రిగా ప్రమాణం చేసిన టీకే ప్రభు.. కారైకుడి నుంచి గెలిచారు పార్టీ బలోపేతంలో క్రీయశీలకంగా పనిచేశారు. -
విజయ్ గెలుపు వెనుక అసలు సిక్రెట్ ఏంటి?
సాక్షి, చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తాజాగా తమిళగ వెట్రి కళగం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య శక్తిగా ఎదిగారు. ఈ అసాధారణ ఎదుగుదల వెనుక తెర వెనుక ఉండి చక్రం తిప్పిన వ్యూహకర్త, విజయ్ మేనేజర్ జగదీష్ పళనిస్వామి అన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా సినిమాలో విజయ్ బ్రాండ్ వాల్యూను పెంచడం నుండి, టీవీకే పార్టీ డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు జగదీష్ , ఆయన సంస్థ ది రూట్ పోషించిన పాత్ర ఇప్పుడు ఇతర రాజకీయ పారీ్టల దృష్టిని తమిళనాడులో ఆకర్షిస్తోంది.విజయ్ రాజకీయ రంగప్రవేశం అనేది అనుకోకుండా జరిగింది కాదు. దీని కోసం జగదీష్ బృందం గత ఐదేళ్లుగా ఒక పక్కా ప్రణాళికతో పనిచేసిందన్నది టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ’ది రూట్’ కేవలం సినిమా మేనేజ్మెంట్ సంస్థగా కాకుండా, ఒక భారీ డేటా అనలిటిక్స్ సెంటర్‌గా పనిచేసిందంటున్నారు. ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యువతను ఆకర్షించడానికి జగదీష్ ప్రత్యేక వ్యూహాలు రచించారని చెబుతున్నారు.ఓ సాధారణ యువకుడు విజయ్‌కి సంబంధించిన చిన్న వీడియో చూసినా, మరుసటి నిమిషం నుండి అతని ఫీడ్ అంతా విజయ్ వార్తలతో నిండిపోయేలా అల్గారిథమ్ టెక్నిక్స్‌ను ఉపయోగించారని పేర్కొటున్నారు. సున్నా నుండి లక్షల వరకు ఫాలోవర్లు ఉన్న వేలకొద్దీ షాడో ఐడీల ద్వారా విజయ్ రాజకీయ భావజాలాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు.. ఇది ఒక కృత్రిమ డిజైన్డ్ వేవ్ ను సృషించి, విజయ్ను ఒక తిరుగులేని నాయకుడిగా ప్రొజెక్ట్ చేసిందన్నది జగమెరిగిన సత్యం.మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే వాట్సాప్ గ్రూపులను యాక్టివేట్ చేస్తాయి. కానీ, జగదీష్ బృందం గత ఐదేళ్లుగా ప్రతి నియోజకవర్గంలోని అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ బలమైన వాట్సాప్ నెట్‌వర్క్‌ను నిర్మించి ఉండడం విశేషం. ఏదైనా ఒక వార్త బయటకు వస్తే, అది కేవలం ఐదు నిమిషాల్లో తమిళనాడులోని లక్షలాది మంది యువత మొబైల్లకు చేరుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్ది ఉన్నారు. మొదట్లో సినిమా కంటెంట్‌కు పరిమితమైన ఈ గ్రూపులు, మెల్లమెల్లగా విజయ్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావించేలా మార్చేశాయి.రాజకీయాలంటే ఆసక్తి లేని యువతను సైతం ఆకర్షించేలా విజయ్ వేదికల మీద ఇచ్చే ప్రసంగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సినిమా ఎడిటింగ్ టెక్నిక్స్‌తో, మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రీల్స్‌గా మార్చి వైరల్ చేశారు. ఇది టీవీకే పార్టీని ఒక గ్లామరస్ , స్టైలిష్ పొలిటికల్ ఫోర్స్‌గా మార్చింది. విజయ్‌పై ఏవైనా విమర్శలు వస్తే వాటిని లాజికల్‌గా కాకుండా, భారీ డిజిటల్ అటాక్ ద్వారా అణిచివేసే పద్ధతిని వీరు అనుసరించడం ప్రత్యేకం.ప్రత్యర్థి నటులు లేదా పార్టీల ప్రతిష్టను తగ్గించేలా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేయడంలోనూ ఈ రూట్ టీమ్ సిద్ధహస్తులని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి, ఎంజీఆర్ కాలం నాటి ఇమేజ్ను నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చి, విజయ్ను ఒక సూపర్ పవర్ పొలిటికల్ లీడర్‌గా నిలబెట్టడంలో జగదీష్ పళనిస్వామి ’మాస్టర్ మైండ్’గా నిలిచారన్నది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్.. మళ్లీ వెనుదిరిగారు. కేరళకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. విజయ్‌కు సమయం ఇవ్వలేదు. గవర్నర్‌కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు. విజయ్ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు.టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయన్న సంబరపడిన లోపే గవర్నర్.. విజయ్‌కు మరో షాక్ ఇచ్చారు. ఈ ట్విస్టులు కొనసాగుతుండగా.. గవర్నర్ తన మనసు మార్చకున్నారు. తన కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్‌కు కలిసిన విజయ్.. 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించారు.టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. -
తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. డీఎంకే-అన్నాడీఎంకే ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్ తెరపైకి రాగా.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డీఎంకే ప్రతిపాదను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వీకేసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు వీసీకే మద్దతుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్థానంలో దూరంలో టీవీకే ఉండగా.. వీసీకే మద్దతు కోసం విజయ్ ఎదురుచూస్తున్నారు. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామి నివాసానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆరుగురు ముఖ్య నేతలతో పళనిస్వామి కీలక చర్చలు జరుపుతున్నారు. -
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువుదీరనుంది. రేపు(శనివారం) నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే విజయ్‌కు సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ప్రకటించాయి. లెప్ట్, వీసీకే మద్దతుతో విజయ్‌కే పూర్తి మెజార్టీ దక్కింది.టీవీకే-107, కాంగ్రెస్-5, సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2 మద్దతుతో 118కి సంఖ్యాబలం చేరింది. అలాగే టీవీకేకు ఐయూఎంఎల్(2) కూడా మద్దతు తెలిపింది. మొత్తం 120 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని గవర్నర్‌కు విజయ్ తెలిపారు. ప్రమాణస్వీకారానికి రాహుల్, ఖర్గే హాజరయ్యే ఛాన్స్ ఉంది.కాగా, వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిందేనంటూ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు అనేది అత్యవసరమన్న ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. -
మరో ట్విస్ట్.. టీవీకే పార్టీకి కాంగ్రెస్ కండీషన్
చెన్నై: టీవీకే పార్టీకి కాంగ్రెస్ షరతు విధించింది. మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్ కండీషన్ పెట్టింది. మరోవైపు, కేవలం సపోర్ట్ మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయించగా.. టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది. మరోవైపు, పెరంబదూర్ నుంచి ఎమ్మెల్యే కొనసాగాలని విజయ్ భావిస్తుండగా.. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే షరతు పెట్టింది.తిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్ విధించింది. తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావళన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీటు తమకు కేటాయించాలని టీవీకేకు షరతు పెట్టింది. ఇదిలా ఉండగా, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సోమవారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది.విజయ్‌కు సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ప్రకటించాయి. లెప్ట్, వీసీకే మద్దతుతో విజయ్‌కే పూర్తి మెజార్టీ దక్కింది. టీవీకే-107, కాంగ్రెస్-5, సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2 మద్దతుతో 118కి సంఖ్యాబలం చేరింది. షరతులు లేకుండా టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖను టీవీకేకు వామపక్షాలు అందచేశాయి. -
ఎందుకిలా చేశారు?.. తమిళనాడు గవర్నర్ సీరియస్
చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను సీఎస్, డీజీపీ కలిశారు. విజయ్‌కు కాన్వాయ్ ఎలా ఇచ్చారంటూ డీజీపీని గవర్నర్ ప్రశ్నించారు. ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారంటూ గవర్నర్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత శాంతి భద్రతలపై గవర్నర్‌కు డీజీపీ నివేదిక ఇచ్చారు.కాగా, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం హోదాలో ఇచ్చే జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీని విజయ్‌కు పోలీస్ శాఖ కేటాయించింది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.తాజా పరిణామాలతో విజయ్ కాన్వాయ్‌ను తొలగించారు. మరో వైపు, రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలు చేపట్టింది. తమిళనాడులో క్షణం క్షణం రాజకీయ పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో చెప్పడంతో పరిస్థితి మారిపోయింది.ఇవాళ పుదుచ్చేరిలోని రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో పళనిస్వామి భేటీ కానున్నారు. 30 మంది ఎమ్మెల్యేల కోసం అత్యంత విలాసమైన రిసార్ట్‌ను పళనిస్వామి బుక్ చేశారు. కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. టీవీకే వైపు చూస్తుండగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పళనిస్వామి ఉన్నారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం స్టాలిన్ కూడా సమావేశం కానున్నారు. -
టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్
చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేపు(గురువారం) విజయ్ ప్రమాణ స్వీకారం అనుమానమే?. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి విజయ్‌కు గవర్నర్ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్‌ను విజయ్ ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్ స్పష్టం చేశారు.మరో వైపు, విజయ్‌కు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించారు. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు.. కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్ చెప్పేసింది. ఇదిలా ఉండగా, లోక్ భవన్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదని.. రేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను విజయ్ కోరారు.తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అంటూ ఆరా తీసిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, మెజార్టీ సంఖ్య చూపించాలంటూ గవర్నర్ తేల్చిచెప్పినట్లు సమాచారం. 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితాను గవర్నర్‌కు విజయ్ అందించారు. గవర్నర్ నిర్ణయంపై టీవీకే నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా, ప్రభంజనంలా దూసుకొచ్చిన టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
సీఎంనే ఓడించిన మొనగాడు ఇతనే....
-
గవర్నర్‌కు టీవీకే విజయ్ లేఖ
చెన్నై: తమిళనాడు గవర్నర్‌కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్ కోరారు. లోక్‌భవన్‌కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్ చేసినట్లు సమాచారం.ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్‌కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం. -
గెలిచిన తర్వాత తాను చదివిన కాలేజికి వెళ్లిన విజయ్ ఎందుకో తెలుసా..?
-
విజయం తర్వాత విజయ్ ఫస్ట్ లుక్
-
విజయ్ అప్పటి నుంచే మారిపోయాడు!
తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ పూర్తి పేరు... జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. సినిమాల్లో రాణించి అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో.. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం, సోదరి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.అన్నయ్య చేతుల్లోనే..తన చెల్లి విద్య చిన్న వయస్సులోనే మరణించడం విజయ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 1980లో జన్మించిన విద్య సుమారు నాలుగేళ్ల వయసులో 1984 మే 20వ తేదీన ఆనారోగ్యంతో మరణించారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ 'ఎనక్కుల్ నానే నీధిపతి' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యా విజయ్.. తన అన్నయ్య చేతుల్లోనే ప్రాణాలు విడిచారని.. ఆ సంఘటన విజయ్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.ఈ విషాదం జరగక ముందు..ఈ విషాదం జరగక ముందు.. దళపతి విజయ్ ఎంతో చురుకుగా.. అల్లరి చేస్తూ.. అతిగా మాట్లాడే బాలుడిగా ఉండేవారు. కానీ విద్యా విజయ్ మరణం తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఆయన అంతర్ముఖుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఆయన బహిరంగ ప్రదేశాల్లో కనిపించే శాంత స్వభావానికి ఆనాటి ఆ ఘటనే కారణమని చెబుతుంటారు. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎంతో ఆప్యాయంగా విద్యకు తనే స్నానం చేయించి అన్నం కూడా తినిపించేవాడు. చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా..గతంలో ఓ కార్యక్రమంలో తన చెల్లెలు విద్య గురించి విజయ్ మాట్లాడుతూ.. తన జీవితంలో చెల్లెలు మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైందన్నారు.. కానీ ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడంటూ.. వారందరిలో తన చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటానని తెలిపారు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని నామకరణం చేశారు.విజయ్ కార్ నంబర్ వెనుక రహస్యంవిజయ్ తన కార్లకు 0277 అనే ప్రత్యేక నంబర్‌ను వాడుతుంటారు. ఈ నంబర్ తన సోదరి విద్యాకు అంకితం చేశారు. 14-02-77 అనేది ఆమె పుట్టిన తేదీ. తన సోదరిపై ఉన్న ప్రేమతో విజయ్ ఇప్పటికీ ఆ నంబర్‌ను వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నారు.తండ్రిపై విజయ్ కేసు..కాగా, గతంలో విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టిన సంగతి కూడా అభిమానులు గుర్తుకుచేసుకుంటున్నారు. 2020లో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎస్.ఎ.చంద్రశేఖర్, ట్రెజరర్‌గా శోభా చంద్రశేఖర్ వ్యవహరించారు. అయిత.. తన తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తండ్రి స్థాపించిన ఆ పార్టీకి తన పేరుని ఉపయోగించుకుంటే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనంగా మారింది. -
మన పవన్‌లో ఆ ఫైరేదీ?!
సాక్షి, అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య విజయం తర్వాత జనసేన పార్టీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. ఆ రాష్ట్రంలో విజయ్‌కు ఉన్నంత సినిమా గ్లామర్ మన రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్‌కూ ఉన్నా.. ఆ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయారనే చర్చ సాగుతోంది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఒంటరిగా పోటీ చేసి సత్తాచాటి సీఎం కాగలుగుతున్నప్పుడు పార్టీ పెట్టి 12 ఏళ్లయినా పవన్ ఇంకా పొత్తుల జపం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ కి ఊడిగం చేయాల్సిన దుస్థితి తమకేంటని మథనపడుతున్నాయి. ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్నా.. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం తమకు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల పంపకంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధ పడుతున్నారు. పదవుల సంగతి దేవుడెరుగు కనీస గౌరవమూ దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మిమ్మల్ని టీవీకే జెండా తప్ప మరే జెండా మోయనివ్వను’ అని తన కార్యకర్తలకు టీవీకే అధినేత విజయ్ భరోసా ఇచ్చినట్టు తమ అధినేత పవన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైగా ఇంకో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతోందని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పటి నుంచి జనసేనలోని పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఇదే విధంగా విస్తృతంగా చర్చసాగుతోంది. విజయ్‌తో పవన్‌ను పోల్చి చూసుకుని సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా విజయ్ అభ్యర్థులను పెట్టి పోటీ చేసి సత్తాచాటిన నేపథ్యంలో ఏపీలో ఉన్న 175 స్థానాల్లో్ల తమ పార్టీ కి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని గతంలో పవన్ అన్న మాటలను గుర్తుచేసుకుని జనసేన నేతలు రగిలిపోతున్నారు. తొలి నుంచీ పవన్ భయం భయంగానే.. పవన్ తొలి నుంచీ భయం భయంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారన్న చర్చ నడుస్తోంది. విజయ్ మాదిరి ధైర్యంగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2014లో జనసేన పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీ కూటమికి మద్దతు తెలిపి పలాయనవాదం అందుకోవడంతోనే ప్రజల్లో పవన్ పలుచనైపోయారనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినా.. పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన పవన్ ఏమాత్రం ఎందుకు ప్రభావం చూపలేకపోయారన్న చర్చ నడుస్తోంది.2024 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పడేసిన 21 సీట్లతో సర్దుకుని పోటీ చేసిన పవన్ తనకు బలం లేదని, అన్ని చోట్లా పోటీ చేయడానికి తమకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని ఎన్నికల ప్రచారసభల్లో బేల వచనాలు పలకడాన్ని బట్టి ఎన్నడూ పవన్ రాజకీయంగా ధైర్యం కనబరచలేదని జనసేన శ్రేణులు మథనపడుతున్నాయి. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడూ మరో 15ఏళ్లు పొత్తులే అంటూ చేస్తున్న ప్రకటనలపైనా విస్మయం వ్యక్తమవుతోంది.తెగువే ‘విజయ్’బావుటా.. తమిళనాడులో విజయ్ చూపిన తెగువే ఆ రాష్ట్రంలో 60 ఏళ్లుగా అధికారం దక్కించుకుంటున్న ద్రవిడ పార్టీ ల పీచమణిచింది. అక్కడ ఉండే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన విజయ్ తొలినుంచి ధైర్యంగా ముందడుగేశారు. ఎవరితోనూ ‘పొత్తులు పెట్టుకోనని కరాఖండీగా తేల్చిచెప్పారు. ‘‘ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించను, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయను.’ అంటూ తన అభిమానులు, పార్టీ శ్రేణుల్లోనూ ధైర్యం నింపి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన సినిమాను ఆపినా, లీక్ చేసినా, 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేసినా ధీరుడిగా పోరాడారు. చివరకు అంచనాలను తలకిందులు చేసి అనూహ్యంగా జయకేతనం ఎగురవేశారు. ఇప్పటికైనా సొంతంగా ఎదిగే ధైర్యముందా? పవన్ ఇప్పటికైనా ఏపీలో సొంతంగా ఎదిగే ధైర్యం చేస్తారా? విజయ్ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతారా? తెలుగుదేశం కబంధహస్తాల నుంచి బయటకొచ్చి సొంతంగా సత్తాచాటే స్థాయికి ఎదుగుతారా? అనే చర్చ జనసేనలో విస్తృతంగా సాగుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందే ఓట్లు చీలనివ్వను అంటూ పొత్తుల బాట పట్టిన పవన్.. అప్పటికే అవసాన దశలో ఉన్న టీడీపీకి ఊపి రి పోసి.. తాను మాత్రం ఎదగలేకపోయారనే భావన జనసేనలో ఇప్పటికీ వ్యక్తమవుతోంది. ఎన్నికల్లోనూ టీడీపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని తన ఎదుగుదలకు తానే గండికొట్టుకున్నారనే ఆవేదన వినిపిస్తోంది. ఇప్పటికైనా పవన్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు రాబట్టవచ్చని జనసేన శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఇంకో 15ఏళ్లు పొత్తు అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై తలలు పట్టుకుంటున్నాయి. పవన్ తీరే వేరు.. ఏపీలో సినీ గ్లామర్‌తోనే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తీరు వేరేగా ఉందని జనసేన శ్రేణులే వాపోతున్నాయి. తొలి నుంచి పొత్తుల పేరుతో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారని, జనసేన కార్యకర్తల చేత తెలుగుదేశం జెండాలు మోయిస్తూనే ఉన్నారని వాపోతున్నారు. ఈ విషయంపై జనసేనలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతూనే ఉంది. దీనిపై చాలామంది నేతలు బహిరంగంగానే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. -
ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు
-
విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న
-
పొత్తుల్లేవు... జెండాలు మోసే కూలి కాదు విజయ్ తిరుగులేని ప్రస్థానం
-
Tamilnadu Results: MLA గా స్టాలిన్ ఓటమి...!
-
TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్
-
మా బావ గెలుపు చాలా ఆనందంగా ఉంది
-
విజయ్ విక్టరీ వెనుక ఆ ఒక్కడు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి రెండేళ్లే అవుతున్నా.. తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను మట్టికరిపించింది. అయితే.. ఈ విజయ్ విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ విక్టరీ వెనుక ఉన్న కపిల్ సాహు. ఎన్నికల వ్యూహంలో ఆయనకు పదేళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌లో రాఘవ్ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్ విస్తరణలో కీలక పాత పోషించారు. కాంగ్రెస్ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం ఉంది ఈయనకు.గతంలో ఐప్యాక్(Indian Political Action Committee)లో పని చేసిన ఆయన.. ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్‌గా మారారు. ఆ తర్వాత విజయ్ టీవీకేకు వ్యూహాలు అందించారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించారు. టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించడం.. గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం.. ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ వ్యూహాలను మెరుగుపరచడం చేశాడాయన. సాహు రూపొందించిన వ్యూహం పార్టీకి 100+ సీట్లలో ఆధిక్యం సాధించడానికి తోడ్పడింది. -
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్‌ను అందరూ విజయ్‌తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్‌కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్‌లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్‌కు ఉన్న ధైర్యం పవన్‌కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్‌బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్‌కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీవీకే విజయ్ నివాసానికి నటి త్రిష
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల్లో విజయంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలిపారు. ఇవాళ త్రిష బర్త్‌డే.. ఉదయం తిరుమలలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరుమల నుంచి నేరుగాచెన్నైకు వెళ్లిన త్రిష.. విజయ్‌కు విషెస్ చెప్పారు.త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai. TVK is currently leading in 106 seats of the total 234 in the state. pic.twitter.com/Sezg1xgYDQ— ANI (@ANI) May 4, 2026ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు. కాగా, చెన్నైలోని విజయ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నైలోని విజయ్ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. -
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే.. విజయ్ బిగ్ ప్లాన్!
చెన్నై: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయమని.. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ టీవీకే చెబుతోంది. హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే స్థానాలే రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి.విజయ్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొదట నుంచి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జరగ్గా, గత కొన్ని నెలలుగా ఆ పార్టీతో టీవీకే మధ్య మాటల మంటలు, పరస్పర విమర్శల క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంత ఈజీ కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ క్రమంలో తమిళనాట టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ జట్టుకంటే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌కు 5 సీట్లు, సీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే అవకాశం ఉంది. కాగా, అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోగా, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.తాజా ట్రెండ్స్ ప్రకారం.. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ అనూహ్య విజయం దిశగా దూసుకెళ్తుంది. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు గట్టి సవాలే విసురుతోంది. భారత ఎన్నికల సంఘం (ECI) వెల్లడించిన ప్రారంభ గణాంకాల ప్రకారం.. తమిళనాడులో అరుదైన త్రిముఖ పోటీ నెలకొంది. విజయ్ పార్టీ ఇప్పటికే మెజారిటీ మార్కును దాటి.. అధికార డీఎంకేను వెనక్కి నెట్టి ముందంజలో ఉంది. ఏఐఏడీఎంకే మూడవ స్థానానికి పరిమితమైంది. -
విజయ్ ఇంట్లో సంబరాలు
-
టీవీకే దూకుడు.. విజయ్ నివాసంలో సంబరాలు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనం సృష్టిస్తుంది. వంద స్థానాలు దాటి టీవీకే దూసుకుపోతోంది. తమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. టీవీకే విజయ్ నివాసం దగ్గర భద్రత భారీగా పెంచారు. చెన్నైలోని విజయ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం అని టీవీకే అంటోంది. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే ధీమా వ్యక్తం చేసింది.సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చగా.. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా వచ్చాయి.. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిజమయ్యాయి.JUST IN 🔔 : விஜய் அண்னன் வீட்டில் கொண்டாட்டம் தொடங்கியது ! 😍🔥@TVKPartyHQ | #WhistlePodu pic.twitter.com/T07mR5ZXsJ— Prakash Vijay (@PrakazVijay_Of) May 4, 2026టీవీకే పార్టీకి యువత ఎక్కువగా మొగ్గు చూపారు. 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేసినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని చెప్పారు. 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని సర్వేలో తెలిపారు. -
తమిళనాట తలకిందులైన లెక్కలు
తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అనూహ్యంగా టీవీకే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డీఎంకేను దాటి దూసుపోతుంది. తమిళనాడులో టీవీకే ముందంజ ఉండగా, రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానానికి అన్నాడీఎంకే పరిమితమైంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. లీడింగ్‌లో టీవీకే విజయ్ పార్టీ దూసుకుపోతుంది.విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే విజయ్‌కు తమిళ ఓటర్లు జైకొట్టారు. హంగ్ వస్తే టీవీకే-అన్నాడీఎంకే జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, ముందస్తుగా అప్రమత్తమైన విజయ్ పార్టీ.. తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసిన సంగతి తెలిసిందే. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
తమిళనాట మరో సంచలన సర్వే
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో ఎంజీఆర్ అయ్యేనా అన్నది మరికొన్ని గంటల వ్యవధిలో తేలనుంది. ఈ నేపథ్యంలో మరో ఎగ్జిట్ పోల్‌లోనూ విజయ్‌కే అధికారం ఖాయం అని స్పష్టం కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. తమిళనాడులో మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి.అయితే యాక్సిస్ మై ఇండియా, మరికొన్ని స్థానిక చిన్న సంస్థలు, సామాజిక మాధ్యమాలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వైపే ప్రజలు మొగ్గు చూపారని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో శనివారం మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన నియోజకవర్గాల వారీగా ఎగ్జిట్ పోల్ సర్వే ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. విజయ్ పార్టీకి 121 స్థానాలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమగ్రంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంచనా ప్రకారం, విజయ్ నాయకత్వంలోని టీవీకే ఏకంగా 41 శాతం ఓట్లను సాధించి, 121 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, ముఖ్యంగా 18–40 ఏళ్ల వయస్సు గల ఓటర్లు టీవీకే వైపు బలంగా నిలిచారని ఈ నివేదిక పేర్కొన్నారు.ఐదు దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్ సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని ఈ సర్వే విశ్లేషించడం గమనార్హం. ఇక యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలిపింది. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా రావడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అప్రమత్తమయ్యాయి. మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, అభ్యర్థులకు సూచించాయి. -
కాఫీ-టీ కలుస్తాయా?.. తమిళనాడులో ఏం జరగనుంది?
అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్‌తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి.ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. -
విజయ్‌దే విజయం.. యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్
సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకేదే విజయమంటూ యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. మెజార్టీ సర్వే సంస్థలకు భిన్నంగా టీవీకే చీఫ్ విజయ్‌దే ప్రభంజనమన్న ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్.. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండో స్థానంలో డీఎంకే 92-100 సీట్లు సాధించే అవకాశముందని అభిప్రాయం పడింది. మొత్తానికి టీవీకేకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. మాట్రిజ్ సర్వే.. డీఎంకే: 122-132, అన్నా డీఎంకే: 87-100, టీవీకే 10-12, ఇతరులు 0-6 సీట్లు సీట్లు వస్తాయని పేర్కొంది. డీఎంకే 134-141, అన్నా డీఎంకే 84-90, టీవీకే 4-8 సీట్లు సాధించే అవకాశముందని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. కాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మిగతా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విభిన్నంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను ప్రకటించింది. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశముందని చెప్పింది.తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్ పెట్టిస్తోంది. ఇవాళ విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని అంచనా వేయగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. -
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్.. విజయ్ సీఎం అవుతాడా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళతో (బుధవారం)తో ముగిసింది. పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేశాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.మాట్రిజ్ సర్వే:DMK: 122-132ADMK: 87-100TVK: 10-12ఇతరులు 0-6ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్DMK 134-141AIDMK 84-90TVK 4-8టీవీకే విజయ్‌దే విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశంరెండో స్థానంలో డీఎంకే 92-100పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు. 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు. -
ఓటు వేసిన సూర్య, జ్యోతిక
-
టీవీకే కార్యకర్త అరెస్ట్.. పోలింగ్ కేంద్రంలో ఏం చేశాడంటే..?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఈ ఘటన జరిగింది.అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి తన మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లిన శక్తివేల్.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్‌పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు -
తమిళనాడులోనూ ‘మేధావితనం’ బయటపెట్టుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎవరికి లాభం చేకూరుస్తోంది? అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికా? లేక అధికారంలో ఉన్న డీఎంకేకా? ద్రవిడ సెంటిమెంట్ ప్రబలంగా ఉండే తమిళనాడులో డీఎంకే పార్టీ చంద్రబాబు వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునేలా కనిపిస్తోంది. చంద్రబాబు తెలుగువారు అధికంగా నివసించే కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో పర్యటించారు.ఈ ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగు ప్రజలే ఎక్కువ. దశాబ్దాలుగా అక్కడ జీవనం సాగిస్తున్న వారు తమిళులతో మమేకమైపోయారు. అయినాసరే... కాంగ్రెస్, డీఎంకే కూటమిపై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు ప్రసంగం కూడా వైరుధ్యాలతో కూడి ఉంది. పైగా తన బలహీన పాయింట్లను ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అనిపిస్తుంది.తమిళనాడులో యాంటి హింది సెంటిమెంట్ అధికం. కానీ చంద్రబాబు అక్కడకు వెళ్లి హిందీ భాషను ప్రమోట్ చేసేలా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇది సహజంగానే అక్కడి ప్రజలకు నచ్చదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకేకి కూడా ఇది రుచించదు. చిత్రమేమిటంటే తమిళనాడులో ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఆంధ్రలో మాత్రం ఆంగ్ల మీడియాన్ని వ్యతిరేకించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే దానిని తీవ్రంగా తప్పుపట్టారు.బాబు సన్నిహితులు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందా?లేక ఆంగ్లం బాగా చదివితే అధికంగా ఉపయోగం ఉంటుందా అన్నది తమిళులకు తెలియదా! మీడియా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా డీఎంకేకి మేలు చేసినట్లయిందని కొంతమంది విశ్లేషించారు. అలాగే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన డీఎంకే అదే పార్టీతో కలవడం ఏమిటనే చిత్రమైన వాదన తీసుకువచ్చారు. ఇక్కడే ఆయన పరస్పర విరుద్దంగా మాట్లాడడమే కాకుండా, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ప్రచారం చేసేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆరంభించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత ఈయన కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నారా అంటే అదీ లేదు. గతంలో అంటే వేరే రాష్ట్రానికి వెళ్లి ఏమి చెప్పినా, అక్కడి జనానికి తెలియదు కనుక ఎలాగో నడిచిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా, అందులో తేడా ఉంటే క్షణాలలో సోషల్ మీడియాలో వీడియోలతో సహా వచ్చేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారనుకోవాలి.1983 ఎన్నికలలో కూడా చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్.ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీలోకి ప్రవేశించి, ఆధిపత్యం సాధించుకున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. బీజేపీతో కొన్నిసార్లు, ఇతర పార్టీలతో కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు.ఆ క్రమంలో 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వదలి వేసినా, 2023 శాసనసభ ఎన్నికలలో పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు సహకరించారన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్ద టిడిపి జెండాలు కూడా అప్పట్లో రెపరెపలాడాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల అనుబంధం తెలిసిందే. కాకపోతే ఈ విషయాలేవీ తమిళులకు తెలియవన్నది ఆయన నమ్మకం కావచ్చు.ఇది ఒక కోణం అయితే కాంగ్రెస్‌తో స్నేహం చేస్తున్న రోజుల్లో సోనీయాగాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి సభలలో పాల్గొన్నారు.బిజెపి నేతలను ముఖ్యంగా ప్రధాని మోడీని తీవ్రమైన పరుష భాషలో విమర్శించేవారు.ఆ క్రమంలో అప్పట్లో తమిళనాడు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ కన్నా స్టాలిన్ సమర్థమైన నేత అని చంద్రబాబు ప్రశంసించారు. మామూలుగా అయితే ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదేమో. కాని స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియోలన్ని బయటకు వచ్చాయి. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను తమిళనాడులో మరో సారి బహిర్గతం చేసుకున్నారు. ఇది డీఎంకే కే మేలు చేసే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు ప్రస్తావించి ఎన్డీయే కూటమిని డిఫెన్స్ లో పడేసినట్లు అనిపిస్తుంది.నిజానికి చంద్రబాబు ఈ టూర్లో కాంగ్రెస్‌పై మరీ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేయలేదు. సాధారణంగా ఆయన తన ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి పాల్పతుంటారు. అందులో మంచి, చెడు కూడా చూడరు. అలాంటిది ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేదా డీఎంకే ముఖ్యనేతలెవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం వివిధ రంగాలలో వైఫల్యం చెందిందని, చెన్నై వెనుకబడిపోయిందని, అప్పులపాలైందని, మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని.. ఇలాంటి విమర్శలేవో చేశారు. అవన్ని విన్నవారు ఇదేదో ఏపీలో తన ప్రభుత్వం గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. చెన్నై ఉపాధి కేంద్రంగా ఉంది.ఏపీ నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అదే టైమ్ లో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది. ఈ రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ రూ.355000 కోట్లకు పైగా అప్పు చేసి దేశంలో రికార్డు సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో అనేకం అమలు కాలేదు.వి శాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసినట్లు, ఇతరత్రా ఏదో అభివృద్ది జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయాలేవి తమిళ ప్రజలకు పెద్దగా అవసరం లేనివే. లేని గొప్పలు చెప్పుకుని ఏపీలో ఎల్లో మీడియాకు బానర్ కధనాలు ఇవ్వడమే లక్ష్యం కావచ్చు.ఏపీలో మద్యం బెల్ట్ షాపులు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.నకిలీ మద్యం ప్లాంట్ కూడా నడిచిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ వేగంతో అభివృద్ది అంటూ ప్రచారం చేశారు.కాని కేంద్రం ద్వారా ఏపీకి ఈ రెండేళ్లలో కలిగిన లాభం ఏమిటో ఆయన వివరించలేకపోయారు. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు కడుతున్నామని చెప్పుకున్నారు. దాని అవసరంపై టీడీపీ మేధావులే పెదవి విరుస్తున్నారు.అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను భయపెడుతున్న విషయం తమిళులకు తెలియకపోవచ్చు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేరే విషయం. చివరిగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యంగ్య వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి.స్టాలిన్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్ చేశారట.'చంద్రబాబు 1995లో నన్ను మంచోడు అన్నారు. 2004లో కాదన్నారు. 2009లో మంచోడు అన్నారు. 2014లో కాదు అన్నారు. 2019లో మళ్లీ నన్ను మంచోడు అని మెచ్చుకున్నారు.ఇప్పుడు 2026లో తిరిగి నేను మంచోడిని కాదు అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు తమిళనాడు ప్రజలు పట్టించుకోరు" అని అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి ఉంటుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
TN Election: విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. ఇన్వెస్టర్లలో గుబులు!
చెన్నై: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ, ఆర్థిక యుద్ధానికి తమిళనాడు వేదిక కాబోతోంది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 11.19 శాతం రికార్డు వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్రం రేపు (ఏప్రిల్ 23న) ఓటింగ్ కు సిద్ధమైంది. అయితే అందరి దృష్టి పాత రాజకీయ దిగ్గజాలపైనే కాకుండా, కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న సినీ నటుడు విజయ్ పై పడింది. 2030 నాటికి $1 ట్రిలియన్(రూ. లక్ష కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రానికి ఈ సరికొత్త రాజకీయ సమీకరణం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.బలమైన ఆర్థిక శక్తిగా తమిళనాడు2024-25 ఆర్థిక సర్వే ప్రకారం, తమిళనాడు జీఎస్డీపీ ఏకంగా 11.19 శాతానికి చేరుకుని, ప్రధాన భారతీయ రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా తయారీ రంగం జాతీయ సగటు (4.5%) కంటే మూడు రెట్లు ఎక్కువగా 14.74 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశ జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న ఈ రాష్ట్రం జాతీయ జీడీపీకి 9.4 శాతం తోడ్పాటు అందించడం విశేషం. తలసరి ఆదాయం రూ. 3.62 లక్షలకు చేరింది. హ్యుందాయ్, ఫాక్స్‌కాన్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడ భారీగా విస్తరిస్తున్నాయి. హోసూర్‌లో రోల్స్ రాయిస్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ ప్రారంభించడం దీనికి నిదర్శనం. 2024-25లో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, లెదర్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం.. సరుకుల ఎగుమతుల ద్వారా $52.07 బిలియన్లు(రూ. 4.35 లక్షల కోట్లు) రాబట్టింది.‘టీవీకే’ ప్రభంజనమా? పెట్టుబడులపై ప్రభావమా?ఎలాంటి పరిపాలనా అనుభవం లేని విజయ్ పార్టీ మే 4న వెలువడే ఫలితాల్లో సృష్టించబోయే ప్రభావాన్ని మార్కెట్ శక్తులు గమనిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు పారిశ్రామిక అనుకూల విధానాలతో స్థిరమైన పాలన అందించాయి. దీనివల్లే 2019 అక్టోబర్ నుండి 2025 జూన్ నాటికి $17.29 బిలియన్ల (రూ. 1,53,394 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ఇక్కడికి వచ్చాయి. అయితే విజయ్ పార్టీ ఓట్లను చీల్చి, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తితే, అది కూటమి రాజకీయాల అనిశ్చితికి దారితీస్తుంది. ఒకవేళ విజయ్ గణనీయమైన సీట్లు సాధించి ‘కింగ్ మేకర్’ అయితే, భూసేకరణ లేదా పారిశ్రామిక విధానాలపై వారికున్న అనుభవలేమి కారణంగా, హోసూర్‌లో కొత్తగా రూ. 2,000 కోట్ల ప్లాంట్‌ను ఆమోదించడానికి కార్పొరేట్ సంస్థలు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.ఉచిత పథకాలు వర్సెస్ సుస్థిర వృద్ధిఎన్నికల హడావిడిలో అసలు చర్చించాల్సిన ప్రధానాంశం ఆర్థిక సుస్థిరత. రాష్ట్ర సామాజిక రంగ వ్యయం 2021-22లో రూ. 1.13 లక్షల కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 1.57 లక్షల కోట్లకు పెరిగింది. రేపటి పోలింగ్ కోసం అన్ని పార్టీలు మరిన్ని ఉచితాలను అందిస్తామని వాగ్దానం చేశాయి. ఈ నేపధ్యంలో ఏదో ఒక దశలో రూ. 36 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ వీటన్నింటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సంక్షేమాన్ని పంచుతూనే 2030 నాటి ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్నదే తదుపరి ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలిచింది.ఇది కూడా చదవండి: Earth Day 2026: అవని అంతం?.. మోగిన ‘కోడ్ రెడ్’! -
ప్రధాని మోదీకి ‘తమిళ మేకప్?.. నెట్టింట రచ్చ
చెన్నై: సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విచిత్ర చర్చ మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ బహిరంగ సభలో మోదీ చర్మం మునుపటికంటే కాస్త ముదురు రంగులో (నల్లగా) కనిపించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే కోణంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.స్థానిక ఓటర్ల కోసమే మేకప్ వేశారా?ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు, స్థానికులతో మమేకమయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే మోదీకి ముదురు రంగు మేకప్ లేదా బ్రాంజర్ వేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అయినా ఈ అంశంపై వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. DARK MAKEUP FOR DARKER VOTES — Tamil Nadu Tantrum!” 😡🎭 ⁉️Everything is a PR stunt for our PM.In Tamil Nadu, he seems to have applied darker skin-tone makeup to “look like one among them. Does he really think all Tamilians are black or dark? If this is true then this is… https://t.co/b8oGXWAZgA— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) April 20, 2026కెమెరా ఎఫెక్టా, ఎండ ప్రభావమా?ఒకవైపు ఈ 'తమిళనాడు మేకప్' వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. తీవ్రమైన ఎండలో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కెమెరా ఎక్స్పోజర్, లైటింగ్ లోపాలు లేదా సూర్యరశ్మి ప్రభావం వల్ల సహజంగానే చర్మం రంగు అలా కనిపించి ఉండొచ్చని వారు అంటున్నారు. వీడియోలు తీసిన కోణం లేదా పోస్ట్-ప్రాసెసింగ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి కారణం కావొచ్చని విజువల్ మీడియా నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. Different shades; early morning in Bengal election campaign V/s evening election campaig in Tamil Nadu after applying shoe polish on face..He’s not insulting entire Tamilians ? pic.twitter.com/InN7RxsCn1— RajSpeak Parody ☭ (@RajSpeak_) April 21, 2026ఉత్తర-దక్షిణ వివాదంగా మారిన రాజకీయంవాస్తవ నిర్ధారణ జరగకముందే ఈ వివాదం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖలు గీసే స్థాయికి చేరుకుంది. ఆన్లైన్ వేదికగా రెండు వర్గాలు తీవ్రంగా వాదించుకుంటూ సోషల్ మీడియాను రెండుగా చీల్చాయి. ఎన్నికల వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న దృశ్యాలు కూడా ఎంత వేగంగా పెద్ద చర్చకు దారితీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇది కూడా చదవండి: తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా? -
తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు
-
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్‌కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్‌లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్‌ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్‌లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్‌షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026 -
ముగ్గువేసి మనసులు గెలిచిన విజయ్
-
టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడిలో టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రకటించిన రైతుల రుణమాఫీ హామీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ఆయన ప్రకటన అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బృహత్తర హామీని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమనే దానిపై సహకార శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సహకార బ్యాంకుల విలవిలవిజయ్ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని నెరవేర్చడం అంత సులభం కాదని సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సహకార బ్యాంకులు కేవలం తమ సొంత నిధులతో నడవవని, అవి ‘నాబార్డ్’ నుంచి రుణాలు తీసుకుని, ప్రజల డిపాజిట్లను ఉపయోగించి రైతులకు అప్పులు ఇస్తాయని వారు వివరిస్తున్నారు. రుణమాఫీ వల్ల కేవలం పేద రైతులకే కాకుండా సంపన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.బ్యాంకులపై పెనుభారంసాధారణంగా ఏ ప్రభుత్వమైనా రుణమాఫీ ప్రకటించిన వెంటనే సహకార సంఘాలకు ఆ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించదు. ఐదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తుంది. దీనివల్ల సహకార సంస్థలు తీవ్ర ఆర్థిక అగాధంలో కూరుకుపోతాయి. ఒకపక్క ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తూనే, తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి వాటిపై పడుతుంది. ఈ జాప్యాల వల్ల రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద తగిన నిధులు ఉండవని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.ఆర్బీఐ కఠిన నిబంధనలుఈ సమస్యలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఇప్పుడు కీలకంగా మారాయి. రుణమాఫీ పరిహారాన్ని ప్రభుత్వాలు వాయిదాల్లో కాకుండా 45 నుంచి 60 రోజుల్లోపు ఒకేసారి చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాలకు, రెండు నెలల వ్యవధిలో ఇంత భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. ఈ వాస్తవాన్ని గ్రహించిన మీదటనే అధికార డీఎంకే కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీని చేర్చలేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్ -
బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!
చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ఓటర్లపై వరాల వర్షం కురిపించింది. చెన్నై వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులు, సామాన్యులే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, ఆర్థిక స్థిరత్వమే మహా మంత్రంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.మహిళలకే అగ్రపీఠంబీజేపీ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. కుటుంబ యజమానురాళ్లకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ, ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్ఎంఈ లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.జల్లికట్టుకు జైవిద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేరాల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) ఇస్తామని తెలిపింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే అన్నామలై, తమిళసై సౌందరరాజన్ తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 🔴LIVE | பாஜக தாமரை வாக்குறுதி 2026 | தமிழக சட்டமன்றத் தேர்தலுக்கான பாஜகவின் தேர்தல் அறிக்கை வெளியீட்டு விழா#தாமரை_வாக்குறுதி #TNBJPManifesto https://t.co/mHA6ezpAnk— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 14, 2026 -
డీఎంకే కూటమిపై TVK Chief విజయ్ విమర్శలు
-
ఎన్నికల బరిలో లాటరీ కింగ్ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే?
చెన్నై/పుదుచ్చేరి: లాటరీ కింగ్‌గా గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబంలోని ముగ్గురు తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...? వీరు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగడమే అసలైన కిటుకు. మార్టిన్ భార్య లీమా రోజ్(59) ఇటీవలే అన్నాడీఎంకేలో చేరి లాల్గుడి నియోజకవర్గంలో పోటీకి దిగారు.మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్(38) సొంతంగా లక్ష్య జననాయక కట్చి(ఎల్జేకే)అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, ఏఐఎన్నార్సీల ఎన్డీయేలో ఈ పార్టీ కూడా ఉంది. చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ స్థానానికి పోటీ పడుతున్నారు.మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున(43), విజయ్ సారథ్యంలోని టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కమ్లో పోటీకి దిగారు. ఈ ముగ్గురూ ఏప్రిల్ 9, 13వ తేదీల్లో జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, మార్టిన్ గ్రూప్ కంపెనీ ఎండీగా ఉన్న జోస్ చార్లెస్ తనకు రూ.597 కోట్ల ఆస్తులు, అర్జున రూ.197 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించుకున్నారు. -
TVK విజయ్ నామినేషన్ దాఖలు
-
ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్
తిరుచ్చి: ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ప్రదేశ్‌గా పేరు మారుస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏపై స్టాలిన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్టాలిన్ విరుచుకుపడ్డారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పనికిరాని డబ్బా ఇంజిన్‌గా అభివర్ణించిన స్టాలిన్.. తమ ద్రవిడ మోడల్ పాలనను 'సూపర్ ఫాస్ట్ ఇంజిన్‌తో పోల్చారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించి, ద్రవిడ సిద్ధాంతాన్ని మరోసారి గెలిపించాలంటూ ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, వారి వల్ల కలిగే నష్టాలు మన ఊహకు అందవు. తమిళనాడు పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడు ఎప్పటికీ తమిళనాడుగానే ఉండాలి. ఉత్తరప్రదేశ్, మణిపూర్లాగా హింసాత్మక ప్రాంతంగా మారకూడదు. హోసూర్ విమానాశ్రయం, విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల కోసం తరచుగా పర్యటనలు చేస్తారు’’ అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. -
స్టాలిన్, విజయ్ నామినేషన్ దాఖలు
-
డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్
చెన్నై: తమిళనాడులో గెలిస్తే 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని అధికార డీఎంకే ప్రకటించింది. ‘మహిళలకు రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తాం. కూపన్లతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే పాతవాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు’’ అని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. ‘‘వ్యవసాయం, విద్య, పరిశ్రమల రంగాల్లో పలు రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తాం. రైతులు, గృహిణులు, విద్యార్థులు మొదలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోరుతూ పలు సంక్షేమ చర్యలను అమలుచేయబోతున్నాం. మామూలుగా డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటుంది. ఈసారి సూపర్స్టార్లా ఉండనుంది’’ అంటూ హామీల చిట్టాను ఓటర్ల ముందు ఆవిష్కరించారు.డీఎంకే మేనిఫెస్టో ముఖ్యాంశాలు...20 లక్షల మందికిపైగా రైతులకు ఉచితంగా మీటర్‌లేని పంపుసెట్లువార్షిక ఆదాయ పరిమితి పెంపుముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం రూ.10లక్షలకు పెంపువృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులకు నెలకు రూ.2,000 పెన్షన్కలైంగర్ మగలిర్ ఉరుమై థొగై పథకం కింద కుటుంబపెద్దగా ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థికసాయం రూ.2వేలకు పెంపుపాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ఎనిమిదవ తరగతి విద్యార్థుల దాకా వర్తింపుక్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,500 మద్దతు ధరటన్ను చెరకుకు రూ.4,500 మద్దతు ధరవచ్చే నాలుగేళ్లలోపు పూరిగుడిసెల అవసరం లేకుండా గృహపథకంలో భాగంగా కొత్తగా 10 లక్షల గృహాల నిర్మాణంఉన్నత విద్య పూర్తిచేసిన వాళ్లకు నాన్ ముధల్వాన్ పథకం కింద ఆరు నెలలపాటు వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు నెలకు రూ.1,500 అందజేతరాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించడంవచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపుధుమై పెన్, తమిళ్ పుధల్వాన్ పథకాల కింద నెలకు రూ.1,500 ఉన్నత విద్యా గ్రాంట్ అందజేతకోయంబత్తూర్, సేలం, మదురై, తిరుచిరాపల్లి సమీపంలో ఫ్యూచర్–రెడీ గ్లోబల్ సిటీల నిర్మాణం. -
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిలక పోరు తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తమ అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు.డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని విజయ్ నిర్ణయించడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమిళగ వెట్రి కళగంతో తొలి సారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్ ఉరకలు తీస్తున్నారు. కేడర్‌ను బలోపేతం చేస్తూ, ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించడమే కాకుండా, వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.అయితే, పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకోగా.. అనుమతి లభించలేదు. పెరంబూరులో తన ఎన్నికల ప్రచారానికి అధికారులు అనుమతి నిరాకరించడంపై విజయ్ అందులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. తన ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్యూరోక్రట్లు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాడమే కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ.. తమ ఉద్యోగు బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
తమిళనాడు ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు టెలివిజన్ సిరీస్‌లను నిర్మించారు. -
ఎవరిదో గెలుపు? బలాలు.. బలహీనతలు ఇవే..!
తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో.. ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..అంత ఈజీ కాదు..ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..! ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్‌గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది. -
ఏ ఎన్నికల్లో ఎవరు ఎలా గెలిచారు?
కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు పేరు వినగానే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత గుర్తుకువచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో వీరిని చూసే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. ఈ ఇద్దరు ఉద్ధండులు లేకుండానే 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపించే దశ నుంచి ఫలితాలు వెలువడే వరకూ రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఎన్నికల విషయంలో అనేక అంశాలు విజయం, ఓటమిలో పాత్ర పోషిస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. 1952 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో పలు అంశాలు గెలుపు, ఓటములను నిర్ణయించాయి.1952 నుంచి 2021 వరకు తమిళనాడులో 1952 నుంచి 2021 వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తే సాధారణంగా విజయం వేటిపై ఆధారపడి వరిస్తుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి.తమిళనాడులో ఏ ఎన్నికల వేళ ఏం జరిగింది?1952–19621952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర పోషించడంతో తమిళనాడు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.1957, 1962 ఎన్నికల్లో డీఎంకే ముఖ్య ప్రత్యర్థిగా ఎదిగి రాజకీయంగా కాంగ్రెస్‌కు పోటీగా మారింది.1967 కాంగ్రెస్‌పై వ్యతిరేక భావన, బియ్యం ధరలు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు డీఎంకేను ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. 1971లోనూ డీఎంకే గెలిచింది.1977 డీఎంకేలో విభజన, ఎంజీఆర్ ప్రజాకర్షణ వల్ల అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది.1980–1990 దశకం ఎంజీఆర్ ప్రజాదరణ, కూటమి వ్యూహాలు ఫలితాల్లో కీలక భూమిక పోషించాయి. 1980, 1984లో అన్నాడీఎంకే విజయం సాధించింది. 1989లో మాత్రం డీఎంకేను విజయం వరించింది.1991లో రాజీవ్ గాంధీ హత్య ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే విజయం సాధించింది.1996లో అన్నాడీఎంకేపై భారీగా ప్రజా వ్యతిరేకత, రాజకీయ కూటములు డీఎంకేకు స్పష్టమైన విజయం ఇచ్చాయి.2001–2011 మధ్యకూటమి రీతులు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలు ఎన్నికల తీర్పులను ప్రభావితం చేశాయి. 2016–2021 2016 ఎన్నికల్లో చిన్న పార్టీల ఓట్ల షేర్, తేడా తక్కువగా ఉండటం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది.2021లో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ పరిస్థితి మారి డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది.ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన ప్రధాన అంశాలు1. ప్రజా వ్యతిరేకత: అధికార పక్షంపై అసంతృప్తి ఫలితాలను మార్చేస్తుంది.2. నాయకుల ప్రజాకర్షణ: ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.3. కూటమి బలం: ఎవరు ఎవరితో కలుస్తారన్నది తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది.4. చిన్న పార్టీలు: చిన్న పార్టీల ఓట్లు ప్రధాన పార్టీలకు నష్టం లేదా లాభం కలిగిస్తాయి.5. చారిత్రక సంఘటనలు: ఆర్థిక పరిస్థితులు, పెద్ద సంఘటనలు ఓటర్ల అభిప్రాయాన్ని మార్చుతాయి. -
ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..!
తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.స్వాతంత్య్రానంతరం వేగంగా అభివృద్ధి రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. ప్రతికూల అంశాలు ఇవే.. పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్‌కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్‌లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది. -వెబ్‌డెస్క్ -
చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం
తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు. -వెబ్‌డెస్క్ -
సీఎం ఆఫర్ కు నో చెప్పిన విజయ్.. దూకుడు పెంచిన ముగ్గురు
-
స్టాలినే సీఎం: డీఎంకేకు 180 స్థానాలు ఖాయం!
ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారా..? డీఎంకే అభ్యర్థులకే గంపగుత్తగా ఓట్లేశారా..? ఆ పార్టీ అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపారా..? అత్యధిక స్థానాలతో అధికార పీఠం చేపట్టనున్నారా..? అన్నాడీఎంకే హవాకు ఓటర్లు మంగళం పాడేశారా..? అతి తక్కువ సీట్లకే పరిమితం చేయనున్నారా..? తమిళనాట కమల వికాసం కలేనా..? బోణీ కొట్టే పరిస్థితి కూడా ఉండదా..? అవుననే అంటున్నాయి సర్వేలు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తిరుగులేని విజయం సాధిస్తుందని ఘంటాపథంగా వెల్లడిస్తున్నాయి. సాక్షి , చెన్నై : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేలో ఆనందం వెల్లివిరుస్తోంది, అన్నాడీఎంకేలో నైరాశ్యం అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే– డీఎంకే తలపడ్డాయి. 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రజలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళి డీఎంకేకు అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐ బ్యాక్ సంస్థ ఎన్నికలకు ముందు మొత్తం 234 స్థానాల్లో సర్వేలో నిర్వహించి డీఎంకేకు 180 స్థానాలు ఖాయమని తేల్చింది. ఈ క్రమంలో పోలింగ్ న ఆడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని ఐ బ్యాక్ సంస్థ కార్యాలయానికి సైతం వెళ్లడం విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేకు 180 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించింది. దీంతో డీఎంకే శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. స్టాలిన్ కూడా డీఎంకే అభ్యర్థులను చెన్నైకి పిలిపించుకుని విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గురు, శుక్రవారాల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు సైతం స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ డీఎంకే అగ్రనేతలతో సమావేశమై మంత్రి పదవులు, శాఖల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. రెండాకుల్లో గుబులు! అన్నాడీఎంకే విషయానికి వస్తే ఎన్నికలకు ముందు సీఎం ఎడపాడి పళనిస్వామి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత డీలా పడిపోయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పలువురు మంత్రులు సైతం ఓటమిపాలవుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పళనిస్వామి సేలం జిల్లా సూరమంగళంలోని తన సొంతింటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రులు ఎంసీ సంపత్, ఆర్బీ ఉదయకుమార్, విజయభాస్కర్, కేసీ వీరమణి, జయకుమార్ సహా పలువురు అభ్యర్థులు సేలం వెళ్లి ఎడపాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులే ఓడిపోయే పరిస్థితి ఉందని వారు చెప్పడంతో పళనిస్వామి మరింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే 20–30 సీట్లకు పరిమితమవుతుందని, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించినట్లు సమాచారం. చదవండి: సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స -
తమిళ ఎన్నికల్లో ‘అనంత’ పోలీసుల సేవలు
సాక్షి, అమరావతి: తమిళనాడు ఎన్నికల బందోబస్తులో అనంతపురం జిల్లా పోలీసులు విశేష సేవలు అందించారు. పోలింగ్ రోజైన మంగళవారం నాడు ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు నడవలేని స్థితిలో ఉండే వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తల్లుల నుంచి చిన్నారులను తీసుకుని వారిని ఎత్తుకుని పోలీసులు ఆడించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించేలా ఓటర్లను చైతన్యపరిచారు. మాసు్కలు లేకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి మాస్క్ లను అందించారు. ఇలా సేవలు అందించిన నల్లమాడ కానిస్టేబుల్ రాము, బొమ్మనహళ్ కానిస్టేబుల్ ధనసింగ్ నాయక్‌లను అనంతపురం జిల్లా ఎస్పీ సత్యేయేసుబాబు అభినందించారు. -
'డీఎంకే అభ్యర్థులదే అన్నిచోట్లా విజయం'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు అన్నిచోట్ల విజయం సాధిస్తారని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం.. స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలిత తిరిగి అధికారంలోకి రావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాగా, చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. -
హోరాహోరీ
సాక్షి, చెన్నై: అధికార పగ్గాలు అమ్మకే అని ఓ సారి, కాదు..కాదు కరుణకే అంటూ మ రో సారి..! సర్వే ఫలితాలు ఇన్నాళ్లు రాష్ట్రంలో సాగుతూ వచ్చాయి. అయితే, ప్రప్రథమంగా నువ్వా...నేనా అన్నట్టుగా వెలువడ్డ సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. అమ్మకు 73 , కరుణకు 64 గ్యారంటీ అని ప్రకటించిన ఈ తాజా సర్వే, 83 స్థానాల్లో నువ్వా...నేనా అన్నట్టు హోరా హోరీ సమరం నెలకొని ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ కూట మి...ఇలా..పంచ ముఖ సమరం నెలకొంది. మునుపెన్నడూ లేని రీతిలో సాగుతున్న ఈ పోరులో ఓటరు నాడి ఎటో అన్నది అంతు చిక్క డం లేదు. పెద్ద ఎత్తున ఓట్ల చీలిక తథ్యం అన్నది మాత్రం స్పష్టం అవుతున్నది. ఈ చీలిక ఆధారం గా గెలుపు గుర్రాలు అవతరించబోతున్నాయి. అది ఎవరు..? అన్న ప్రశ్న సర్వత్రా నెలకొని ఉన్నది. స్థానిక, జాతీయ సంస్థలు, మీడియా వర్గాలు ఇప్పటి వరకు సాగిన సర్వేల్లో విచిత్ర ఫలితాల్ని ప్రకటించాయి. ఓ సంస్థ ఏమో అమ్మ జయలలిత సీఎం కావడం ఖాయం అని, క్వీన్ స్వీప్ తథ్యం అంటే, మరో సంస్థ అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ సీట్లు దక్కుతాయని వివరించాయి. ఇక, మరికొన్ని సర్వేలు కరుణానిధి సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టి తీరుతారంటూ నొక్కి చెప్పాయి. అయితే, ప్రసుత్తం జూనియర్ విగడన్ పత్రిక సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. ఇందుకు కారణం ఆ ఫలితాలే. తమిళనాడులో నెంబర్ ఒన్‌గా వారంలో రెండు రోజులు వెలువడే పత్రికగా జూనియర్ విగడన్ ప్రఖ్యాతి గాంచింది. ఈ సర్వే మేరకు పేద, మధ్య తరగతి, యువతరం ఓటర్ల వద్ద సేకరించిన వివరాల మేరకు ఈ సర్వే వివరాల్ని ప్రకటించి ఉన్నారు.రాష్ట్రంలోని 234 స్థానాల్లో 73 స్థానాల్లో అన్నాడీఎంకే, 64 స్థానాల్లో డీఎంకే గెలుపు ఖాయం అయిందని వివరించారు. కాంగ్రెస్ పది చోట్ల, పీఎంకే, పుదియ తమిళగం, ఐయూఎంఎల్, ఎంఎంకేలు తలా ఓ చోట్ల గెలుపు తథ్యం అని ప్రకటించారు. 151 ఒక్క స్థానాలు పోగా, మిగిలిన 83 స్థానాల్లో గెలుపు ఎవరిదీ..? అన్నది నిర్ణయించలేమని స్పష్టం చేసింది. ఇందుకు కారణం ఆ నియోజకవర్గాల్లో నువ్వా...నేనా అన్నట్టుగా సమరం ఉందని, గెలుపు ఎవరిదో అన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే అన్నట్టుగా ఆ పత్రిక స్పష్టం చేసింది. -
ఓటు వేయకుంటే చంపేస్తాడు: కెప్టెన్
కేకేనగర్: ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే తన కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఓటర్ల ప్రాణాలు తీస్తాడని ఆ పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ విచిత్ర ప్రచారానికి దిగారు. దేవుడి పేరు చెప్పి ఓటర్ల ను భయపెడుతున్న కెప్టెన్ తీరుకు ప్రజలు, రాజకీయ పార్టీల వారు విస్తుపోతున్నారు. ఓటర్లను బుజ్జగించడం, లేకపోతే భయపెట్టి ఎలాగైనా ఓట్లు సాధించడమే ధ్యేయం గా కెప్టెన్ ప్రచారం సాగిస్తున్నారు. విల్లుపురం జిల్లా ఊళుందూరుపేట నియోజక వర్గంలో విజయకాంత్ పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరునావలూర్ నియోజకవర్గంలో రాత్రి వరకు భారీగా ప్రచారం చేశారు. మడపట్టు గ్రామంలో విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియాలో వచ్చే అభిప్రాయ సేకరణను ప్రజలు నమ్మవద్దని కోరారు. వాటి అన్నింటిని అధిగమించి ప్రజా సంక్షేమ కూటమి అమోఘ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మడపట్టు ప్రాంతంలో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇక్కడ నగదు బట్వా డా జరుగుతోందా? అని కెప్టెన్ ప్రశ్నించారు. తాను పరిక్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయనని ప్రమా ణం చేసినట్లు తెలిపారు. ‘నాకు మీరు ఓటు వేయకుంటే నరసింహస్వామి మిమ్మల్ని చంపకుండా వదలడు. నా లాగా ఇతర పార్టీల వారు అవినీతి చేయమని ప్రమాణం చేయగలరా’? అని విజయకాంత్ ప్రశ్నించారు. -
తెలుగు ఓటరే కీలకం
తిరువళ్లూరు: చెన్నైకు సమీపంలోని జిల్లా తిరువళ్లూరు. పదేల్ల నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా 1996వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కాంచీపురం జిల్లాలో ఉన్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, తిరుత్తణి, పూందమల్లి, తిరువొత్తియూర్, పొన్నేరి, మధురవాయల్, మాధవరం, అంబత్తూరు, ఆవడి పది అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు. 2011లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అయితే తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మిడిపూండి నియోజకవర్గంలో మెజారిటీ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు ఎటువైపు మొగ్గితే అటువైపే విజయం దక్కే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులందరూ తెలుగు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తిరువళ్లూరులో పోటాపోటీ: జిల్లా కేంద్రమైన తిరువళ్లూరులో వ్యవసాయం, చేపల పెంపకం, చేనేత రంగాలపై ఆధారపడి జీవించే వారు అధికం. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వీరరాఘవుని ఆలయం, తొమ్మిది మూలలు ఉండే పుష్కరిణి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైన అభిప్రాయం ఉంది. 1957లో ఏర్పాటైన తిరువళ్లూరు నియోజకవర్గంలో 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఏకాంబరం మొదలియార్, అరుణాచలం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 13 సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు డీఎంకే, ఐదు సార్లు అన్నాడీఎంకే, రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి తమిళమానిల కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో 2.35 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎస్సీలు, వన్నియర్లు, మొదలియార్ ఓటర్లు అధికశాతంలో ఉండగా పూండి, తిరువళ్లూరు టౌన్, రామంజేరి, కనకమ్మసత్రం తదితర 20 గ్రామాల్లో తెలుగు ఓటర్లు అధికంగా వున్నారు. వీరు ఎటు వైపు మొగ్గితే అటు వైపు విజయం సాధించే అవకాశాలు ఉండడంతో తెలుగులోనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున భాస్కరన్, డీఎంకే తరఫున వీజీ రాజేంద్రన్, పీఎంకే తరఫున బాలయోగి, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా బాలసింగం, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసన్ సహ 21 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అన్నాడీఎంకే తరఫున ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడంతో పాటు ప్రజల్లో నేరుగా వెళ్లికలుస్తున్నారు. అక్కడక్కడ తెలుగులోనే ప్రసంగిస్తూ తెలుగు వారిని ఆకట్టుకుంటున్నాడు. తెలుగు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నా అంతర్గత కుమ్ములాట, ఎవ్వరిని లెక్కచేయడన్న ప్రచారం, వరద సాయం అందరికి అందడం లేదన్న విమర్శలు, ప్రభుత్వంపై వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దీంతో పాటు నియోజకవర్గంలో బలమైన నేతగా వున్న తెలుగు ప్రముఖుడు రమణ సైతం సహాయ నిరాకరణ భాస్కరన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రమణ రంగంలోకి దిగి చక్రం తిప్పితే అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకే కావచ్చు. డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ తిరువళ్లూరులో ప్రముఖ విద్యాసంస్థలను నడుపుతున్నాడు. విద్యావేత్తగా అందరికి సుపరిచితుడే అయినా స్థానిక నేతలను లెక్క చేయడన్న విమర్శలు ఎక్కువగానే ఉంది. దీంతో పాటు డీఎంకేలో ఉన్న కుమ్ములాటలు ఎక్కడ కొంప ముంచుతుందోన్న ఆందోళన వీజీఆర్లో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇటీవల స్టాలిన్ లాంటి స్టార్ల ప్రచారంతో నెట్టుకురావచ్చన్న ధీమాతో వున్న రాజేంద్రన్ తన భార్య ఇందిరా తెలుగు మహిళ కావడంతో వారి ఓట్లను సాధించడానికి ప్రత్యేకంగా వ్యూహరచన చేసి ఆకట్టుకుంటున్నారు. గతంలో అన్నాడీఎంకేకు అండగా నిలిచిన తెలుగు ఓటర్లు ఇందిరకు సహకరిస్తే వీజీఆర్‌కు సానుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలయోగి వన్నియర్ ఓట్లపైనే ఆధారపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గంలో తెలుగు ఓటరే కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. గుమ్మిడిపూండిలో సిట్టింగ్ గెలిచేనా : తెలుగు ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో గుమ్మిడిపూండి ప్రధానమైనది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా గుమ్మిడిపూండి వుంది. ఇక్కడ ఇసుక క్వారీపై నిరసన, తాగునీటి ఎద్దడి, విద్యుత్ సమస్యతో మూత పడిన పరిశ్రమలతో వేలాది మంది నిరుద్యోగులుగా మారడం లాంటి సమస్యలు వున్నాయి. చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన వృత్తి. 1957వ సంవత్సరంలో ఏర్పాటైన గుమ్మిడిపూండి నియోజవర్గంలో ఇప్పటి వరకు అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఏడు సార్లు, డీఎంకే నాలుగుసార్లు, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు తలోసారి విజయం సాధించారు. 2011వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి డీండీకే అభ్యర్థి సీహెచ్ శేఖర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, డీఎంకే కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్, పీఎంకే అభ్యర్థిగా సెల్వరాజ్, బీజేపీ అభ్యర్థిగా భాస్కరన్, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా గీత పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో తెలుగు ఓటర్లు వుండగా, గతంలో తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్‌కు మద్దతు పలకడంతో భారీ విజయాన్ని సాధించారు. అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సీహెచ్ శేఖర్ ప్రస్తుతం తెలుగు ఓటర్లపైనే భారీ ఆశలు ఉంచుకున్నా, అన్నాడీఎంకే అభ్యర్థి విజయకుమార్, బీజేపీ అభ్యర్థి భాస్కరన్ తెలుగు వాడే కావడంతో తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. డీఎంకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై వ్యతిరేకత, యువతలో వున్న ఫాలోయింగ్ ప్లస్‌గా మారుతుంది. అయితే శేఖర్ ఎవ్వరి మాటలను వినడన్న విమర్శలు, డీఎంకేలో సీటు ఆశించి భంగపడ్డ వేణు, టీజేఎస్ గోవిందరాజన్ లాంటి సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడం, సొంత నిర్ణయాలతో సీనియర్లను గౌరవించడన్న విమర్శలు మైనస్‌గా మారుతున్నాయి. అయితే శేఖర్ భార్య మయూరి చేస్తున్న ఇంటింటి ప్రచారం, తెలుగింటి ఆడపడుచును ఆదరించాలని విన్నూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. అన్నాడీఎంకే కోటగా చెప్పబడే గుమ్మిడిపూండిలో పార్టీకి మంచి పట్టుంది. విజయకుమార్ మృదుస్వభావి, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉండడంతో పాటు అనవసర విషయాల్లో తలదూర్చే వ్యక్తి కాదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడం ప్లస్. దీంతో పాటు తెలుగు సంఘాలతో విజయకుమార్‌కు వున్న వ్యక్తిగత పరిచయం. తెలుగు ప్రముఖులు జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, రాజమాణిక్యం, గోపాల్‌నాయుడు లాంటి తెలుగు వ్యక్తులు అండదండలు పుష్కలంగా ఉండడంతో విజయకుమార్ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాస్కరన్ సైతం తెలుగు ఓటర్లను నమ్ముకున్నారు. పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొత్తానికి తిరువళ్లూరు, గుమ్మడిపూండిలో తెలుగు ఓటర్లు కీలకం. వారు ఎటువైపు మొగ్గితే వారే గెలిచే అవకాశం ఉండడడంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తెలుగు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
రజనీ దారెటు?
* ఎన్నికలపై మౌనం * అదే బాటలో అభిమాన సంఘాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంతకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళానాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు. ‘తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అంటూ డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా 1996లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఆనాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నికల సమయంలో అటువంటి చురుకైన వ్యాఖ్యానాలు రజనీ చేయలేదు. 2001, 2006, 2011లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పార్టీలు ప్రయత్నించాయి. అయితే రజనీకాంత్ తనదైన శైలిలో మౌనం పాటించారు. క్రమేణా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సమదూరం పాటించడం ప్రారంభించారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నోరు మెదపలేదు. నేడు కూడా మౌనమేనా? ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. రజనీ దారెటు అని ఆయన అభిమాన సంఘం నేత ఒకరిని ప్రశ్నించగా, తమ ఓటు హక్కు వినియోగంపై ఆయన ఎలాంటి నిబంధన విధించలేదు, ఇష్టపడిన పార్టీకి ఓటు వేయండి అనే స్వేచ్ఛను ఇచ్చారని తెలిపాడు. తమ అభిమాన నేత రజనీకాంత్ మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రముఖ నటీనటులు ఎందరో మౌనం పాటిస్తున్నారని చెప్పాడు. -
ఉపన్యాసాలకు విజయకాంత్ తగడు
సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా మదురై: వేదికలపై ప్రసంగించేందుకు విజయకాంత్ తగిన వాడు కాదని ఆయన మాటలు అతనికే అర్థం కావని సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన గురువారం మదురై అన్నాడీఎంకే నార్త్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మేయర్ రాజన్ చెల్లప్పకు మద్దతుగా శరత్‌కుమార్ మదురై పుదూర్, సెల్లూర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. డీఎంకే కోశాధికారికి గణాంకాలు కూడా సరిగ్గా తెలియవన్నారు. కచ్చదీవిని ధారాదత్తం చేసిన ఘనత డీఎంకేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధించడం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. -
జయకు పోటీగా 44 మంది
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉత్కంఠ భరితంగా సాగుతున్న తమిళనాడు ఎన్నికల రణరంగంలో 3800 మంది పోటీకి నిలిచారు. మొత్తం 234 స్థానాల్లో 3800 మంది తలపడుతున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గత నెల 22వ తేదీన మొదలైన నామినేషన్ల ఘట్టంలో 234 స్థానాలకు 7156 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగగా 2975 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 4181 నామినేషన్లు అర్హత పొందాయి. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ అంకం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు, వారి డమ్మీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే ప్రధాన పార్టీల్లో సైతం డమ్మీ అభ్యర్థులు అసలు అభ్యర్థులుగా మారిపోయారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఉపసంహరణల అంకంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎందరో తేలిపోయింది. 300 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మొత్తం 234 స్థానాలకు 3800 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీచేస్తున్న ఆర్కేనగర్లో 45 మంది, డీఎంకే అధినేత పోటీపడుతున్న తిరువారూరులో 15 మంది, డీఎండీకే అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి విజయకాంత్ రంగంలో ఉన్న ఉళుందూర్‌పేటలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే చెన్నైలోని 16 నియోజకవర్గాల నుంచి 378 మంది తలపడుతున్నారు. -
రాష్ట్రానికి ఢిల్లీ పెద్దలు
సాక్షి, చెన్నై : ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఓట్ల వేటకు ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీల పర్యటనలు ఖరారు అయ్యాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పర్యటనకు సిద్ధం అయ్యారు. అలాగే, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు రాష్ర్టంలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మరి కొన్ని గంటల్లో ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించబోతున్నారు. వాతావరణం వేడెక్కడంతో ఓటర్ల ప్రసన్నంలో అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీ అధినాయకులు ప్రచారంలో దూసుకెళుతుంటే, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ పెద్దలు రాష్ర్టం వైపుగా దృష్టి మరల్చి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల ఎనిమిదో తేదీన కన్యాకుమారి ప్రచార బహిరంగ సభతో పాటుగా మదురై, కోయంబత్తూరులలో పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇక, తమ అభ్యర్థులు, డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కరుణానిధితో కలసి ఒకే వేదిక మీద దర్శనం ఇచ్చేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధమయ్యారు. ఈనెల ఐదో తేదీన ఐల్యాండ్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో తాను సైతం అంటూ ప్రచారానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు. ఈనెల ఏడో తేదీన చెన్నై, తిరువణ్ణామలై, కోయంబత్తూరులలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. అలాగే, ఈనెల 13న దక్షిణ తమిళనాడులో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే,ఆయన పర్యటన సాగే ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. అదే విధంగా రాహుల్, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఒకే వేదిక మీద నుంచి ఓటర్లకు పిలుపు నిచ్చేందుకు తగ్గ కసరత్తులకు కాంగ్రెస్ వర్గాలు చర్యలు చేపట్టారు. అయితే, ఇది సాధ్యం అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో కేంద్ర మంత్రులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఆదివారం కరూర్, తిరుచ్చిల్లో ఆయన పర్యటన సాగింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లను టార్గెట్ చేసి ఆయన ప్రసంగం సాగుతున్నది. అలాగే, మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రచార బాటకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో జరిగిన ప్రచార సభలో అక్కడి కాంగ్రెస్, ఎన్ఆర్ కాంగ్రెస్‌లను టార్గెట్ చేసి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాష్ర్ట నేతలు ఉరకలు, పరుగులు తీస్తున్న సమయంలో, ఢిల్లీ పెద్దలు మోదీ, సోనియా, రాహుల్ సైతం మొహరించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమరం మరింతగా రాజుకుంది. -
ఎన్నికల పోరు...తారల హోరు
అన్ని పార్టీల్లోనూ కనబడుతోన్న తారల సందడి రాజకీయాలకు తోడవుతోన్న సినీ గ్లామర్ కాంగ్రెస్‌కు మద్దతుగా కుష్బూ, అన్నాడీఎంకే మద్దతుగా శరత్‌కుమార్ ప్రచారం తమిళసినిమా: ఎన్నికలు రాజకీయ నాయకులకు మాత్రమే కాదు సినిమా తారలకూ హడావిడే. ఎందుకంటే ఈ రెండు రంగాలను ఇప్పుడు వేరుగా చూడలేని పరిస్థితి కాబట్టి. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వాన్ని ఏలుతున్న వారు, ఏలాలని ఆశపడుతున్న వారిలో అధిక శాతం చిత్ర పరిశ్రమకు చెందిన వారేనన్నది గమనార్హం. ఇక్కడ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల సమరానికి సరిగ్గా 15 రోజులే ఉంది. ఈ పోరులో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, బీజేపీ తలపడుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎవరి ఊహలకనుగుణంగా వారు ఇప్పటికే ప్రచారభేరి మోగిస్తున్నారు. వారికి సినీ తారల కళ తోడవుతోంది. వీరు తమ గ్లామర్ అనే ఆయుధంతో ప్రత్యర్థులపై అస్త్రశస్త్రాలు సంధించడానికి సిద్ధం అయ్యారు. ఏ తారలు ఏ పార్టీకి మద్దతు: దాదాపు అన్ని పార్టీలలోనూ తారల సందడి కనిపించడం విశేషం. అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా నటుడు రామరాజన్, ఆనంద్‌రాజ్, సెంథిల్, మనోబాలా, పొన్నంబలం, గుండు కల్యాణం, సింగముత్తు, వైయాపురి, నటి వింధ్య, ఫాతిమాబాబు అంటూ పెద్ద పటాలమే ప్రచార గోదాలోకి దిగింది. వీరంతా 234 శాసనసభ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సమత్తువ కట్చి నేత శరత్‌కుమార్ కూడా అన్నాడీఎంకే పార్టీ గెలుపునకు తన వంతు ప్రచారం చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న తిరుచెందూర్ సెగ్మెంట్లో ఆయన విజయానికి నటి రాధికా శరత్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు. నటి కుష్భు ప్రచారం: ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న నటి కుష్భు కాంగ్రెస్-డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఇటీవలే డీఎంకే తీర్థం పుచ్చుకున్న బుల్లితెర, వెండితెర నటుడు ఇమాన్ అన్నాచ్చి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నటుడు వాసు విక్రమ్ బోస్ వెంకట్ తదితరులు ఆ పార్టీకి మద్దతుగా గళమెత్తుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి మద్దతుగా సంగీత దర్శకుడు గంగైఅమరన్, నటి గాయత్రి రఘురామ్ తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి నడుం బిగించారు. -
మౌనంగా రంగస్వామి!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం రంగస్వామి మౌనం ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. నామినేషన్‌కు శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో సీటు ఆశిస్తున్న వారు సందిగ్ధంలో పడ్డారు. గురువారం అయినా, జాబితా విడుదల అయ్యేనా అన్న ఎదురు చూపుల్లో పడ్డారు. పుదుచ్చేరి కాంగ్రెస్‌ను చీల్చి ఎన్ఆర్ కాంగ్రెస్‌ను రంగస్వామి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2011 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆవిర్భవించిన ఎన్ఆర్ కాంగ్రెస్ తన సత్తాను చాటుకుంది. అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించి ముప్పై నియోజకర్గాల్ని కల్గిన పుదుచ్చేరిలో అధికార పగ్గాల్ని రంగస్వామి చేపట్టారు. అయితే, తమకు కావాల్సిన మెజారిటీ రావడంతో అన్నాడీఎంకేను పక్కన పడేశారు. ఇప్పుడు అదే ఆయన్ను వెంటాడుతున్నది. అన్నాడీఎంకే హ్యాండివ్వడంతో, బీజేపీతో కలసి పయనం సాగించేందుకు నిర్ణయించి వెనక్కు తగ్గారు. చివరకు ప్రజాసంక్షేమ కూటమి అని ఆలోచించి మనస్సు మార్చుకున్నారు.ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రంగస్వామికి తప్పలేదు. ఇన్నాళ్లు పొత్తు ప్రయత్నాలకే సమయాన్ని ఎక్కువగా రంగస్వామి వెచ్చించడంతో ప్రచార ఆర్భాటాలు, అభ్యర్థుల ఎంపిక ఎక్కడ వేసిన గంగొళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇక్కడ ఓట్ల వేటలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, బీజేపీ కూటమిలు దూసుకెళుతుంటే, ఇంత వరకు అభ్యర్థుల జాబితా వెలువడక పోవడంతో ఎన్ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇక, గురువారం కూడా జాబితా వెలువడని పక్షంలో రంగస్వామి నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఉత్సాహంగా అందరి కన్నా ముందుగా ఎన్నికల్లో దూసుకెళ్లిన రంగస్వామి , ఈ సారి మౌనంగా ఉండడంతో పుదుచ్చేరి రాాజకీయాల్లో చర్చ బయలు దేరింది. అయితే, రంగస్వామి మౌనం వెనుక కారణాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి పదవుల కోసం తనను ఉక్కిరి బిక్కిరి చేసిన వాళ్లు, మళ్లీ సీటు ఆశిస్తుండడం, మంత్రులు కొందరు మళ్లీ రేసులో దిగేందుకు సిద్ధ పడటం వెరసి రంగస్వామి ఆచీతూచీ అడుగులు వేయడానికి సిద్ధమయ్యార ని చెబుతున్నారు. పలువురు మాజీలకు సీట్లు ఇవ్వకూడదని రంగస్వామి నిర్ణయించి ఉన్నారని, అలాగే,మరి కొందరికి చెక్ పెట్టే విధంగా, సరికొత్త అభ్యర్థులతో రేసులో దిగేందుకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారని చెబుతున్నారు. అయితే, మాజీలకు సీట్లు నిరాకరించ బడ్డ పక్షంలో ఎన్నికల వేళ చివరిక్షణంలో ఎన్ఆర్ కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రకంపనలు బయలు దేరుతాయో అన్నది వేచి చూడాల్సిందే. -
స్టాలిన్‌కు సొంత కారు లేదట
సాక్షి ప్రతినిధి, చెన్నై : డీఎంకే కోశాధికారి స్టాలిన్ తనకు కనీసం సొంతకారు కూడా లేదని తెలిపారు. చెన్నై జిల్లా కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్టాలిన్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.13.23 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద రొక్కంగా రూ.50 వేలు, తన భార్య దుర్గ వద్ద రూ.25 వేలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. తనకు చెందినవిగా బంగారు, వెండినగలు లేవని, అయితే తన భార్య దుర్గకు మాత్రం 720 గ్రాముల పాత బంగారు నగలు ఉన్నాయని చెప్పారు. రూ.80.33 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని, భార్య దుర్గకు రూ.31.25 లక్షల ఆస్తి ఉందని తెలిపారు. ప్రజా సేవ చేయడమే తన వృత్తిగా పేర్కొన్న స్టాలిన్, తన భార్య ఒక ప్రయివేటు సంస్థకు మేనేజర్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
మద్య నిషేధం
రాష్ట్రంలో అన్ని పార్టీలు సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అందుకుని ఉన్నా యి. ఇందులో బీజేపీ కూడా ఒకటి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలి పలుకుగా అదే నినాదాన్ని అందుకున్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. తమకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలని, తమిళనాడును సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఈసందర్భంగా నితిన్ గడ్కారి హామీ ఇచ్చారు. సాక్షి, చెన్నై : చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 150కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. తమ పార్టీతో పాటుగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా కమలనాథులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఇస్తే, చేసి చూపించే అంశాలతో కూడిన మేనిఫెస్టోను కమలనాథులు సిద్ధం చేశారు. దీనిని టీ నగర్లో జరిగిన కార్యక్రమంలో గురువారం సాయంత్రం కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారి విడుదల చేయగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ అందుకున్నారు. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన ప్రసంగంలో తమకు అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇక, మేనిఫెస్టోను సిద్ధం చేసిన కమిటీని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా అభినందించారు. తదుపరి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. తమిళనాడులో బిజేపికి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడాలని, బిజేపి పాలిత ప్రాంతాల్లో ఏమేరకు అభివృద్ధి పనులు సాగుతున్నాయో, దానికి రెండింతలుగా నిధుల్ని తమిళనాడులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరరావు, సీనియర్ నేత ఇలగణేషన్ పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన అంశాలు అనేకం ఉండడం గమనార్హం. మేనిఫెస్టోలో కొన్ని : - అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం - రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ - అన్నదాతలకు పెద్ద పీట, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ - లోకాయుక్త ఏర్పాటు - కొత్త పారిశ్రామిక విధానం - విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం - జౌళి పార్కుల ఏర్పాటు, ఇళ్లు లేని నేత కార్మికులకు సొంత గృహాలు, ఉదయ్ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం - రెండేళ్లలో రాష్ర్టంలో మిగులు విద్యుత్ లక్ష్యం - రాష్ట్రంలో క్రీడావర్సిటీ ఏర్పాటుకు, జిల్లాకో క్రీడా కేంద్రం - శాంతి వనంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, రాజకీయ జోక్యం లేని విధంగా కొత్త విధానాలు - ఆదిద్రావిడ సంక్షేమ శాఖ , అరుంధతీయులకు ప్రత్యేక బోర్డు - సీబీఎస్ఈ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలు. నిర్భంధ తమిళంపై పరిశీలన(మాతృభాషల్లో చదువుకునేందుకు వీలుగా అవకాశం) - తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణగదొక్కడం లక్ష్యంగా కఠిన నిర్ణయాలు. -మహిళా సంక్షేమం లక్ష్యంగా పథకాలు, పేద యువతుల వివాహానికి ఎనిమిది గ్రాముల బంగారు పథకం, ఉపాధి కల్పన దిశగా శిక్షణా కేంద్రాలు. ప్లస్ టూ వరకు చదువుకునే పేద విద్యార్థినులకు నెలకు రూ. ఐదు వేలు ప్రోత్సాహం. విద్యార్థినులకు ప్రత్యేకంగా అన్నిప్రాంతాల్లో హాస్టళ్లు. - జాలర్ల సంక్షేమం లక్ష్యంగా చర్యలు, దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారం - నీటివ్యాపారాన్ని అడ్డుకునే విధంగా రోజుకు 20 లీటర్ల నీటి క్యాన్ పంపిణీ - ఆలయాల పరిరక్షణ, మతమార్పిడి అడ్డుకట్ట, ఆలయాల్లో దర్శనాలకు రుసుం రద్దు. ఆక్రమణలో ఉన్న ఆలయాల ఆస్తుల స్వాధీనం - అన్ని రాష్ట్ర రహదారులు ఫోర్ వేలుగా మార్పు - రేషన్‌కు స్మార్ట్ కార్డు, అన్ని రకాల వస్తువులు ఎల్లప్పుడు లభించే విధంగా చర్యలు - జిల్లాకు ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులు. ఉచిత వైద్యం. - ప్రభుత్వ గుప్పెట్లోకి ఇసుక విక్రయాలు, ధాతు ఇసుక, గ్రానైట్ క్వారీలు కూడా. -2017 సంక్రాంతి పర్వదినంలో మళ్లీ జల్లికట్టు -
ఆమెకు అనారోగ్యం, ఆయనకు వృద్ధాప్యం!
తమిళనాడు రాజకీయాలు చాలా విలక్షణమైనవి. తమిళ పరిపాలన పీఠంపై సినిమా ప్రభావం ఎప్పుడు విస్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం సీఎం అభ్యర్థులుగా బరిలో నిలిచిన ముగ్గురు ప్రధాన పార్టీల నేతలకూ సినీ నేపథ్యముంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన అన్నాడీఎంకే, డీఎంకే ముఖ్యమంత్రులే గత 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఈ రెండు పార్టీల ఆధిపత్యాన్ని, సినీ ఛరిష్మాను అధిగమిస్తానంటున్నారు పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాస్. పార్టీ పరంగా కొన్ని బలహీనతలు ఉన్నా అన్నాడీఎంకే, డీఎంకే కంచుకోటలను బద్దలు కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృతిరీత్య వైద్యుడు, టెక్ శావీ అయిన అన్బుమణి ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కులవాద పార్టీ ముద్రపడిన పీఎంకేను ప్రజలందరికీ చేరువ చేస్తానని, మంచి పరిపాలన కోసం యువతకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం అభ్యర్థులుగా బరిలోకి దిగిన జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్ గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'సీఎం అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆ ముగ్గురిని నేను గౌరవిస్తాను. కానీ, వారు తమ దైనందిన కార్యకలాపాలు తాము సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో సీఎం తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. (ఆరోగ్య కారణాలతో జయలలిత ఇంటికే పరిమితమయ్యారు). 93 ఏళ్ల నాయకుడు (కరుణానిధి) కూడా బరిలోకి దిగారు. ఆయన రిటైరైతే మంచిదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి (విజయ్‌కాంత్)కి పొందిక లేదు. ఆయన ప్రజలు చెప్పేది వినడు. ప్రజలకు ఆయన చెప్పేది అర్థం కాదు. ఈ నేపథ్యంలో వృత్తిరీత్య డాక్టర్ అయినా నా పట్ల ప్రజలకు విశ్వాసముంది. కేంద్రమంత్రిగా నా సత్తాను చాటాను. రాష్ట్రంలోని 2.5 కోట్ల యువ ఓటర్లకు నేను ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని. వారి ఆకాంక్షలు నిలబెట్టేవిధంగా పరిపాలిస్తాను. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రజల మన్నన పొందుతాను' అని అన్బుమణి ధీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యామ్నాయం మేమే..
‘ఆడ లేక మగ’ అన్న చందంగా తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఐదు దశాబ్దాలుగా అలవాటుగా మారిపోయింది. పాలిటిక్స్ తెలియని పిల్లోడిని అడిగినా జయలలిత లేదా కరుణానిధి సీఎం అని ఇట్టే చెబుతారు. ఉదయించే సూర్యునికి ఇక శాశ్వత గ్రహణమే, రెండాకులు ఇక శాశ్వతంగా చిరిగిపోయినట్లే అంటున్నారు పాట్టాలిమక్కల్ కట్చి(పీఎంకే) యువజన విభాగ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్. రాజకీయాల్లో పదవుల కోసం ఆరాటపడే ఈరోజుల్లో వెత్తుక్కుంటూ వచ్చిన అవకాశాలను సైతం కాదన్న డాక్టర్ రాందాస్ తనయుడే ఈ అన్బుమణి. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు, మార్పును కోరుతున్నారు. ఇదిగో మేమున్నామని ముందుకొచ్చింది పీఎంకే. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ అంటున్నారు. ఈ సందర్భంగా సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. - సాక్షి ప్రతినిధి, చెన్నై * హామీలు కాదు, విశ్లేషణలతో ప్రజలను ఒప్పించా * లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకున్న డీఎంకే, అన్నాడీఎంకేలు నిషేధం విధిస్తాయా? * రైతు సంక్షేమంలో వైఎస్ఆర్ పాలనే నాకు ఆదర్శం * పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ రాందాస్ సాక్షి: రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధే పొత్తుల కోసం వెంపర్లాడిన తరుణంలో మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధం కావడంలోని మీ ధైర్యం? అన్బుమణి: ఈ ప్రశ్నకు కొంచెం పెద్ద జవాబే చెప్పాల్సి ఉంటుంది. అన్నిపార్టీలు ఎన్నికలు సమీపించిన తరువాత ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. నేను ఏడాది క్రితమే క్యాంపెయిన్ ప్రారంభించా. సీఎం అభ్యర్థిగానే ప్రజల్లోకి వెళ్లాను. దాదాపుగా రాష్ట్రమంతా చుట్టేశాను. 22 జిల్లాల్లో లిక్కర్ వ్యతిరేక ప్రచారాలు చేసినపుడు మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడమేకాదు పీఎంకేలో చేరిపోయారు. ఏడు రోజులు, ఏడు సిటీలు, ఏడు సమస్యలు అంటూ సరికొత్త విధానంతో ప్రజలవద్దకు వెళ్లాను. ఒక్కో సిటీలో నాలుగు గంటలపాటు ప్రజలతో పరస్పర సంభాషణ సాగిం చాను. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్ల ప్రజలు మార్పు కోరుతున్నట్లు స్పష్టమైంది. డీఎంకే లేదా అన్నాడీఎంకేలు యాభై ఏళ్లుగా సాగించిన పాలనతో ప్రజలు విసిగిపోయినట్లు స్పష్టంగా గోచరించింది. ప్రజలు మార్పుకోరుకున్నపుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో డిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాలే ఉదాహరణ. సాక్షి: పార్టీకి మరింత బలం చేకూరేలా పొత్తులకోసం ఎందుకు ప్రయత్నించలేదు.? అన్బుమణి: ఆ తప్పు జీవితంలో చేయం. రెండుసార్లు ఆ తప్పుచేశాం...ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివచ్చింది. ఒకసారి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, మరోసారి భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో ఎన్డీఏతో పొత్తుపెట్టుకుని జీవితంలో పెద్ద పొరపాటు చేశాము. చేసిన తప్పుకు ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాము. కేడర్ ఒత్తిడి మేరకు అలాంటి నిర్ణయం తీసుకవాల్సి వచ్చింది. ఆ తప్పు చేయకుంటే ఈరోజు రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉండేది. సాక్షి: అన్నాడీఎంకే, డీఎంకేల కంటే మెరుగైన పాలనను మీరు ఇస్తారని ఓటర్లను ఎలా నమ్మిస్తారు ? అన్బుమణి: ఆదర్శమైన పాలనకు ఆరు సూత్రాలు. ఆదర్శవంతమైన పాలనకు అరుసూత్రాలు సిద్ధం చేసుకుని వాటిని ఎలా అమలు చేయగలుతామో ప్రజలకు వివరించాను. లిక్కర్ , అవినీతి నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు ...ఈ ఆరు సూత్రాలతో ఆదర్శమైన పాలన అందిస్తాము. కేవలం చెప్పడం కాదు, ఎలా సాధించగలుగుతామో ప్రజలకు సశాస్త్రీయంగా వివరించాను. ప్రభుత్వ లావాదేవీలన్నీ కంప్యూటీకరణ చేస్తాం. పేపర్ అనేది లేకుండా ఈ గవర్నర్సెను ప్రవేశపెడతాం. ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫోన్ ద్వారా ప్రజలు సీఎం సెల్‌కు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్య ఉంటుంది. ప్రతిపక్ష నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ స్వయంగా కలుస్తాను. కేబినెట్ సమావేశాలను సచివాలయంలోగాక జిల్లాల్లో నిర్వహిస్తాను. నాతోపాటూ మంత్రులంతా పాల్గొని ఆయా జిల్లాల సమస్యను చర్చించి వెంటనే నిర్ణయం తీసుకుంటాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జిల్లాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళతా. సాక్షి: అనేక ఆకర్షణీయమైన పథకాలు, ఉచిత వస్తువులకు అలవాటుపడిన ఓటర్లు మీసుపరిపాలనను అర్థం చేసుకుంటారా? అన్బుమణి: ఉచితాల ప్రసక్తేలేదు. దానికోసం వెచ్చించే నిధులను మరో శాశ్వత అభివృద్ధికి వినియోగిస్తాం. మిక్సీలు, గ్రైండర్లు ఉచితంగా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు దూరంగా ఉంటాము. ఆ నిధులను మరో మంచి కార్యక్రమాలకు వినియోగిస్తాం. సాక్షి: ఇరుగు పొరుగు జిల్లాలతో సాగునీటి సమస్యల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు. ? అన్బుమణి: సాటి ప్రభుత్వాలపై సవాల్ చేసే ధోరణి సరికాదు. సామరస్యంగా మాట్లాడితే సులువుగా అంగీకరిస్తారు. వ్యవసాయానికి సాగునీరు ఎంతో ఆధారం, ఈ విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలను స్వయంగా వెళ్లి సామరస్య ధోరణిలో వివాదాలు పరిష్కరిస్తాను. నాకు ఈగో లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనే పొరుగురాష్ట్రాల సీఎంల వద్దకు వెళతాను. పరిష్కారం కోసం ఎవరి వద్దకైనా వెళ్లేందుకు నేను సిద్ధం. అంతే గాక నదులు, చెరువులు తదితర నీటి పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున చెక్‌డ్యాంలను నిర్మించడం ద్వారా నీటి వనరులను కాపాడుకుంటాము. సాక్షి: అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు అన్బుమణి నుండి ఏమేరకు ఆశించవచ్చు.? అన్బుమణి: వైఎస్ఆర్ పాలనే ఆదర్శం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఆదర్శం. రైతు సంక్షేమం కోసం ఆయన రాజకీయజీవితాన్నే అంకితం చేశారు. మాది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. రైతుల కష్టనష్టాలపై పూర్తిగా అవగాహన ఉంది. రాష్ట్ర జనాభాలో 60 శాతం రైతన్నలే. అన్బుమణి అధికారంలోకి వస్తే తమకు మేలు జరగడం ఖాయమని వారు నమ్ముతున్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, వాటర్ మేనేజిమెంట్ ఇలా వ్యవసాయాన్ని మూడుగా విభజించి ముగ్గురు మంత్రులను నియమిస్తాం. వైఎస్ఆర్ తన హయాంలో ఏపీ వార్షిక బడ్జెట్లో వైఎస్ఆర్ వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించారు. 35 హెక్టార్ల సాగుభూమిని 75 లక్షల హెక్టార్లకు పెంచగలిగారు. ఇదే పద్ధతిని నా పాలనలో అనుసరిస్తాను. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 48 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని కోటి హెక్టార్లకు పెంచడం నా లక్ష్యం. ఇందులో నీటి ఆధారిత 33 లక్షల హెక్టార్లను 60 లక్షల హెక్టార్లకు పెంచుతాను. రూ.55వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ నిర్ణయం. సాక్షి: వ్యవసాయం సరే గిట్టుబాటు దర మాటేమిటి ? అన్బుమణి: అందరికీ అన్నంపెట్టే రైతులు తాము పండించిన ధాన్యానికి తాము ధర నిర్ణయించుకోలేని పరిస్థితి నిజంగా దుర్భరమే. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు వ్యవసాయ దిగుబడుల ధరను రైతులు, నిపుణులే నిర్ణయిస్తారు. ప్రభుత్వం కేవలం మానిటరింగ్ చేస్తుంది. 30 జిల్లాల్లో స్పెషల్ ఆగ్రో ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తాను. అలాగే ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం. సాక్షి: మీ ప్రణాళికను వింటూ ఉంటే మాకు నమ్మశక్యంగానే ఉంది. మరి ఓటర్ల మాటేమిటి ? అన్బుమణి: రాష్ట్రంలో 5.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది తటస్థ ఓటర్లు. అంటే పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించేవారు. 35 ఏళ్లకు అటు ఇటుగా ఉండే యువత 2.5 లక్షల వరకు ఉన్నారు. వీరంతా నా ఆలోచనను విశ్వసిస్తున్నారు. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ధర్మగిరిలో ఎంపీగా గెలిచానంటే సీనియర్ సిటిజన్లు, తటస్థ ఓటర్లే ప్రధాన కారణం. అలాగే మహిళలు మద్య నిషేధం కోరుతున్నారు. సాక్షి: కులపరమైన ముద్రను అధగమించారా? అన్బుమణి: వన్నియర్ల సమస్యలపై పోరాడాం. అంతమాత్రానా మాది కులపరమైన పార్టీ కాదు. మా పార్టీలో అన్ని కులాలు, మతాలవారు ఉన్నారు. సాక్షి: రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో మీరు ఎన్నిగెలుస్తారని ధీమాతో ఉన్నారు.? అన్బుమణి: 150 సీట్లు గ్యారంటీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం. సాక్షి: మీకు అంతటి నమ్మకం ఎలా వచ్చింది. ? అన్బుమణి: 1989లో పార్టీని ప్రారంభించి ఈ 26 ఏళ్ల కాలంలో ఏటా షాడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. అంటే మా పార్టీ అధికారంలో ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయి, దేనికి ఎంత ప్రధాన్యత అనేది ప్రజలకు చెబుతూనే ఉన్నాము. నిర్మాణాత్మకమైన రాజకీయాలను నడుపుతున్నాము. అందుకనే పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాము. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ హత్యోదంతం హవాలోనూ ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్నాము. 1996లో నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా 8.5 శాతం ఓట్లు సాధించాం. మధ్యలో యూపీఏ, ఎన్డీఏలతో పొత్తులకు పోకుండా అదే పోకడను కొనసాగించి ఉంటే ఈపాటికి అధికారంలోకి వచ్చేవారం. సాక్షి: తమిళనాడులో సంఖ్యాపరంగా ద్వితీయ పౌరులైన తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యపై మీ సమాధానం ఏమిటి? అన్బుమణి: తమిళనాడు ప్రజల్లో తెలుగువారు కూడా ఒక భాగమే. రాష్ర్టంలో తమిళ జనాభా తరువాత తెలుగువారే అధికం, రాష్ట్రాలుగా విడిపోయాముగానీ ఒకప్పుడు అందరం ఒకటే కదా. తమిళనాడు నుండి ఏపీ, తెలంగాణ గా విడిపోయినా ఇక్కడ స్థిరపడిపోయిన తెలుగువారికి సమగౌరవం ఇవ్వడం మా విధి. మా ప్రభుత్వం వస్తే ఈ విషయాన్ని స్పష్టంగా పాటిస్తాం. నిర్బంధ తమిళం వంటి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం. సాక్షి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అనేది ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన నినాదంగా మారిపోయింది. అన్నిపార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ పార్టీ స్టాండ్ ఏమిటి ? అన్బుమణి: రాష్ట్రంలో అనాది నుంచి అంటే గత మూడు దశాబ్దాలుగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నది మా పార్టీ మాత్రమే. అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాం. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ఉండే 600 టాస్మాక్ దుకాణాలను తమ ఉద్యమాలతో ఇటీవల మూయించాం. ఒక్క లిక్కర్ మాత్రమే కాదు సిగరెట్ సైతం అనారోగ్యమని భావించేవారం. అందుకే గతంలో కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిగా పొగత్రాగడం (సిగరెట్) ఎంతటి చేటో తెలియజెపుతూ మంచి ఫలితాలను రాబట్టాను. కేంద్రమంత్రిగా మంచి చేశాడు, సీఎం అయితే కూడా అలానే చేస్తాడు, సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. సాక్షి: మరి ఇదే వాగ్దానాన్ని జయలలిత, కరుణానిధి కూడా ఇచ్చారు కదా ? అన్బుమణి: సంపూర్ణ మద్య నిషేధం విషయంలో జయలలిత, కరుణ ఇద్దరూ సమానులే. అధికారంలో ఉన్నపుడు మద్యాన్ని ఏరులై పారించి నేడు మోసపూరిత మాటలు వల్లిస్తున్నారు. మద్య నిషేధం అమలు సాధ్యం కాదని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జయలలిత నేడు ఎన్నికల వేళ హామీ ఇవ్వడం ప్రజలను చీట్ చేయడమే అవుతుంది. జయలలితలో ఆ ఉద్దేశమే ఉండి ఉంటే ఐదేళ్ల క్రితం ఆమె అధికారంలోకి వచ్చినపుడే చేసి ఉండవచ్చు. అలాగే కరుణానిధి సైతం గత 20 ఏళ్ల కాలంలో మద్య నిషేధంపై ఆరుసార్లు ప్రకటించారు. నేడు ఏడోవాగ్దానంతో ఎన్నికలకు దిగుతున్నాడు. రాష్ట్రంలో 12 లిక్కర్ ఫ్యాక్టరీలు ఉండగా వాటిల్లో 6 డీఎంకే వారివి, 3 అన్నాడీఎంకే, 2 కాంగ్రెస్ వారివి. వీరా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం సాధించేది. సాక్షి: పీఎంకే వ్యవస్థాపకులైన డాక్టర్ రాందాస్ రాజకీయాల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీచేయక పోవడానికి కారణం ఏమిటి ? అన్బుమణి: పదవులకు నాన్న దూరం 40 ఏళ్లక్రితం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీలోకి అడుగుపెట్టనని నిర్ణయించుకున్నారు. నైతిక విలువలు, సిద్ధాంతపరమైన రాజకీయాలు ఆయనకు ఇష్టం. అందుకే ఇంతవరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాజ్‌పేయి,రాజీవ్‌గాంధీ స్వయంగా ఆహ్వానించినా సున్నితంగా నిరాకరించారు. సాక్షి: ఆల్‌ది బెస్ట్ సార్. అన్బుమణి: ధ్యాంక్స్. -
ఆ పన్నెండు మంది ఎవరు..?
- నీలగిరుల్లో పోస్టర్లు - రైల్వే ట్రాక్ పై పేలుడు అటవీ గ్రామాల్లో ఎన్నికల్ని బహిష్కరిద్దామన్న నినాదాలతో పోస్టర్లు వెలిసి ఉండడం పోలీసు యంత్రాంగానికి షాక్ ఇచ్చేలా చేసింది. పన్నెండు మంది తుపాకులతో తమ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఎన్నికల్ని బహిష్కరించాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా నీలగిరుల్లోని పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో అప్రమత్తం అయ్యారు. ఆ పన్నెండు మంది ఎవరు అన్న ప్రశ్న బయలు దేరిన సమయంలో ధర్మపురి సమీపంలో రైల్వేట్రాక్‌పై బాంబు పేలుడు జరగడం ఉత్కంఠను రేపుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇటీవల కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో వీరి కదలికల మీద సమాచారాలు పెరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక సంయుక్తంగా కూంబింగ్ సాగిస్తున్నా, జాడ మాత్రం కాన రాలేదు. అయితే, ఇటీవల నీలగిరుల్లోని దట్టమైన అడవుల్లో కాల్పులు సైతం జరగడం, గాయపడ్డ వాళ్లు ఏమయ్యారో అన్న ఆచూకీ ఇంత వరకు చిక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు చాప కింద నీరులా వ్యూహ రచనలు చేసి ఒక్కసారిగా తమ ఉనికి చాటుకునేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుతం కొన్ని సంఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసు యంత్రాంగం షాక్‌కు గురి కాక తప్పలేదు. ఓ వైపు కూంబింగ్ సాగుతున్నా, మరో వైపు మావోయిస్టులు తరచూ కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షం అవుతున్నట్టు సమాచారాలు వస్తుండడంతో క్యూబ్రాంచ్ వర్గాలు డైలమాలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో గత రెండు మూడు రోజులుగా నీలగిరి జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో పన్నెండు మంది తుపాకులతో సంచరిస్తున్నట్టుగా వచ్చిన సంకేతాలతో మరింత అప్రమత్తం అయ్యారు. పోస్టర్లు సరే.. వాళ్లెక్కడ నీలగిరుల్లో అటవీ గ్రామాల సంఖ్య ఎక్కువే. కేరళ- తమిళనాడును అనుకుని ఉండే గ్రామాల్లో అయితే, ఎవర్నీ గుర్తు పెట్టడం కూడా వీలు పడదు. అలాంటి వాతావరణం, పరిస్థితులు అక్కడ ఉంటాయి. కొన్ని చోట్లకు ఈవీఎంలు తరలించాలంటే మరీ కష్టమే. ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజల్ని ఎన్నికల బహిష్కరణ పిలుపుతో, వారి హక్కుల్ని గుర్తు చేస్తూ, పన్నెండు మందితో కూడిన బృందం సంచరిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ పన్నెండు మంది తుపాకులతో గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల్ని బహిష్కరిద్దామని, మన భూమి, మన అడవులు, మన జీవనం అన్న బోధనల్ని వల్లిస్తూ వస్తున్నట్టు సమాచారం. శనివారం రాత్రి ఈ బృందం కోల కొంబై గ్రామాల్లో సంచరించడమే కాకుండా, అక్కడడక్కడ కరపత్రాలు వదలి వెళ్లడం, కొన్ని చోట్ల ఏకంగా పోస్టర్లను అంటించి ఉంది. కోల కొంబైలో మావోయిస్టులు ఉన్న సమాచారంతో కూంబింగ్‌లో ఉన్న క్యూబ్రాంచ్ వర్గాలు అక్కడికి ఉరకలు తీశారు. అయితే, అప్పటికే ఆ పన్నెండు మంది పత్తా లేకుండా పోగా, పోస్టర్లు కరపత్రాలను మాత్రం వదలి వెళ్లడంతో వాళ్లెక్కడ అన్న అన్వేషణను క్యూబ్రాంచ్ తీవ్రతరం చేసింది. సీపీఐ మావోయిస్టు అంటూ ప్రచురించిన ఆ పోస్టర్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇక, ఒకప్పుడు ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో మావోయిస్టుల సంచారం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పేలుడు ఆదివారం ధర్మపురి సమీపంలోని మరప్పూర్ రైల్వే స్టేషన్‌కు మూడు కి.మీ దూరంలో రైల్వేట్రాక్‌పై పేలుడు శబ్దం రావడంతో ఆ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ధర్మపురి జిల్లా ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలోని బృందం అక్కడికి పరుగులు తీసింది.రైల్వేట్రాక్ వద్ద కండెన్సర్లు, విద్యుత్ మోటార్‌కు ఉపయోగించే పరికరాలు, వైర్లు లభించడంతో, ఒకప్పుడు మావోయిస్టులు పేలుళ్లకు ఇలాంటి వాటినే ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, గతంలో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు మళ్లీ చొరబడ్డారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. రైలుబోల్తా కుట్ర లక్ష్యంగా వీటిని అమర్చి ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తును వేగవంతం చేసి ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల నినాదం తెర మీదకు వస్తుండడంతో అటవీ గ్రామాల్లో ఎన్నికల భద్రత కట్టుదిట్టపై దృష్టి పెట్టేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది. -
ఇక అమ్మ దర్శనం దక్కినట్టేనా
-15 సీట్లకు వాసన్ అంగీకారం - ఒకటి, రెండు రోజుల్లో పోయెస్ గార్డెన్‌కు చెన్నై తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండ వం చేస్తున్నది. అమ్మ దర్శన భాగ్యం తమ అధినేతకు ఒకటి, రెండు రోజుల్లో దక్కనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. తమకు పదిహేను సీట్లను సర్దుబాటు చేయడంతో, అందు కు తమ అధినేత అంగీకరించినట్టు చెబుతున్నారు. తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) గురించిన చర్చే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. ఆ యా పార్టీలు పొత్తులు కుదుర్చుకుని సీట్ల పందేరాలు సాగించే పనిలో పడ్డాయి. అయితే, తన తండ్రి దివంగత నేత మూపనార్ చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన టీఎంసీ నేత జీకే వాసన్ నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని చెప్పవచ్చు. వెనుకడుగు వేస్తున్నారా? లేదా, చివరి వరకు వేచి చూసి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుందామా? అన్న యోచనతో ఆయన ముందుకు సాగుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల వాదన. అన్నాడీఎంకేతో కలసి అడుగులు వేయాలన్నదే వాసన్‌కు తొలినాటి నుంచి ఉన్న అభిప్రాయం. అయితే, అక్కడి తలుపులు తెరుచుకున్నా, సీట్ల పందేరం చిక్కుల్ని సృష్టించడంతో డైలమాలో పడ్డారు. అదే సమయంలో అమ్మ తలుపులు ఇక మూసుకున్నట్టేనన్న భావనతో తదుపరి డీఎంకే వైపు, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి వైపుగా ఆయన దృష్టి సాగిందని చెప్పవచ్చు. అయితే, వాసన్ తీరుకు డీఎంకే గట్టి సమాధానమే ఇచ్చింది. తమ కూటమిలో చోటు లేదని తేల్చింది. ఇక పదే పదే ఆహ్వానం పలికిన ప్రజా కూటమి తాజాగా మౌనం అనుసరించడం మొదలెట్టడంతో వాసన్ పరిస్థితి ఏమిటో అన్న చర్చ బయలు దేరింది. ఎన్నికల గుర్తుగా తమ నేత వాసన్‌కు కొబ్బరితోట చిక్కినా, ఎన్నికల పొత్తు ఖరారు కాకపోవడంతో మల్లగుల్లాలు పడుతూ వచ్చిన టీఎంసీ వర్గాలు, ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నాయి. ఇందుకు కారణం మళ్లీ అన్నాడీఎంకే తలుపులు తెరుచుకుని ఉండడమేనటా. టీఎంసీకి పదిహేను సీట్లు సర్దుబాటు చేయడానికి అన్నాడీఎంకే సిద్ధపడ్డట్టుగా వచ్చిన సంకేతాలతో ఇక, పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కినట్టే అన్న ఆనందాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు సీట్ల సర్దుబాటుకు అన్నాడీఎంకే నిర్ణయించడంతో ఆ పదిహేనుకు అంగీకారం తెలిపిన జీకే వాసన్, ఇక అమ్మ దర్శనం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అమ్మ దర్శనం ఖాయం అని, అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నామని పేర్కొంటున్నారు. అయితే, అన్నాడీఎంకేలో ఏ చిహ్నం మీద వాసన్ పోటీ చేయాల్సి ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొబ్బరి తోటకు అమ్మ అనుమతి ఇస్తారా, అన్నది వేచి చూడాల్సిందే. ఇందుకు నిదర్శనం ఇప్పటి వరకు అమ్మ గొడుగు నీడన చేరిన వారందరూ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో బరిలోకి దిగేందుకు సిద్ధపడ డమే. 2001లో అన్నాడీఎంకేతో కలసి టీఎంసీ ఎన్నికల పయనం సాగించిన విషయం తెలిసిందే. అమ్మ దర్శనం కోసం : ఓ వైపు వాసన్ అమ్మ దర్శనం కోసం సిద్ధం అవుతోంటే, మరో వైపు అమ్మకు మద్దతు అంటూ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు మరెన్నో చిన్నా చితక పార్టీలు, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు పరుగులు తీస్తున్నాయి. తమ మద్దతు అమ్మకే అంటూ లేఖల్ని పోయెస్ గార్డెన్‌కు పంపించే పనిలో పడ్డాయి. అక్కడి నుంచి పిలుపు వచ్చిన తరువాయి, అమ్మను దర్శించుకునేందుకు ఆయా నేతలు చెన్నైలో తిష్ట వేసి ఉండడం గమనార్హం. ఇక, ఆదివారం సినీ నటుడు, ముక్కళత్తూరు పులి పడై అధ్యక్షుడు కరుణాస్ అమ్మ జయలలితను కలిశారు. తమ మద్దతును ప్రకటించారు. అన్నాడీఎంకే తరఫున 234 స్థానాల్లోనూ తాను ప్రచారం చేయబోతున్నట్టుగా కరుణాస్ పేర్కొన్నారు. ఇక, గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సర్దుకున్న ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసన్ ఈ సారి అమ్మ ముందు మరిన్ని సీట్ల డిమాండ్‌ను ఉంచారు. -
జోష్
మనసు మార్చుకున్న శరత్‌కుమార్ ఎదురు చూపుల్లో వాసన్ ఫిర్యాదులతో సతమతం రెబల్స్‌కు గ్యారంటీ 20 మందికి ఒక ఇన్చార్జ్ అన్నాడీఎంకే కొత్త వ్యూహం ఇంటర్వ్యూల రూపంలో తమకు అమ్మ దర్శనం లభిస్తుండడంతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నారు. ఓ వైపు ఆశావహుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ, మరో వైపు వివిధ పార్టీల సంఘాల నాయకులతో మంతనాల్లో సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బిజీబిజీగా ఉన్నారు. ఇక, అటూ...ఇటూ అని చివరకు అమ్మ చెంతకే చేరాల్సిన పరిస్థితి శరత్‌కుమార్‌కు ఏర్పడింది. అమ్మ కరుణతో ఆయన ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. చెన్నై: మళ్లీ అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వ్యూహ రచనల్లో మునిగి ఉన్నారు. చిన్న పార్టీల్ని తప్పా, పెద్ద పార్టీల్ని దగ్గరకు రానివ్వకుండా నాలుగైదు రోజులుగా రోజూ వారి బిజీ షెడ్యూల్‌తో ఆమె ముందుకు సాగుతున్నారు.అభ్యర్థుల ఎంపిక భారాన్ని తన భుజాన వేసుకుని ఇంటర్వ్యూల్ని సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా తమకు ఇంటర్వ్యూల రూపంలో అమ్మ దర్శనం అవుతుండడంతో పార్టీ వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నారు. తమకు సీటు రాకున్నా పర్వాలేదని, అమ్మను నేరుగా కలుసుకునే అవకాశం దక్కడం ఆనందంగా ఉందంటూ పలువురు కొత్త ముఖాలతో కూడిన ఆశావహులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశావహులు, వారి మద్దతు దారులు తరలి వస్తుండటంతోపాటు, పలు రాజకీయ పక్షాల నాయకులు మద్దతు నిమిత్తం పడగలెత్తుతుండడంతో పోయెస్‌గార్డెన్ పరిసరాలు ఎన్నికల వాతావరణంలో మునిగి ఉన్నాయి. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్న ఆశావహుల మీద ఫిర్యాదులు సైతం బయలు దేరడం గమనార్హం. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురంల నుంచి ఇంటర్వ్యూకు వచ్చి వెళ్లిన వాళ్లలో పలాన వ్యక్తికి అంటే, పలాన వ్యక్తికి సీటు ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి చేరుతున్నాయి. ఇది కాస్త కొత్త భారాన్ని , సమస్యను సృష్టిస్తున్నదంటూ అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, డీఎండీకేలో ఉంటూ రెబల్స్ అవతారం ఎత్తి చివరకు పదవుల్ని వదులుకున్న మాజీ ఎమ్మెల్యేకు అమ్మ సీట్లు ఖరారు చేసినట్టుగా సంకేతాలు రావడం విశేషం. అదే సమయంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం మందిపై అమ్మ కన్నెర్ర చేసినట్టు సమాచారం. మనసు మార్చుకున్న శరత్: గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ పయనం సాగించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయితే, సినీ నటుల సంఘం ఎన్నికల తదుపరి అన్నాడీఎంకేకు దూరంగా ఆయన వ్యవహరించిన విషయం విధితమే. అన్నాడీఎంకే నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించి, చివరకు పార్టీని రెండుగా చీల్చుకోవాల్సిన పరిస్థితుల్ని శరత్‌కుమార్ చవి చూశారు. బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నించి, చివరకు మనస్సు మార్చుకున్న శరత్‌కుమార్‌కు అమ్మే దిక్కు అయ్యారు. అన్నాడీఎంకే నుంచి పిలుపు వచ్చిందో, లేదా, అమ్మకు వేడుకోలు పంపించారో ఏమోగానీ, పోయెస్ గార్డెన్లో బుధవారం ప్రత్యక్షం అయ్యారు. జయలలితతో భేటీ అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకేకు తన మద్దతును ప్రకటించారు. కొన్ని కారణాలతో ఇది వరకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అమ్మ దర్శనంతో అన్ని తొలగినట్టు పేర్కొన్నారు. మళ్లీ అమ్మ పాలన లక్ష్యంగా శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఎదురుచూపుల్లో: చిన్నా చితక పార్టీలకు, ఇది వరకు టాటా చెప్పిన శరత్‌కుమార్ లాంటి వాళ్లకు అమ్మ దర్శనం లభిస్తుంటే, తనకు దక్కేది ఎప్పుడో అన్న వేదనలతో టీఎంసీ నేత జీకే వాసన్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తమిళ మానిల కాంగ్రెస్‌ను(టీఎంసీ) పునరుద్ధరించిన జీకే వాసన్ అమ్మ నీడన చేరాలన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు. ఆ పార్టీ వర్గాల సంప్రదింపుల్లో 25 సీట్ల డిమాండ్‌ను అమ్మ ముందు ఉంచి ఆయన తప్పు చేసినట్టున్నారు. ఇందుకు కారణం ఇప్పటి వరకు అమ్మ దర్శన భాగ్యం అందుకున్న పార్టీలందరికీ సింగిల్ డిజిట్ సీట్లు ఖారరయ్యాయని చెప్పవచ్చు. అయితే, వాసన్ డబుల్ డిజిట్ సంఖ్యను ఉంచిన దృష్ట్యా, వేచి చూసే ధోరణిలో అమ్మ ఉన్నట్టు సమాచారం. తాము ఇచ్చే సీట్లతో సర్దుకునే వాళ్లకే పోయేస్ గార్డెన్ తలుపులు తెరచుకుని అమ్మ దర్శనం లభిస్తున్నదని, ముందే డిమాండ్లు పెడితే కష్టమేనంటూ అన్నాడీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అందుకే మరో రెండు మూడు రోజులు వేచి చూసి, తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు వాసన్ నిర్ణయించి ఉన్నారు. ఈనెలాఖరులోపు పొత్తు ఎవరితో అన్నది స్పష్టం చేస్తానని ఆయన మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 20 మందికి ఒక ఇన్చార్జ్: ఇంటర్వ్యూలు, మద్దతు, ఫిర్యాదుల పరిశీలన బిజీలో ఉన్నా, ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కొత్త వ్యూహాల్ని రచించే పనిలో జయలలిత ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మళ్లీ అధికారం లక్ష్యంగా ఉరకలు తీస్తున్న జయలలిత 20 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ చొప్పున నియమించే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒక్కో గ్రామంలో, ఆయా వీధుల్లో ఉన్న ఓటర్లను పరిగణలోకి తీసుకుని అక్కడి స్థానిక నేతల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమించే పనిలో ఉన్నారు. ఈ ఇన్చార్జ్లుఆ ఓటర్లను కలవడం, వారి సమస్యల్ని తెలుసుకోవడం, వాటి పరి ష్కారం దిశగా ముందుకు సాగేందుకు ‘రచ్చ బండ’ చర్చ అన్న నినాదాన్ని ఇందుకు ఎంపిక చేసి ఉండడం విశేషం. -
ఒంటరికి సై!
డీఎండీకే అధినేత విజయకాంత్ తీరుతో కమలనాథులు విసిగి వేసారినట్టున్నారు. ఇక, ఆయనతో ఎలాంటి చర్చలు సాగించ కూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గట్టుగామంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. ఒంటరి నినాదంతో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో మునిగారు. చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే ప్రయత్నంలో ఢీలా పడ్డ కమలనాథులకు ప్రాంతీయ పార్టీల తీరు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్టుంది. పొత్తు వ్యవహారంలో పీఎంకే తన స్పష్టతను తెలియజేసినా, నాన్చుడు ధోరణితో ఒంటరి నినాదాన్ని డీఎండీకే అందుకున్నా, ఆ ఇద్దరు తమతో కలసి వస్తారన్న ఆశల పల్లకిలో ఇన్నాళ్లు కమలనాథులు ఊగిసలాడారని చెప్పవచ్చు. అయితే, పొత్తు మంతనాల్లో తమతో ఆ పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కలత చెందిన కమలనాథులు, ఇక వారిని తమ దరి దాపుల్లోకి చేర్చకూడదన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఇం దుకు తగ్గ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇక చర్చల్లేవ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒంటరి కసరత్తు : డీఎండీకే, పీఎంకేలు ఇక తమతో కలసి వచ్చేది అనుమానం గానే మారడంతో తమ బలాన్ని చాటుకునేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తమదైన శైలిలో రాజకీయం సాగించేందుకు కసరత్తుల్లో మునిగారు. ఈ సారికి ఆయా పార్టీలు తమ దైన బాణిలో పయనిస్తుండడంతో, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఓట్ల చీలిక ద్వారా లబ్ధిపొందాలన్న వ్యూహంతో ముందుకు సాగేందుకు కమలనాథులు నిర్ణయించి ఉన్నారు. ఇందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసే పనిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై నిమగ్నం అయ్యారు. మంగళవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఒంటరి నినాదాన్ని అందుకునేందుకు తగ్గ కసరత్తుల్ని చేపట్టారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో ఆమె సమాలోచించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ బలా బలాలను జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేశారు. ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వివరాల్ని పరిశీలించారు. ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు. చర్చల్లేవ్ : ఈ కసరత్తుల తదుపరి మీడియాతో తమిళి సై మాట్లాడుతూ, ఇక, డీఎండీకేతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొత్తు కోసం వెనక్కు తగ్గే స్థితిలో బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా విజయకాంత్‌కు హితవు పలికారు.ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసునని, ఎవర్నీ తాము నిర్బంధించబోమని, వస్తే కలిసి పనిచేస్తామేగానీ, వాళ్ల డిమాండ్లకు తలొగ్గి, సామరస్య పూర్వకంగా వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగిన బలం బీజేపీకి ఉందని, అందుకు తగ్గ కసరత్తులోనే ఉన్నామని వ్యాఖ్యానించడం విశేషం. నేడు అమిత్ షా : తమిళనాట ఎన్నికల రాజకీయ రసవత్తరంగా మారిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం చెన్నైకు రానున్నారు. ఆయన రాకతో రాజకీయ ప్రాధాన్యతకు ఆస్కారం ఉంటుందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆయన కామరాజర్ అరంగంలో జరిగే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సహస్త్ర చంద్ర దర్శనం వేడుకకు హాజరై వెంటనే ఢిల్లీ వెళ్లేలా పర్యటనను సిద్ధం చేసుకుని ఉన్నారు. -
జయ కోసం శశి పూజలు
భర్తల గెలుపు కోసం భార్యల మొక్కులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు గెలుపు ఓటములు దైవాధీనాలు అనే నానుడికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రంలోని రాజకీయ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలే దిక్కు అని భర్తలు... ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా, వారి భార్యలు మాత్రం తమ భర్తల గెలుపు కోసం దేవుడే దిక్కని ఆలయాల్లో ప్రదక్షిణలకు శ్రీకారం చుట్టారు. చెన్నై : విద్యార్థులకు పరీక్షలో ఉత్తీర్ణత ఎంత ముఖ్యమో రాజకీయ నేతలకు ఎన్నికల్లో గెలుపు అంతే ముఖ్యం. పరీక్షా ఫలితాల్లో ఫెయిలైనా, ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలైనా పరిస్థితి దయనీయమే. అందుకేనేమో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా ఓటరు బాట, నేతల సతీమణులంతా ఆలయాల బాట పట్టడం ప్రారంభించారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం అన్నాడీఎంకే, డీఎంకేలలో చురుకుగా సాగుతోంది. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రెండు పార్టీల్లోనూ ఎగబడుతున్నారు. గెలుపు ఓటములు దైవాధీనాలనుకుంటూ రాజకీయ నేతలు ప్రజల వైపు తాము పయనిస్తూ తమ సతీమణులను ఆలయాల చుట్టూ తిప్పుతున్నారు. జయ కోసం శశికళ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు కోసం ఆమె నెచ్చెలి శశికళ ఈ నెల 20వ తేదీన శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలో బంగారు విమాన కుంభాభిషేకం ఉత్సవాలు నిర్వహించారు. యుద్ధంలో గెలుపు కోసం ఆలయాల్లో మాంగల్య పూజలు నిర్వహించి ముత్తయిదువులకు ప్రసాదాలు పంచడం రాజుల కాలం నాటి ఆనవాయితీ. అదే ఆనవాయితీగా ఆలయ కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న శశికళ... జయ గెలుపును ఆశిస్తూ విశేష పూజలు నిర్వహించారు. 25 మంది మహిళా భక్తులకు రవిక వస్త్రం, తాళిబొట్టు తాడు, పసుపు, కుంకుమ తదితర 9 రకాల వస్తువులతో కూడిన సంచీని అందజేశారు. స్టాలిన్ కోసం సతీమణి దుర్గ శశికళ పూజల సంగతి తెలిసిందో ఏమో కాని డీఎంకే అధినేత కరుణానిధి కోడలు, కోశాధికారి స్టాలిన్ సతీమణి దుర్గ పక్కరోజే కంచి కామాక్షి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. డీఎంకే అధికారంలో రావాలని ప్రార్థిస్తూ తైమాస పౌర్ణమిరోజైన శనివారం అర్ధరాత్రి కంచిలోని కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. చోళరాజులు తాము రణరంగంలోకి దిగే ముందు కామాక్షి అమ్మవారికి నవ ఆవర్ణ పూజలు జరిపేవారు. స్టాలిన్ భార్య దుర్గ సైతం నవ ఆవర్ణ పూజ జరిపించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన పూజలు అర్ధరాత్రి వరకు సాగాయి. దుర్గతోపాటూ ఆమె తల్లి, సోదరి కూడా పూజల్లో పాల్గొన్నారు. అన్బుమణి కోసం భార్యామణి సౌమ్య కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన అన్బుమణి రాందాస్ సతీమణి సౌమ్య సైతం ధర్మపురి జిల్లా కుమారస్వామిపేటలోని శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తన భర్త సీఎం అయ్యేలా ఆశీర్వదించు అంటూ తైపూస పుణ్యదినమైన ఆదివారం నాడు సౌమ్య ప్రత్యేక పూజలు జరిపారు. ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతల గెలుపు కోసం వారి సతీమణులు, జయ కోసం ఆమె నెచ్చెలి శశికళ వరుసగా పూజలు జరిపించడం విశేషం. ఇదే కోవలో తన భర్తకు పోటీకి సీటు దక్కాలని, గెలుపొందాలని, పార్టీ అధికారంలోకి వస్తే భర్త మంత్రి కావాలని... ఇలా రకరకాల కోర్కెలతో ఇక ఆలయాల్లో నేతల సతీమణులు సందడి చే యడం ఖాయమని అంటున్నారు.


