విజయ్‌ అప్పటి నుంచే మారిపోయాడు! | Thalapathy Vijay Sister Died Tragically | Sakshi
Sakshi News home page

విజయ్‌ అప్పటి నుంచే మారిపోయాడు!

May 5 2026 10:43 AM | Updated on May 5 2026 11:23 AM

Thalapathy Vijay Sister Died Tragically

తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్‌ పూర్తి పేరు... జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. సినిమాల్లో రాణించి అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో.. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం, సోదరి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

అన్నయ్య చేతుల్లోనే..
తన చెల్లి విద్య చిన్న వయస్సులోనే మరణించడం విజయ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 1980లో జన్మించిన విద్య సుమారు నాలుగేళ్ల వయసులో 1984 మే 20వ తేదీన ఆనారోగ్యంతో మరణించారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ 'ఎనక్కుల్ నానే నీధిపతి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యా విజయ్.. తన అన్నయ్య చేతుల్లోనే ప్రాణాలు విడిచారని.. ఆ సంఘటన విజయ్‌ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.

ఈ విషాదం జరగక ముందు..
ఈ విషాదం జరగక ముందు.. దళపతి విజయ్ ఎంతో చురుకుగా.. అల్లరి చేస్తూ.. అతిగా మాట్లాడే బాలుడిగా ఉండేవారు. కానీ విద్యా విజయ్ మరణం తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఆయన అంతర్ముఖుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఆయన బహిరంగ ప్రదేశాల్లో కనిపించే శాంత స్వభావానికి ఆనాటి ఆ ఘటనే కారణమని చెబుతుంటారు. స్కూలు నుంచి వచ్చాక విజయ్‌ ఎంతో ఆప్యాయంగా విద్యకు తనే స్నానం చేయించి అన్నం కూడా తినిపించేవాడు. చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.

చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా..
గతంలో ఓ కార్యక్రమంలో తన చెల్లెలు విద్య గురించి విజయ్ మాట్లాడుతూ.. తన జీవితంలో చెల్లెలు మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైందన్నారు.. కానీ ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడంటూ.. వారందరిలో  తన చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటానని తెలిపారు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్‌.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని నామకరణం చేశారు.

విజయ్ కార్ నంబర్ వెనుక రహస్యం
విజయ్ తన కార్లకు 0277 అనే ప్రత్యేక నంబర్‌ను వాడుతుంటారు. ఈ నంబర్ తన సోదరి విద్యాకు అంకితం చేశారు. 14-02-77 అనేది ఆమె పుట్టిన తేదీ. తన సోదరిపై ఉన్న ప్రేమతో విజయ్ ఇప్పటికీ ఆ నంబర్‌ను వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నారు.

తండ్రిపై విజయ్‌ కేసు..
కాగా, గతంలో విజ‌య్ త‌న త‌ల్లిదండ్రులు స‌హా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టిన సంగతి కూడా అభిమానులు గుర్తుకుచేసుకుంటున్నారు. 2020లో విజ‌య్ తండ్రి, సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎ.చంద్ర‌శేఖ‌ర్ ఆల్ ఇండియా ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్క‌మ్ పేరుతో ఓ రాజ‌కీయ పార్టీని  ప్రారంభించారు. ఈ పార్టీకి జ‌న‌రల్ సెక్ర‌ట‌రీగా ఎస్‌.ఎ.చంద్ర‌శేఖ‌ర్‌, ట్రెజ‌ర‌ర్‌గా శోభా చంద్ర‌శేఖ‌ర్ వ్య‌వ‌హ‌రించారు. అయిత.. త‌న తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తండ్రి స్థాపించిన ఆ పార్టీకి త‌న పేరుని ఉప‌యోగించుకుంటే. చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement