ఎన్నికల బరిలో లాటరీ కింగ్‌ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే? | Lottery King Santiago Martin Family In Poll Fray From 3 Different Parties | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో లాటరీ కింగ్‌ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే?

Apr 4 2026 7:02 AM | Updated on Apr 4 2026 9:14 AM

Lottery King Santiago Martin Family In Poll Fray From 3 Different Parties

చెన్నై/పుదుచ్చేరి: లాటరీ కింగ్‌గా గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్‌ కుటుంబంలోని ముగ్గురు తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...? వీరు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగడమే అసలైన కిటుకు. మార్టిన్‌ భార్య లీమా రోజ్‌(59) ఇటీవలే అన్నాడీఎంకేలో చేరి లాల్గుడి నియోజకవర్గంలో పోటీకి దిగారు.

మార్టిన్‌ కుమారుడు జోస్‌ చార్లెస్‌ మార్టిన్‌(38) సొంతంగా లక్ష్య జననాయక కట్చి(ఎల్‌జేకే)అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, ఏఐఎన్నార్సీల ఎన్డీయేలో ఈ పార్టీ కూడా ఉంది. చార్లెస్‌ మార్టిన్‌ కామరాజ్‌ నగర్‌ స్థానానికి పోటీ పడుతున్నారు.

మార్టిన్‌ అల్లుడు ఆధవ్‌ అర్జున(43), విజయ్‌ సారథ్యంలోని టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కమ్‌లో పోటీకి దిగారు. ఈ ముగ్గురూ ఏప్రిల్‌ 9, 13వ తేదీల్లో జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, మార్టిన్‌ గ్రూప్‌ కంపెనీ ఎండీగా ఉన్న జోస్‌ చార్లెస్‌ తనకు రూ.597 కోట్ల ఆస్తులు, అర్జున రూ.197 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించుకున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement