విజయ్‌ విక్టరీ వెనుక ఆ ఒక్కడు! | Kapil Sahu: Vijay Strategist Behind High Stakes Political Campaigns | Sakshi
Sakshi News home page

విజయ్‌ విక్టరీ వెనుక ఆ ఒక్కడు!

May 4 2026 2:27 PM | Updated on May 4 2026 3:01 PM

Kapil Sahu: Vijay Strategist Behind High Stakes Political Campaigns

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ టీవీకే పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి రెండేళ్లే అవుతున్నా.. తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను మట్టికరిపించింది. అయితే.. ఈ విజయ్‌ విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్‌ విక్టరీ వెనుక ఉన్న కపిల్‌ సాహు. ఎన్నికల వ్యూహంలో ఆయనకు పదేళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్‌ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌లో రాఘవ్‌ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్‌ విస్తరణలో కీలక పాత​ పోషించారు. కాంగ్రెస్‌ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం ఉంది ఈయనకు.

గతంలో ఐప్యాక్‌(Indian Political Action Committee)లో పని చేసిన ఆయన.. ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్‌గా మారారు. ఆ తర్వాత విజయ్‌ టీవీకేకు వ్యూహాలు అందించారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించారు. టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించడం.. గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం.. ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ వ్యూహాలను మెరుగుపరచడం చేశాడాయన. సాహు రూపొందించిన వ్యూహం పార్టీకి 100+ సీట్లలో ఆధిక్యం సాధించడానికి తోడ్పడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement