గవర్నర్‌కు టీవీకే విజయ్‌ లేఖ | Vijay Writes Governor Letter Seeking Invite to Form Govt | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు టీవీకే విజయ్‌ లేఖ

May 5 2026 11:30 AM | Updated on May 6 2026 3:28 PM

Vijay Writes Governor Letter Seeking Invite to Form Govt

చెన్నై: తమిళనాడు గవర్నర్‌కు టీవీకే చీఫ్ విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపిస్తామని.. అవకాశం ఇవ్వాలంటూ విజయ్‌ కోరారు. లోక్‌భవన్‌కు ఈ-మెయిల్ ద్వారా ఆయన లేఖ పంపినట్లు సమాచారం. విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్క్) 118. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను గెలుచుకుంది.

స్వతంత్ర అభ్యర్థులు, ఒకట్రెండు సీట్లు గెలుచుకున్న చిన్న పార్టీలపై విజయ్ దృష్టి సారించారు. సంఖ్యా బలం పరంగా చూస్తే.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైనందున.. ఇతర పార్టీల నుంచి చీలిక తీసుకురావడం కంటే స్వతంత్రుల మద్దతు కూడగట్టడం సులభంగా టీవీకే భావిస్తోంది. వీరికి మంత్రి పదవులు, ప్రత్యేక నిధుల హామీ ఇవ్వడం ద్వారా మద్దతు పొందవచ్చని టీవీకే ప్లాన్‌ చేసినట్లు సమాచారం.

ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అనే నినాదంతో విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. ప్రతిపక్ష కూటముల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్.. గవర్నర్‌కు లేఖ రాయగా.. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ 14 రోజుల సమయం.. ఇతర పార్టీలతో చర్చలు జరపడానికి పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా కీలకం.

ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement