టీవీకే విజయ్‌ నివాసానికి నటి త్రిష | Actress Trisha Visits TVK Vijay Residence In Chennai As TVK Leading In Tamil Nadu Election Results, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

టీవీకే విజయ్‌ నివాసానికి నటి త్రిష

May 4 2026 1:18 PM | Updated on May 4 2026 3:13 PM

Actress Trisha Visits Tvk Vijay Residence

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే ‍ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్‌ విజయ్‌ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల్లో విజయంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలిపారు. ఇవాళ త్రిష బర్త్‌డే.. ఉదయం తిరుమలలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరుమల నుంచి నేరుగాచెన్నైకు వెళ్లిన త్రిష.. విజయ్‌కు విషెస్‌ చెప్పారు.

త్రిష  తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు. కాగా, చెన్నైలోని విజయ్‌ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్‌ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నైలోని విజయ్‌ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు.

దళపతి విజయ్ ఇంటికి చేరుకున్న హీరోయిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement