తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్‌ | Aiadmk Says No To Vck Boss As Chief Minister In Alliance With Dmk | Sakshi
Sakshi News home page

తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్‌

May 9 2026 3:19 PM | Updated on May 9 2026 3:36 PM

Aiadmk Says No To Vck Boss As Chief Minister In Alliance With Dmk

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. డీఎంకే-అన్నాడీఎంకే ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్‌ తెరపైకి రాగా.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డీఎంకే ప్రతిపాదను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వీకేసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు వీసీకే మద్దతుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్థానంలో దూరంలో టీవీకే ఉండగా.. వీసీకే మద్దతు కోసం విజయ్‌ ఎదురుచూస్తున్నారు. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామి నివాసానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆరుగురు ముఖ్య నేతలతో పళనిస్వామి కీలక చర్చలు జరుపుతున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement