టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ | Governor Grants Permission For Tvk To Form Government | Sakshi
Sakshi News home page

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

May 8 2026 7:27 PM | Updated on May 8 2026 7:54 PM

Governor Grants Permission For Tvk To Form Government

చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. తమిళనాడులో విజయ్‌ సర్కార్‌ కొలువుదీరనుంది. రేపు(శనివారం) నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే విజయ్‌కు సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ప్రకటించాయి. లెప్ట్‌, వీసీకే మద్దతుతో విజయ్‌కే పూర్తి మెజార్టీ దక్కింది.

టీవీకే-107, కాంగ్రెస్‌-5, సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2 మద్దతుతో 118కి సంఖ్యాబలం చేరింది. అలాగే టీవీకేకు ఐయూఎంఎల్‌(2) కూడా మద్దతు తెలిపింది. మొత్తం 120 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని గవర్నర్‌కు విజయ్‌ తెలిపారు. ప్రమాణస్వీకారానికి రాహుల్‌, ఖర్గే హాజరయ్యే ఛాన్స్‌ ఉంది.

కాగా, వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిందేనంటూ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు అనేది అత్యవసరమన్న ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement