ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్‌ | If The Nda Wins They Will Change Tamil Nadu Name: Mk Stalin | Sakshi
Sakshi News home page

ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు: స్టాలిన్‌

Apr 1 2026 8:28 PM | Updated on Apr 2 2026 9:37 AM

If The Nda Wins They Will Change Tamil Nadu Name: Mk Stalin

తిరుచ్చి: ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి  ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ప్రదేశ్‌గా పేరు మారుస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ‍ప్రచారంలో భాగంగా ఎన్డీఏపై స్టాలిన్‌ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్టాలిన్‌ విరుచుకుపడ్డారు.

బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పనికిరాని డబ్బా ఇంజిన్‌గా అభివర్ణించిన స్టాలిన్.. తమ ద్రవిడ మోడల్ పాలనను 'సూపర్ ఫాస్ట్ ఇంజిన్‌తో పోల్చారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించి, ద్రవిడ సిద్ధాంతాన్ని మరోసారి గెలిపించాలంటూ ప్రజలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, వారి వల్ల కలిగే నష్టాలు మన ఊహకు అందవు. తమిళనాడు పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడు ఎప్పటికీ తమిళనాడుగానే ఉండాలి. ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లాగా హింసాత్మక ప్రాంతంగా మారకూడదు. హోసూర్ విమానాశ్రయం, విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల కోసం తరచుగా పర్యటనలు చేస్తారు’’ అంటూ స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement