తొలి సంతకంతోనే విజయ్‌ సంచలనం.. | Tvk Vijay First Signature On Free Electricity | Sakshi
Sakshi News home page

తొలి సంతకంతోనే విజయ్‌ సంచలనం..

May 10 2026 11:05 AM | Updated on May 10 2026 12:40 PM

Tvk Vijay First Signature On Free Electricity

చెన్నై: తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌.. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నారు. మహిళా భద్రతపై విజయ్‌ రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీటీమ్‌ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్‌ తరహా వ్యవస్థపై సీఎం సంతకం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్‌ సంతకం చేశారు.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘తమిళనాడు రాజకీయాల్లో  కొత్త శకం మొదలైంది. నేను మీ ఇంట్లో కుటుంబసభ్యుడిని. మీకు అన్నగా తమ్ముడి ఉంటా. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. నాతో ప్రయాణం చేస్తున్న మీకు మంచి చేస్తా. ఇది అస్థిర ప్రభుత్వం కాదు..

..నా ప్రభుత్వంలో ఒకటే పవర్‌ సెంటర్‌  ఉంటుంది. ఏది సాధ్యమే అది మాత్రమే చేస్తా. విద్యార్థుల భవిష్యత్‌కు విజయ్‌ మామ అండగా ఉంటాడు. మైనార్టీలకు అండగా ఉంటా ప్రజాధనం వృథా చేయను. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్వరలో శ్వేత పత్రం విడుదలచేస్తా. తమిళ  ప్రజలకు రుణపడి ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement