తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌ | Tamil Nadu Political Drama, Governor Initially Denies Appointment, Later Meets Vijay And Receives Support Letter | Sakshi
Sakshi News home page

తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌

May 9 2026 5:49 PM | Updated on May 9 2026 8:11 PM

Governor Did Not Grant An Appointment To Tvk Vijay

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్‌.. మళ్లీ వెనుదిరిగారు. కేరళకు వెళ్తున్న గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌.. విజయ్‌కు సమయం ఇవ్వలేదు. గవర్నర్‌కు ముందస్తు అపాయింట్‌మెంట్‌ ఉండటంతో విజయ్‌కు సమయం ఇవ్వలేదు. విజయ్‌ కంటే ముందుగా లోక్‌భవన్‌కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్‌భవన్‌ సిబ్బంది వెనక్కి పంపించారు.

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయన్న సంబరపడిన లోపే గవర్నర్‌.. విజయ్‌కు మరో షాక్‌ ఇచ్చారు. ఈ ట్విస్టులు కొనసాగుతుండగా.. గవర్నర్‌ తన మనసు మార్చకున్నారు. తన కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. గవర్నర్‌కు కలిసిన విజయ్‌.. 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించారు.

టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్‌ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement