చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను సీఎస్, డీజీపీ కలిశారు. విజయ్‌కు కాన్వాయ్ ఎలా ఇచ్చారంటూ డీజీపీని గవర్నర్ ప్రశ్నించారు. ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారంటూ గవర్నర్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత శాంతి భద్రతలపై గవర్నర్‌కు డీజీపీ నివేదిక ఇచ్చారు.
కాగా, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం హోదాలో ఇచ్చే జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీని విజయ్‌కు పోలీస్ శాఖ కేటాయించింది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
తాజా పరిణామాలతో విజయ్ కాన్వాయ్‌ను తొలగించారు. మరో వైపు, రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలు చేపట్టింది. తమిళనాడులో క్షణం క్షణం రాజకీయ పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో చెప్పడంతో పరిస్థితి మారిపోయింది.
ఇవాళ పుదుచ్చేరిలోని రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో పళనిస్వామి భేటీ కానున్నారు. 30 మంది ఎమ్మెల్యేల కోసం అత్యంత విలాసమైన రిసార్ట్‌ను పళనిస్వామి బుక్ చేశారు. కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. టీవీకే వైపు చూస్తుండగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పళనిస్వామి ఉన్నారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం స్టాలిన్ కూడా సమావేశం కానున్నారు.


