'డీఎంకే అభ్యర్థులదే అన్నిచోట్లా విజయం' | DMK candidates will win all seats, says MK stalin | Sakshi
Sakshi News home page

'డీఎంకే అభ్యర్థులదే అన్నిచోట్లా విజయం'

May 16 2016 11:11 AM | Updated on Sep 4 2017 12:14 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు అన్నిచోట్ల విజయం సాధిస్తారని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు అన్నిచోట్ల విజయం సాధిస్తారని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం.. స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలిత తిరిగి అధికారంలోకి రావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు.

కాగా, చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్..  నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement