టీవీకే కార్యకర్త అరెస్ట్‌.. పోలింగ్‌ కేంద్రంలో ఏం చేశాడంటే..? | Tvk Worker Arrested For Filming His Vote Inside Booth In Tirupattur | Sakshi
Sakshi News home page

టీవీకే కార్యకర్త అరెస్ట్‌.. పోలింగ్‌ కేంద్రంలో ఏం చేశాడంటే..?

Apr 23 2026 4:57 PM | Updated on Apr 23 2026 6:45 PM

Tvk Worker Arrested For Filming His Vote Inside Booth In Tirupattur

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ  పోలింగ్ బూత్‌లో ఈ ఘటన జరిగింది.

అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి  తన మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లిన శక్తివేల్‌.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్‌పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు


 

Advertisement
 
Advertisement
Advertisement