టీవీకే దూకుడు.. విజయ్‌ నివాసంలో సంబరాలు | Tamil Nadu Election Results 2026, Celebrations At TVK Vijay Residence, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

టీవీకే దూకుడు.. విజయ్‌ నివాసంలో సంబరాలు

May 4 2026 11:38 AM | Updated on May 4 2026 3:14 PM

Tamil Nadu Election Results 2026: Celebrations At Tvk Vijay Residence

చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనం సృష్టిస్తుంది. వంద స్థానాలు దాటి టీవీకే దూసుకుపోతోంది. తమిళనాడు సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీవీకే అవతరించింది. టీవీకే విజయ్‌ నివాసం దగ్గర భద్రత భారీగా పెంచారు. చెన్నైలోని విజయ్‌ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్‌ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్‌ నివాసంలో కుటుంబసభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం అని టీవీకే అంటోంది. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే ధీమా వ్యక్తం చేసింది.

సుమారు ఐదు దశాబ్దాలుగా  తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే   పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్సిస్‌ మై ఇండియా విజయ్‌ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చగా.. మాజీ ఐపీఎస్‌ పి. రవి టీమ్‌ సర్వేతో పాటూ యాక్సిస్‌ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా వచ్చాయి.. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు నిజమయ్యాయి.

టీవీకే పార్టీకి యువత ఎక్కువగా మొగ్గు చూపారు. 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేసినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. 20–29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని చెప్పారు. 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని సర్వేలో తెలిపారు. 

గెలిచిన ఆనందం... TVK విజయ్ ఇంట్లో సంబరాలు..
 

Advertisement
 
Advertisement
Advertisement