డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ | DMK Manifesto Released Many Offers To Voters | Sakshi
Sakshi News home page

డీఎంకే మేనిఫెస్టో.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌

Mar 30 2026 7:14 AM | Updated on Mar 30 2026 7:33 AM

DMK Manifesto Released Many Offers To Voters

చెన్నై: తమిళనాడులో గెలిస్తే 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని అధికార డీఎంకే ప్రకటించింది. ‘మహిళలకు రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తాం. కూపన్లతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్‌ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే పాతవాటితో ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవచ్చు’’ అని పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.

పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ఆయన విడుదల చేశారు. ‘‘వ్యవసాయం, విద్య, పరిశ్రమల రంగాల్లో పలు రకాల సంక్షేమ పథకాలను అమలుచేస్తాం. రైతులు, గృహిణులు, విద్యార్థులు మొదలు అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోరుతూ పలు సంక్షేమ చర్యలను అమలుచేయబోతున్నాం. మామూలుగా డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటుంది. ఈసారి సూపర్‌స్టార్‌లా ఉండనుంది’’ అంటూ హామీల చిట్టాను ఓటర్ల ముందు ఆవిష్కరించారు.

డీఎంకే మేనిఫెస్టో ముఖ్యాంశాలు...

  • 20 లక్షల మందికిపైగా రైతులకు ఉచితంగా మీటర్‌లేని పంపుసెట్లు

  • వార్షిక ఆదాయ పరిమితి పెంపు

  • ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం రూ.10లక్షలకు పెంపు

  • వృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులకు నెలకు రూ.2,000 పెన్షన్‌

  • కలైంగర్‌ మగలిర్‌ ఉరుమై థొగై పథకం కింద కుటుంబపెద్దగా ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థికసాయం రూ.2వేలకు పెంపు

  • పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ఎనిమిదవ తరగతి విద్యార్థుల దాకా వర్తింపు

  • క్వింటాల్‌ వరి ధాన్యానికి రూ.3,500 మద్దతు ధర

  • టన్ను చెరకుకు రూ.4,500 మద్దతు ధర

  • వచ్చే నాలుగేళ్లలోపు పూరిగుడిసెల అవసరం లేకుండా గృహపథకంలో భాగంగా కొత్తగా 10 లక్షల గృహాల నిర్మాణం

  • ఉన్నత విద్య పూర్తిచేసిన వాళ్లకు నాన్‌ ముధల్వాన్‌ పథకం కింద ఆరు నెలలపాటు వృత్తి నైపుణ్య శిక్షణతోపాటు నెలకు రూ.1,500 అందజేత

  • రాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించడం

  • వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడం

  • పుధుమై పెన్, తమిళ్‌ పుధల్వాన్‌ పథకాల కింద నెలకు రూ.1,500 ఉన్నత విద్యా గ్రాంట్‌ అందజేత

  • కోయంబత్తూర్, సేలం, మదురై, తిరుచిరాపల్లి సమీపంలో ఫ్యూచర్‌–రెడీ గ్లోబల్‌ సిటీల నిర్మాణం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement