సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా టీవీకే.. విజయ్‌ బిగ్‌ ప్లాన్‌! | Vijay TVK Emerges As Single Largest Party In Tamil Nadu | Sakshi
Sakshi News home page

సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా టీవీకే.. విజయ్‌ బిగ్‌ ప్లాన్‌!

May 4 2026 12:47 PM | Updated on May 4 2026 1:01 PM

Vijay TVK Emerges As Single Largest Party In Tamil Nadu

చెన్నై: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయమని.. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ టీవీకే చెబుతోంది. హంగ్‌ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే స్థానాలే రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి.

విజయ్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొదట నుంచి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జరగ్గా, గత కొన్ని నెలలుగా ఆ పార్టీతో టీవీకే మధ్య మాటల మంటలు, పరస్పర విమర్శల క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంత ఈజీ కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ క్రమంలో తమిళనాట టీవీకే, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ జట్టుకంటే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌కు 5 సీట్లు, సీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే అవకాశం ఉంది. కాగా, అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోగా, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.

తాజా ట్రెండ్స్ ప్రకారం.. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ అనూహ్య విజయం దిశగా దూసుకెళ్తుంది. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు గట్టి సవాలే విసురుతోంది. భారత ఎన్నికల సంఘం (ECI) వెల్లడించిన ప్రారంభ గణాంకాల ప్రకారం.. తమిళనాడులో అరుదైన త్రిముఖ పోటీ నెలకొంది. విజయ్ పార్టీ ఇప్పటికే మెజారిటీ మార్కును దాటి.. అధికార డీఎంకేను వెనక్కి నెట్టి ముందంజలో ఉంది. ఏఐఏడీఎంకే మూడవ స్థానానికి పరిమితమైంది.
 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement