టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్‌ | Another Twist In The Formation Of The Tvk Government | Sakshi
Sakshi News home page

టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్‌

May 6 2026 5:02 PM | Updated on May 6 2026 5:54 PM

Another Twist In The Formation Of The Tvk Government

చెన్నై: టీవీకే  ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రేపు(గురువారం) విజయ్‌ ప్రమాణ స్వీకారం అనుమానమే?. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి విజయ్‌కు గవర్నర్‌ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్‌ను విజయ్‌ ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్‌  స్పష్టం చేశారు.

మరో వైపు, విజయ్‌కు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించారు. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు..  కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్‌ చెప్పేసింది. ఇదిలా ఉండగా, లోక్‌ భవన్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదని.. రేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను విజయ్‌ కోరారు.

తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అంటూ ఆరా తీసిన గవర్నర్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, మెజార్టీ సంఖ్య చూపించాలంటూ గవర్నర్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. 112  మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితాను గవర్నర్‌కు విజయ్‌ అందించారు. గవర్నర్‌ నిర్ణయంపై టీవీకే నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే విజయ్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

విజయ్‌కు బిగ్ షాక్ TVKప్రభుత్వ ఏర్పాటులో ట్వీస్ట్

కాగా, ప్రభంజనంలా దూసుకొచ్చిన టీవీకే చీఫ్‌ విజయ్‌ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్‌లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement