కోల్‌కతా: కాలం మారుతుంటుంది.. దీనితోపాటు ప్రజలు, అధికార యంత్రాంగాలు కూడా మారుతుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామ క్రమంలో కోల్‌కతా పోలీసులు కూడా మారిపోయారు. వారు తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, పలువురు ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అన్‌ఫాలో చేశారు. ఇదే సమయంలో పోలీసులు ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఖాతాలను ఫాలో కావడం మొదలుపెట్టారు. దీనికితోడు టీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పలువురు నేతల నివాసాల వద్ద ఉన్న అదనపు భద్రతను కూడా తొలగించారు.
బెంగాల్‌లో భారీ రాజకీయ మార్పు
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత సువేందు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి.. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత రాజకీయ అనుచరునిగా మెలిగారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక నేతగా వ్యవహరించారు. కాగా సువేందు అధికారి స్థిరమైన పరిపాలనను అందిస్తారని, బెంగాల్ ప్రజల అంచనాలను అందుకుంటారని అమిత్ షా నమ్మకం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కేబినెట్‌లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్?


