భ‌వానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి | Mamata Banerjee Loses Bhabanipur Seat | Sakshi
Sakshi News home page

భ‌వానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి

May 4 2026 9:32 PM | Updated on May 4 2026 9:42 PM

Mamata Banerjee Loses Bhabanipur Seat

కోల్‌క‌తా: భ‌వానీ పూర్‌లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి పాల‌య్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజ‌యం సాధించారు. మ‌మ‌తాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఈ సంద‌ర్భంగా త‌న ఓట‌మిపై మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. స‌ర్‌పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల‌ను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్ల‌లో టీఎంసీ ఏంజెట్ల‌ను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవ‌రినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. పార్టీ ఏజెంట్ల‌ను అనుమ‌తి ఇస్తామ‌ని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వ‌చ్చిన త‌ర్వాత డీవో ఇక్క‌డ లేరు అని వాపోయారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన రెండ‌వ సీఎంగా మ‌మ‌తా బెన‌ర్జీ అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఇటు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 

2021 ఎన్నిక‌ల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మ‌మతా బెన‌ర్జీని ఓడించారు. తాజా ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌మ‌తను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓట‌మితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement