అస్సాం : ఘన విజయం దిశగా బీజేపీ కూటమి | Assam Assembly Election Results 2026 - Here You Can Check Live Updates | Sakshi
Sakshi News home page

Assam Assembly Election Results 2026 : ఘన విజయం దిశగా బీజేపీ కూటమి

May 4 2026 8:36 AM | Updated on May 4 2026 3:05 PM

Assam Assembly Election Results 2026 - Here You Can Check Live Updates

 

బీజీపీకి నాలుగు  సీట్లు

  • ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ మూడింట రెండు వంతుల మార్కును దాటేసింది. అస్సాంలో ఇప్పటివరకు బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది.  
  • ఎన్డీఏ 94 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
  • గౌహతి సెంట్రల్‌లో, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ)కి చెందిన జెన్ జెడ్ అభ్యర్థి కుంకీ చౌదరి, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ గుప్తాపై గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

 

రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించే దిశగా హిమంత బిస్వా శర్మ 

  • ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ మూడింట రెండు వంతుల మార్కును దాటేసింది.
  • జోర్హాట్ స్థానంలో గౌరవ్ గోగోయ్ ఓటమి, బీజేపీకి చెందిన హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో ఓడిపోయారు.

 

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన BJP నేతృత్వంలోని కూటమి

  • 80 స్థానాల్లో ఆధిక్యంతో, అసాంలో BJP నేతృత్వంలోని కూటమి 64 స్థానాల మెజారిటీ మార్కును అధిగమించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 19 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.
  • జలుక్‌బరీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆధిక్యంలో ఉండగా, జోర్హాట్‌లో కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్ ముందంజలో ఉన్నారు. 
  • దిస్పూర్‌లో ప్రద్యుత్ బోర్డోలోయ్ ముందంజలో ఉన్నారు 
  • బిహ్‌పురియాలో భూపేన్ బోరా ముందంజలో ఉన్నరు
  • శివసాగర్‌లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారు
  • ఖోవాంగ్‌లో లూరింజ్యోతి గొగోయ్ ముందంజలో ఉన్నారు
  •  జాగీ రోడ్‌లో పిజూష్ హజారికా ముందంజలో ఉన్నారు


విజయం మాదే : అఖిల్ గోగోయ్ 

శివసాగర్‌లో అఖిల్ గొగోయ్ ముందంజలో ఉన్నారు

48 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ముందంజ

  • జోర్హాట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ ముందంజ, 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మొత్తం 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

 బీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం

  • బీజేపీ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం
  •  కాంగ్రెస్ ఖాతా తెరిచిన కాంగ్రెస్‌ 
  • ప్రాథమిక సరళి ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, AIUDF , కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

 

అస్సాంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 722 మంది అభ్యర్థులు తమ  అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

ఈశాన్య రాష్రం అస్సాంలో అధికారి పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ మరోసారి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీదారులుగా, బీజేపీ, అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) భాగస్వామ్యంతో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి, అలాగే INC, అసోం జాతీయ పరిషత్ (AJP), రైజోర్ దళ్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (APHLC), CPI (M) మరియు CPI (ML) పార్టీలతో కూడిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నిలిచాయి.

చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీ కూటమి 88 నుండి 101 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ కూటమి 22 నుండి 36 స్థానాలను గెలుచుకోవచ్చని, కాగా AIUDF 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement