రాష్ట్రాలకు గవర్నర్‌ అవసరం లేదు | Tamil Nadu: No need for governor | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకు గవర్నర్‌ అవసరం లేదు

May 9 2026 7:30 AM | Updated on May 9 2026 7:30 AM

Tamil Nadu: No need for governor

డీఎంకే నేత కనిమొళి వ్యాఖ్య

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్‌ పదవిపై వ్యతిరేకతను డీఎంకే నాయకురాలు కనిమొళి పునరుద్ఘటించారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నందున, గవర్నర్‌ పదవిని రద్దు చేయాలన్న డీఎంకే డిమాండ్‌ మారలేదని ఆమె నొక్కి చెప్పారు. ‘అసలు గవర్నర్‌ అవసరం లేదనే మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజ్యాంగ ప్రక్రియలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే బయటి నుంచి ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందన్న వదంతులను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, ప్రతి వదంతికి స్పందించలేమని అన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement