వివాదంలో ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలు | Controversy Surrounds Two TVK MLAs | Sakshi
Sakshi News home page

వివాదంలో ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలు

May 8 2026 10:45 AM | Updated on May 8 2026 11:20 AM

Controversy Surrounds Two TVK MLAs

సాక్షి, చెన్నై : టీవీకే తరపున అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ఇద్దరు సభ్యులు ఇరకాటంలో పడ్డారు. వీరికి సంబంధించిన వివాదాలు తాజాగా తెర మీదకు రావడం గమనార్హం.  

మద్యం బాటిల్‌తో చిందు 
తంజావూరు నియోజకవర్గంలో టీవీకే తరపున  విజయ్‌ శరవణన్‌ గెలిచారు. అయితే, ఆయన  తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో చిందులేసిన వీడియో తాజాగా  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గ విజయాన్ని పురస్కరించుకుని ఆయన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. చేతిలో మద్యం బాటిల్‌ పట్టుకుని నృత్యం చేస్తూ, బహిరంగ ప్రదేశంలో పొగ తాగుతూ ఆయన కనిపించడం వార్తల్లోకి ఎక్కింది.  ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై విమర్శలు బయలు దేరాయి.  

మోసం ఫిర్యాదు 
తిరుచ్చి ముసిరి నియోజకవర్గం నుంచి ఎంపికైన విఘ్నేష్‌పై పోలీసు కమిషనర్‌కు మనీ లాండరింగ్‌ ఫిర్యాదు చేరింది. ముసిరికి చెందిన కర్పగనాథన్, ఆయన భార్య లక్ష్మి తిరుచ్చి పోలీసు కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తమ కంపెనీ విస్తరణ కోసం ఒక భవనాన్ని డిజైన్‌ చేసే విషయంగా విఘ్నేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. అయితే, ఆయన పని పూర్తి చేయకుండామోసం చేశారని ఆరోపించారు. సుమారు రూ.10 లక్షలు ఆయనకు చెల్లించినట్టు ఆరోపించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇంకా పదవీ ప్రమాణం చేయకుందే వివాదాలు కొని తెచ్చుకోవడం చర్చకు దారి తీస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement