తమిళనాడు ప్రజా తీర్పు బయటకు వస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు.. అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. దీంతో గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీల అధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు చూస్తున్న ఎదురుచూపులకు ఎండ్‌కార్డు పడనుంది.
టీవీకేకు కంగ్రాట్స్: మోదీ
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై మోదీ స్పందన
- ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు
- ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం
- టీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలు
రెండు స్థానాల్లోనూ విజయ్ గెలుపు
- తమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం
- పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపు
- పెరంబూర్, తిరుచ్చిలో గెలిచిన విజయ్
ఏ పార్టీకి ఎన్ని ఓట్లు
- విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు
- డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు
- ఒంటరిగా డీఎంకే సాధించిన ఓట్లు 83 లక్షలు
- ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు
- ఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు 77 లక్షలు
రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకే
- పుంజుకున‍్న డీఎంకే
- రెండో స్థానంలోకి వచ్చిన డీఎంకే
- టీవీకే 107 స్థానాల్లో ఆధిక్యం
- డీఎంకే 59 స్థానాల్లో ఆధిక్యం
- డీఎంకే 47 స్థానాల్లో ఆధిక్యం
ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు
- టీవీకే చీఫ్ విజయ్ కీలక ఆదేశాలు
- అభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపు
- ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు
స్టాలిన్ రాజీనామా!
- కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న స్టాలిన్
- సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్
ఒక్కో మెట్టు ఎక్కాడు: విజయ్ తండ్రి
- టీవీకే గెలుపుపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ హర్షం
- తమిళ ప్రజలకు మేలు చేయాలనేదే లక్ష్యం
- గెలుపుపై విజయ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నాడు
- ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నాడు
👉తమిళనాట టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ జట్టుకంటే అవకాశం
- కాంగ్రెస్‌కు 5 సీట్లు వచ్చే అవకాశం
- సీపీఎం 2, సీపీఐకి 2 వచ్చే సూచనలు
- తమిళనాడులో కేవల 2 స్థానాల్లోనే బీజేపీ లీడ్
- అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ

👉తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సంచలనం
- వంద స్థానాలు దాటి దూసుకుపోతున్న టీవీకే
- తమిళనాడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే
- హంగ్ దిశగా తమిళనాడు
- టీవీకే విజయ్ నివాసం దగ్గర భద్రత పెంపు
- చెన్నైలోని విజయ్ ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులు
- విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానుల సంబరాలు
- విజయ్ తండ్రి నివాసంలో సంబరాలు
- తమిళనాడులో డీఎంకే సూర్యుడు అస్తమించడం ఖాయం: టీవీకేఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు
👉ఓటమి దిశగా సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
- సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్నకొళతూర్ యోజకవర్గంలో టీవీకే ముందంజ
- డిప్యూటీ సీఎం పోటీ చేస్తున్న చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో సైతం టీవీకే ముందంజ
- కొలతూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ముందంజ
- చెపాక్-తిరువళ్లికేని నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి సెల్వం ముందంజ
👉విరుంబాకంలో టీవీకే ఆధిక్యం
విజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ లీడ్
కొళత్తర్‌లో వెనుకంజలో సీఎం స్టాలిన్
చెపాక్‌లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ
👉చెన్నైలో బోసిపోయిన డీఎంకే కార్యాలయం
ఆఫీస్ దగ్గర కనిపించని డీఎంకే కార్యాలయం
టెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలు
ఎన్నికల ఫలితాల షాక్‌తో బోరున విలపించిన డీఎంకే శ్రేణులు

👉తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యం
- టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత
- విజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలు
- జెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులు
- కేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం
👉ఆధిక్యం ఇలా..
విజయ్ టీవీకే పార్టీ 103
అన్నాడీఎంకే 76
డీఎంకే 53
👉తమిళనాడులో సంచలన ఫలితాలు
- తమిళనాట వెలువడుతున్న సంచలన ఫలితాలు!
- లీడ్‌లో సెంచరీ కొట్టిన విజయ్ టీవీకే
- ఎర్లీ ట్రెండ్స్‌లో.. 100 సీట్ల ఆధిక్యం
- టీవీకే దూకుడు దాటికి డీఎంకే విలవిల
- రెండో స్థానంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే
- మూడో స్థానానికి పరిమితమైన డీఎంకే కూటమి
- ఐదు చోట్ల ఆధిక్యంలో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్
- డీఎంకే ఆఫీస్ ముందు టెంట్ల తొలగింపు
- తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో ఆధిక్యంలో విజయ్
- విజయ్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు
👉తమిళనాడులో ఒక్కసారిగా మారిన సీన్
అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చిన టీవీకే
డీఎంకేను దాటి దూసుపోతున్న టీవీకేతమిళనాడు ఫలితాలపై సర్వతా ఉత్కంఠ
తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్‌లో టీవీకే ముందంజ
రెండో స్థానంలో డీఎంకే
పోస్టల్ బ్యాలెట్ మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే
తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో మొదటి స్థానానికి దూసుకొచ్చిన టీవీకే
👉తమిళనాడులో డీఎంకే ఆధిక్యం
- పలు స్థానాల్లో రన్నరప్‌గానే అన్నాడీఎంకే
- రెండో స్థానంలో అన్నాడీఎంకే, టీవీకే మధ్య హోరాహరీ
- కొళత్తూర్‌లో డీఎంకే కన్నా టీవీకే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యం
👉చెన్నై సిటీలో డీఎంకే, టీవీకే హోరాహోరీ
- కొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందజ
- చెపాక్‌లో ఉదయనిధి ఆధిక్యం
- తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో విజయ్ వెనుకంజ
- మైలాపూర్‌లో తమిళిసై వెనుకంజ
- తిరుచ్చి వెస్ట్‌లో మంత్రి నెహ్రూ వెనుకంజ
- ఎడప్పాడిలో పళనిస్వామి ముందంజ
- కోయంబత్తూరు సౌత్‌లో సెంథిల్ బాలాజీ ముందంజ

👉పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
- డీఎంకే -22 స్థానాలు
- ఏఐడిఎంకే -5 స్థానాలు
- టీవీకే 4 స్థానాల్లో ముందంజ
👉పెరంబూర్‌లో విజయ్ ముందంజ
- కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్‌లో డీఎంకే ఆధిక్యం
#WATCH | Tamil Nadu Assembly Elections | Heavy security arrangements have been put in place at the counting centre set up at Loyola College in Chennai, where votes for several key Assembly constituencies will be counted today. pic.twitter.com/JEQmLTjLhh
— ANI (@ANI) May 4, 2026
👉తమిళనాడులో కౌంటింగ్ ప్రారంభం
- మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బంది
- చెన్నైలోని లయోలా కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు
- పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
👉మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు?
నేడు తమిళనాడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్
ఉదయం 8 గంటల నుంచి ఓట్లని లెక్కించనున్న సిబ్బంది
234 స్థానాల్లో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికలు
5.73 కోట్ల మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తమిళనాడులో రికార్డ్ స్థాయిలో 85 శాతం పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
మొదట పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎం ఓట్లను కౌంట్ చేయనున్న అధికారులు
మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు... అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠ
డీఎంకే, ఏఐ డిఎంకె కూటమి, విజయ్ టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీ
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, ప్రత్యేకించి కేంద్ర బలగాలతో పహారా
రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ విధుల్లో మొత్తం 3.6 లక్షల మంది సిబ్బంది
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్
కొళత్తూరు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళని స్వామి, చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీ
పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్
కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం
అక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటు
హంగ్ ఏర్పాటయ్యే అవకాశం అంటూ సర్వేలు వెల్లడి
క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే
మహాబలిపురం వద్ద రిసార్ట్‌లు బుక్ చేసిన టీవీకే అధినేత విజయ్
గెలిచిన అభ్యర్థులు వెంటనే రిసార్ట్‌కి రావాలని ఆదేశం..
ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాలు
👉రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.
👉తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది.


