సీఎం స్టాలిన్‌ పరాజయం.. ఎవరా? టీవీకే గెలుపు గుర్రం | Tamil Nadu Chief Minister MK Stalin loses from Kolathur as Vijay TVK rises in state | Sakshi
Sakshi News home page

సీఎం స్టాలిన్‌ పరాజయం.. ఎవరా? టీవీకే గెలుపు గుర్రం

May 4 2026 4:33 PM | Updated on May 4 2026 5:44 PM

Tamil Nadu Chief Minister MK Stalin loses from Kolathur as Vijay TVK rises in state

సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. కొళత్తూరులో సీఎం స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు విజయం సాధించారు. 

తమిళనాడులోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో కొళత్తూరు ఒకటి. ఇది సీఎం ఎంకే స్టాలిన్‌ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (2011, 2016, 2021) ఆయన ఇక్కడ గెలుపొందారు. ఈసారి మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. 

కొళత్తూరులో సీఎం స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు విజయం సాధించారు. ఈ ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లో విజయ్‌ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. మధ్యాహ్నం 4.15 గంటల వరకు టీవీకే 105 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 76 స్థానాల్లో, ఏడీఎంకే 53 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.

టీవీకే విజయానికి యువ ఓటర్ల మద్దతు, అధికార వ్యతిరేక భావజాలం, బలమైన గ్రామీణ స్థాయి ప్రచారం కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితం తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ దిశలో కీలక మార్పును సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement