ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా? | Head Shave Dare Backfires BJP Leads In Kolkata And South 24 Parganas As TMC Trails, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా?

May 5 2026 1:24 PM | Updated on May 5 2026 2:01 PM

Head Shave Dare Backfires BJP Leads in Kolkata as TMC Trails

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కోల్‌కతా, దక్షిణ 24 పరగణాల్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచినా తమ ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత డెరెక్ ఓబ్రియన్ విసిరిన సవాలు ఇప్పుడు ఆ పార్టీకే రివర్స్‌ అయ్యింది. ఇప్పుడు టీఎంసీ నేతలు తమ సవాల్‌ను నిలబెట్టుకుంటారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ కలుగుతోంది.

గత నెలలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. ‘మేము గొప్పలు చెప్పదలుచుకోలేదు, మే 4 లెక్కింపు రోజు వరకు వేచి చూస్తాం. కోల్‌కతాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా మా ఎంపీ ఒకరు గుండు కొట్టించుకుంటారు’ అని సవాల్ విసిరారు. దక్షిణ 24 పరగణాల్లోని 31 స్థానాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని ఆయన నాడు తెలిపారు. 2021 ఎన్నికల్లో సాధించిన 215 సీట్ల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎన్నికల సమయంలో ధీమా వ్యక్తం చేశారు. అయితే తుది ఫలితాలలో టీఎంసీ కనీసం 100 మార్కును కూడా దాటలేకపోయింది.

ఇది కూడా చదవండి: బిగ్‌ బ్రేకింగ్‌: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement