సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్‌ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.
గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్‌కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్‌కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్‌ను పంచుకున్నాడు.

ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన వరుణ్ చక్రవర్తి 10 వికెట్లు పడగొట్టాడు.
ఈ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వరుస విజయాలతో అదరగొడుతుంది. లేట్‌గా ఫామ్‌లోకి వచ్చిన రింకూ సింగ్ తన ఫినిషింగ్ టచ్‌తో కేకేఆర్‌కు రెండు విజయాలు సాధించి పెట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
మరో 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. కేకేఆర్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌తో, ఆర్సీబీతో, గుజరాత్‌తో, ముంబైతో ఆడాల్సి ఉంది.
ఇక వరుణ్ చక్రవర్తి దేశవాలీ క్రికెట్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. టీమిండియా తరఫున 4 వన్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 91 మ్యాచ్‌లాడిన వరుణ్ చక్రవర్తి 110 వికెట్లు తీశాడు.


