తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర | A record 23 women MLAs take their place in the 2026 | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర

May 7 2026 7:58 AM | Updated on May 7 2026 11:41 AM

A record 23 women MLAs take their place in the 2026

రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.  

సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్‌  టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్‌ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే  ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. 

వీరిలో అత్యధికంగా 13 మంది  విజయ్‌ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత విజయకాంత్‌లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్‌ సతీమని లీమా రోజ్‌తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 

25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు 
మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్‌ పాండియన్, ఆస్టిన్‌ ఉన్నారు. ఈ కూటమిలోని  ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్‌ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్‌ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్‌ ఉన్నారు.  

జస్ట్‌ మిస్‌ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ 
తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్‌ మిస్‌ కావడం  ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్‌ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. 

ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్‌ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని  తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి  అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్‌ మిస్‌ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని  జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement